S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

01/31/2016 - 00:13

కవిత్వంలో ఎర్రన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రకాశం జిల్లా ఎందరో కవులకు జన్మనిచ్చిన తల్లి ఒడి. ఎందరెందరో మహనీయులు ఓనమాలు దిద్దుకున్న తొలి ఒడి. పలు జిల్లాలు, రాష్ట్రాల కవులు, రచయితలంతా ఆత్మీయంగా కలుసుకున్న అరుదైన వేదిక ప్రకాశం జిల్లా రచయిత సంఘం స్వర్ణోత్సవ వేడుక. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగిన ఈ స్వర్ణోత్సవ సంబరాలు తెలుగుకు వెలుగునిచ్చాయి.

01/19/2016 - 00:21

గోవిందాపురంలో గోచిగూడాలో ‘‘డింగ్ డాంగ్’’ ఆశ్రమం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వెలిసింది. తెల్లారేసరికి ఆ ఆశ్రమం చుట్టూ జనసమూహం. ‘ఈయన నిజమైన స్వామిజీయేనా?’ పిన్ని అనుమానంగా అడిగింది అనసూయ ఆశ్రమంలోకి అడుగుపెడుతూ.

01/11/2016 - 00:36

‘‘మీ కథల్లో సస్పెన్స్ అద్భుతంగా ఉంటుందండీ’’ అంది రాగిణి, నన్ను ఆరాధనగా చూస్తూ.
చిన్నగా నవ్వాను.

01/02/2016 - 21:59

అడవిలో ఆ రాత్రి వెనె్నల పచ్చపువ్వులా విరగకాస్తోంది. ఆ రాత్రి ఆహారానే్వషణలో ఉన్న యువకుడైన మగ ఎలుగుబంటుకు తారసపడింది అదే వయసులో ఉన్న మరో ఆడ ఎలుగుబంటు. ఇద్దరూ కళ్లూ కళ్లూ కలుపుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు ఎలుగుబంట్లూ ఒకదాన్నొకటి తరుముకుంటూ, ఒకదాని మూతి మరొకటి నాక్కుంటూ ప్రణయకలాపాలు సాగిస్తున్నాయి. ఒకరి నొకరు తరుముకుంటూ చెట్లమీద ఆడుకుంటున్నారు. ప్రియురాలు మామిడి చెట్టెక్కింది.

12/26/2015 - 21:11

ఇంటి పనులు చక్కదిద్దుకుంటూ కుటుంబాన్ని శ్రీవారి సంపాదనతో నడిపించుకొస్తున్న గణపతి గారి భార్య రమ. గణపతి వృత్తిరీత్యా చిరుద్యోగం చేస్తున్నప్పటికీ అతని విద్యార్హత ఇంజనీరింగ్. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి ఉద్యోగం కంటే పెళ్లి చేసుకోవడం చాలా సులభం అని గ్రహించి పెళ్లి చేసేసుకున్న తెలివైనవాడు గణపతి.

12/19/2015 - 22:35

‘‘సాయిలక్క తెమలిరా... ఇప్పటికే సూరీడు తన పెతాపం చూపిస్తున్నాడు. తొరగా వెళ్లబారకపోతే మేస్తిరి పనిలోకి రానీడు’’ గుడిసె బయటనుండి కేకేసింది రాములమ్మ.
‘‘వస్తాన్నానే మీ బావకి గంజార్చి అస్తా’’
‘‘ఏం ..బావ ఈ దినం పనికెళ్లడా’’?
‘‘ఆ... ఓ పూటెల్తే తాగేసి రొండుపూట్లు ఇంట్లోనే తొంగుల్లా..
ఈ మొగోళ్లతో ఏగలేక సస్తాన్నాంగదే.. ఇక పా’’... రోడ్డు వెంబడి నడుస్తూ మాట్లాడుతున్నారు వాళ్లు.

12/12/2015 - 22:46

గోవిందం చిరకాల మిత్రుడు గోపాలానికి ఫోన్ చేశాడు. ‘‘ఓరే గోపాలం వచ్చే ఆదివారం మీ ఊరు వస్తున్నా’’
గోపాలం ప్రశ్నార్థకంగా ముఖంపెట్టి
‘‘నేను ఈ ఊర్లో స్థిరపడి ఇనే్నళ్లయితే నువు ఒక్కసారీ రాలేదు..అకస్మాత్తుగా ఏంటి నీ ప్రయాణం’’ అన్నాడు.
‘‘అదేరా.. అదేరా... వచ్చే ఆదివారం మీ ఊళ్లో.. నాకు ఒక సన్మాన కార్యక్రమము ఉంది’’ సిగ్గుపడుతూ చెప్పాడు గోవిందం.

12/07/2015 - 08:57

సమయం రాత్రి తొమ్మిది గంటలు...

11/29/2015 - 03:48

శంకరయ్య చెన్నపట్నంలో చేయి తిరిగిన గొప్ప పేరు పొందిన ఆయుర్వేద వైద్యుడు. ఆరోజు ఆయన తన శిష్యులతో పొగబండెక్కి నెల్లూరుకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజు ఉదయానే్న గుర్రపు బండ్లు కట్టించుకొని ఉదయగిరికి బయలుదేరాడు. మొదటి గుర్రపుబండిలో ఆయన తన సామానుతో కూర్చుంటే, రెండవ గుర్రపు బండిలో అతని ముగ్గురు శిష్యూలూ తమ సరంజామాతో బాటు వైద్యగ్రంధాలూ ఎక్కించారు.

11/22/2015 - 04:34

ఆదివారం అయినందున నెల్లూరు చిల్డ్రన్స్ పార్కు సందడిగా ఉంది. అరుణోదయం అందాలు తనివితీరా చూడాలనిపిస్తోంది. పిల్లగాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

Pages