S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

09/05/2016 - 03:24

ఓ కవీ..నువ్వు ధన్యజీవివి
నీ భావాలను సొగసైన రెక్కలుగా చేసుకుని
సాహిత్యమనే ఆకాశంలో ఎగరగలవు
అంచులూ చూడగలవు.
నీ భావాలను
బలమైన చేతులుగా మార్చుకుని
సాహిత్యమనే సముద్రంలో ఈదగలవు
లోతులూ చేరగలవు
నీ భావాలను ముచ్చటైన లిపిగా మార్చుకుని
అందమయిన ఈ సృష్టినే చూపగలవు
అందరినీ అలరించగలవు.
ఓ కవీ! నీ కలం
ఆ విద్యాదేవి హస్తాన విరిసిన కమలం

09/05/2016 - 03:20

డాక్టర్ మధుకర్ కారు సడన్ బ్రేక్‌తో ఆగిపోయింది. ఏమై ఉంటుంది కారుకి. ఈరోజే పెట్రోలు ఫుల్ చేశానే మరి ఎందుకు ఆగి ఉంటుంది తెలీడం లేదు. బయట భోరున వర్షం. ఆ వర్షం కారణంగా కరెంట్ కూడా లేదు. మెకానిక్ మస్తాన్‌కు ఫోన్ చేస్తే వెళ్లడం లేదు. కారు దిగి తనకు తోచిన రిపేర్లు చేశాడు డాక్టర్ మధుకర్. ఊహు కారు నడవడానికి మొరాయిస్తోంది. ఇక చేసేదేమి లేదు వర్షం వెలిసే వరకు ఎక్కడైనా నిలబడాలి అంతే తప్ప మరోదారి లేదు.

09/05/2016 - 03:26

ప్రతులకు
గురుబ్రహ్మ వేణుగోపాలస్వామి
చరవాణి : 9490916869
***

09/05/2016 - 03:15

ఆకాశంలో మేఘాలతో విహరిస్తున్నాను
పాతాళంలో నిధిగా నిక్షిప్తపై వున్నాను
భూమిపై బాటసారిగా నడక సాగిస్తున్నాను
నేనుంటేనే ఏ గ్రహానికైనా జీవశక్తి
నేను లేని చోటు జీవరాశులకు ప్రాణవిముక్తి
చెట్టుకైనా..చేనుకైనా..పక్షికైనా..పశువుకైనా..
మనిషికైనా..మహోన్న శక్తికైనా..నేనే జీవనాధారం
నిరంతరం నడక సాగిస్తూనే ఉంటాను
ఆగితే నా కాళ్లు నొప్పెడతాయి

09/05/2016 - 03:07

గత వారం మెరుపులో ప్రచురించిన నగరానికి ఆవల కథ చాలా బాగుంది. మెరుపులో చాలాకాలం తర్వాత ఓ మంచి ఆసక్తికరమైన కథను చదవామన్న భావన కలిగింది. రచయిత కె రవిశేఖర్ విభిన్న కోణంలో ఆలోచించి కథను నడిపిన తీరు రక్తికట్టింది. బాంబుపేలుళ్లలో మరణించిన వారు దేహంపై ఉన్న భ్రాంతితో ఇంకా జీవించి వున్నట్లే చూపిన ప్రయత్నం బాగుంది. వారి సంభాషణలు అంతా కొత్తగా సాగాయి.

08/31/2016 - 05:13

కృష్ణపక్షం.. మసక వెనె్నల.. చీకట్ని మింగిన కొండచిలువలా నగరం అచేతనంగా వుంది. ఎవరూలేని ఏకాంతంలో చీకటి ఎన్నో ఊసులు చెబుతుంది. నిశ్శబ్దంలాగా ఎంతో అందమైనది. రెండు చేతులు ప్యాంటు జేబులో వేసుకొని, అప్పుడప్పుడూ చలికి చేతులు రుద్దుకుంటూ తిరిగి జేబులో పెట్టుకుని విశ్రాంతిగా నడుస్తున్నాడు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ పోలీసుజీపు అతనిని దాటుకుంటూ వెళ్లిపోయింది.

08/31/2016 - 05:09

గతవారం మెరుపులో కృష్ణ పుష్కరాల సందర్భంగా ప్రచురించిన పుష్కర స్నానం..అనంత పుణ్యఫలం బాగుంది. పుష్కరాల గురించి చాలా తెలియని విషయాలను విపులంగా వివరించినందుకు విష్ణుబొట్ల రామకృష్ణ గారికి ధన్యవాదములు. అసలు పుష్కరస్నానం ఎలా చేయాలి, ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి అంటూ వర్ణించిన తీరు బాగుంది. మంచి విషయాలను పాఠకులకు అందించిన విష్ణుబొట్ల గారికి ధన్యవాదములు.

08/14/2016 - 21:34

కృష్ణపక్షం.. మసక వెనె్నల..

08/07/2016 - 22:14

వర్గాలు,వర్ణాలు వదిలితేనే స్నేహం
కలహాలు, ద్వేషాలు తెలియని స్నేహం
మధురం మధురం స్నేహం
సృష్టిలో తీయనిది స్నేహం
జ్ఞాపకాల చిరునామా స్నేహం
జీవితంలో తీయని మలుపు
మధురం మధురం స్నేహం
ఆపదలో ఆదుకొనే అమృతహస్తం
ఆనందానికి ప్రియమైన నేస్తం
బాంధవ్యాల కన్న మిన్న నేస్తం
మధురం మధురం స్నేహం
స్నేహానికి లేదు నిర్వచనం

08/07/2016 - 22:10

త్యాగమనే జలంతో ఎదిగే
పచ్చని మొక్క
స్వార్ధమనే కలుషమంటని
అగ్నిహోత్రం
జడివానకు జడవని గిరి శిఖరం
సుడిగాలికి కొడిగట్టని దివ్యదీపం
ఋతువేదయినా శ్రుతి తప్పని గానం
నీడ కూడా దూరమైన
కటిక చీకటిలో
వీడిపోనని తోడు నడిచే వెలుగురేఖ
నీ గుండె గాయానికి చెమ్మగిల్లే నయనం
నీ ఆనందానికి పొంగిపోయే హృదయం
తల్లితండ్రి గురువు దైవం సర్వస్వం

Pages