S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

06/25/2017 - 01:18

నువ్వూ నేనూ..
అంతా భూమిపుత్రులమే
ఈ పుడమితల్లి
తన పచ్చటి ఒడిలో
మనిషి బతుకును పూదోటగా
చేసి కోడి తన రెక్కలచాటున
పిల్లల్ని దాచినట్లు
భూమాత కాలుష్యపు
బొంతగద్దల నుండి కాపాడుతోంది!

06/25/2017 - 01:14

ఖలేజాముసలిది కథ బాగుంది

06/19/2017 - 23:32

ఉదయగిరి చుట్టూ ఉన్న కీకారణ్యం ఎన్నో పల్లెలకు జీవనాధారం. ప్రకృతి ప్రసాదించిన ఆ అడవిసంపద ఎన్నో కుటుంబాలను బ్రతికిస్తోంది. అక్కడ చెట్లకు కొదవలేదు. జంతువులకు కొదవలేదు. పక్షులకు కొదవలేదు. పండ్లకు కొదవలేదు. ఆకులకు కొదవలేదు. పల్లెవాసులు కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటారు. కుందేళ్లను పట్టుకుని అమ్ముకుంటారు. కౌంజుపిట్టలు, అడవికోళ్లు పట్టుకుని అమ్ముకుంటారు.

06/19/2017 - 23:27

ఎవరో మంత్రించినట్లు నడుస్తోందీ ప్రపంచం
ప్రేమ గానాల మాటున ఏదో రహస్యాన్ని దాచి
మనిషిని ప్రపంచం మధ్య బొడ్రాయిలా నిల్పి
పూరేకుల్ని వెదజల్లినట్లు
కుటుంబాన్ని చల్లుకుంటూ వెళ్లిపోతున్నారు
మంత్రించిన వాళ్లెవరో పులకించిపోతున్నారు
ప్రాపంచిక ఫలాల్నెవరో అనుభవిస్తున్నారు
ప్రవహిస్తున్న జీవనదుల్లో
నల్లమందులాంటిదేదో కల్పి రహస్యంగా

06/19/2017 - 23:28

అదో దట్టమైన అడవి. అందులో ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయ. అందులో రెండు కాకులు కూడా ఉన్నాయి. ఒకరోజు వాటిలో ఒక మగ కాకి ఆడ కాకితో ఇలా అంది. ‘మానవులు ఎంతో గొప్పోళ్లు వారు అన్ని రుచులూ తింటారు. రెండు చేతులా సంపాదిస్తారు. అన్ని సుఖాలూ అనుభవిస్తున్నారు. మనమూ ఉన్నాం ఎందుకు?’ అంది నిరాశ నిస్పృహతో. ‘ఈ అడవిలో విత్తనాలు, క్రిమికీటకాలు తిని బతుకుతున్నాం. ఒక రుచా పచా.

06/11/2017 - 01:28

‘‘ఆమె తల్లి కాబోతోంది’’ అన్న డాక్టరు గారి సూచన రవితేజ మనసుని కలవరపెడుతోంది. ఎంత తమాయించుకుందామన్నా, సమాధానపరచుకుందామన్న - ఆరాటం ఎక్కువౌతుంది’’. ‘‘ముల్లుపై అరిటాకు పడినా, అరిటాకు ముల్లుని గుచ్చుకున్నా’’ సమస్య పరిష్కారం ఛిన్నాభిన్నం అవుతుంది. బుద్ధికి, మనస్సుకి అంతర్యుద్ధం అవుతోంది.

06/11/2017 - 01:27

తాతయ్య బడి

06/11/2017 - 01:26

నాలుగురోడ్ల కూడలిలో కథ బాగుంది

06/11/2017 - 01:25

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.

05/13/2017 - 21:34

అది మే నెల రెండోవారం మధ్యాహ్నం మూడుదాటి ముఫ్పై నిమిషాలు అవుతోంది.
నెల్లూరు సౌత్ స్టేషన్ రెండు ప్లాట్‌ఫారాలు ఎండకొలిమిలో కాలిపోతుండటంతో మెమూ ట్రైన్‌కు టిక్కెట్టు కొన్న ప్రయాణీకులు అట్టే ప్లాట్‌ఫారాల వైపునకు వెళ్ళలేక చిన్న నీడ కోసం సైతం పరుగులు తీస్తూ ఉండటంతో ప్లాట్‌ఫారాలు రెండూ చూసే దానికి ఖాళీగానే కన్పిస్తూన్నాయి.

Pages