S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

12/31/2016 - 23:03

విశ్వమోహన్ గారికి ఈ మధ్య జీవితం చాలా నిస్సారంగా గడచిపోతున్నట్టు అన్పిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాత్రి అంతే తప్ప ఈ జీవితంలో ఇక ఏ మార్పులేదా? ఎందుకు తన జీవితం ఇంత ఉదాసీనంగా మారిపోయింది, భార్య మాలిక ఆర్నెళ్ల క్రితం ఉన్నట్టుండి చనిపోయింది. అంతకుముందు తనకు మాట్లాడే ఒక తోడు తప్ప భార్యతో పెద్దగా అనుబంధం కూడా అతడికి లేదు.

12/25/2016 - 07:54

ఆ రోజు ఉదయం తెలతెలవారుతుండగా దుర్గంపల్లి గ్రామంలో అడుగుపెట్టింది డెబ్బయ్యేళ్ల ముసలిది. తల నెరిసి ముగ్గుబుట్టలా ఉంది. కళ్లు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. ముక్కు బయటికి పొడుచుకు వచ్చినట్లు పొడుగ్గా ఉంది. బోసినోరులా కనిపిస్తుంది గానీ, సూదంటురాళ్లలాంటి గట్టి పళ్లున్నాయి. బుగ్గలు లోపలికి లాక్కుపోయినట్లు దవడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అస్తిపంజరానికి కోక, రవికె తొడిగినట్లు చాలా బక్కచిక్కి ఉంటుంది.

12/18/2016 - 22:48

అది... గరిడి
ఒకప్పటి వ్యాయామ శాల. రంగు వెలిసిపోయి పాతబడిపోయింది. ఎలా ఉందంటే? ఒకప్పుడు రామారావు సినిమాలతో కళకళలాడి మూసేసిన సినిమా హాలులా ఉంది. ఆ గది లోపల పాత వ్యాయామపు సామానులేమీ లేవు. అవన్నీ ఎవరి ఆకలికో ఆహుతైపోయినట్టున్నాయి.
ఆ గదిలో ఓమూల పీర్ల పండక్కి ఊరేగించే పంజా, ఓ ఆంజనేయస్వామి పటము దుమ్ముకొట్టుకొనిపోయి ఉన్నాయి. ఒకప్పటి మత సామరస్యానికి ప్రతీకలుగా.

12/18/2016 - 22:47

నెల్లూరు బస్సు రాగానే ఎక్కి కూర్చొన్నాడు విష్ణు. సేల్స్‌మేనేజర్ కాబట్టి రోజూ ఏదో ఒక జిల్లాకి తప్పకుండా వెళ్లాలి. ఈరోజు నెల్లూరు, రేపు చిత్తూరు, ఎల్లుండి కర్నూలు రోజు తిరగలేకపోతున్నాను అనుకుంటూ తలపట్టుకున్నాడు. సెల్ తీసి గేమ్స్ ఆడటం మొదలెట్టాడు.

12/18/2016 - 22:40

గతవారం మెరుపులో రేవతి గారు గొప్పగా మలిచిన నీతోనే నేను కథ చాలా బాగుంది. కథ చాలా చిన్నది కానీ అందులో దాగివున్న సందేశం ఎంతో గొప్పది. వాస్తవానికి దగ్గరగా, నేటి ఆధునిక సమాజంలో ప్రతి వంద ఇళ్లల్లో 70 ఇళ్లల్లో పరిస్థితి ఇలాగే ఉంది. వయస్సుమళ్లిన తల్లిదండ్రులను చూడాలనే తపన కుమారుల్లో ఎంతో కొంత దాగివున్నా వారి కుటుంబ పరిస్థితులరీత్యా చూడలేకపోతున్నారు.

12/16/2016 - 23:23

ఫోన్ రింగవుతూ ఉంది. మెలకువ వచ్చి లేచి ఫోన్ తీసి చూసాడు ఆనందరావు. టైమ్ 4 గంటలు చూపుతోంది. ఫోన్ చేసింది ఆనందరావు అమ్మగారు తులశమ్మ అద్దెకు వుండే ఇంటి ఓనరు రాజారాము. కంగారేసింది ఆనందరావుకి. ఇంత పొద్దునే్న ఫోన్ చేశాడంటే ఏదో సమస్య అయ్యే ఉంటుంది అనుకొని మళ్లీ కాల్ చేస్తాడేమో అని ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నాడు.
ఆనందరావు పడే టెన్షనంతా వసంత గమనిస్తూనే ఉంది. ‘్ఫన్ ఎక్కడినుండి?’ అని అడిగింది.

12/16/2016 - 23:20

ఈ సమాజంలో నాలుగు మంచిమాటలు చెప్పేవారే కరవయ్యారు. తమ రచనా చమత్కృతితో నాలుగు మంచి మాటలు చెప్పి సమాజాన్ని ఉత్తేజితులను చేయాలనే సంకల్పం కలవారు బహు అరుదు. అటువంటి వారిలో రాచపాళెం రఘు ఒకరు.

12/16/2016 - 23:15

గతవారం మెరుపు ప్రచురించిన మార్పు కథ సందేశాత్మకంగా సాగింది. సమాజంలో ఒక సాధారణ కూలీ తన కుటుంబం కోసం పడే తపన, కష్టపడి పనిచేసే తత్వం, మంచితనంతో అందరిని కలుపుకుపోయే గుణం గల వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చాయి. చివరికి అతను ఎలాంటి జీవితం గడిపాడు అనే కోణంలో కథను అందించిన తీరు బాగుంది. చివరికి అతనికి తోటి కూలీలు సాయపడంతో పాటు వారిలో గొప్ప మార్పు రావడం కథలో కొసమెరుపు.

12/11/2016 - 01:36

అప్పటిదాకా ఆడి ఆడి అలసిపోయిన భాస్కర్‌కు ఆకలి దంచేస్తా వుంది. పరుగు పరుగున వెళ్లి, ‘‘అమ్మా!... మో! కూడెయ్‌మా!’’ అన్నాడు.
కొడుకు అరుపు విని, ఆమె గబగబా పోయి ఒక సంగటి ముద్దను సగం తుంచి గినె్నలో వేసుకుని వచ్చింది. పాపం, భాస్కర్‌కు ఆ సంగటిని చూడగానే కడుపులో మండే ఆకలి సల్లగా ఎక్కడికో పోయింది. ఏడుపు మొహం పెట్టుకున్నాడు.
‘‘తినరా! అంది’’ అమ్మ.

12/11/2016 - 01:32

ఓ సంగీత సౌరభం నేలరాలింది
ఓ సుస్వర, సుమధుర గానామృతం
సుదూర తీరాలకేగింది
ఓ అపర త్యాగరాజు ఆహుతులను వీడి
అమరులయ్యారు
ఓ వెండితెర స్వరధ్రువతార అదృశ్యమైంది
ఓ రాగాల సృష్టికర్త అంతర్ధానమయ్యారు
ఓ వాగ్గేయకారుడు స్వర్గానికేతెంచారు
ఓ సంగీత దిగ్గజం తనువు చాలించింది
ఓ స్వరకర్త (మహాభి) నిష్క్రమించారు
ఓ గాత్రమాంత్రికుడు అవని అక్కున చేరారు

Pages