S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

,
07/10/2016 - 00:08

వేసవి సెలవులు ఇవ్వటంతో బిసి బాలుర హాస్టల్ సందడిగా వుంది. అందరు తమ ఊర్లకు వెళ్లటానికి సామాన్లు సర్దుకొంటున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు, బంధువులు, హాస్టల్‌కి వచ్చి వాళ్లని తీసుకువెళ్లడానికి వరండాలో కూర్చుని వున్నారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న చింతాలయ్య, వెంకటేశు, రమేష్, ఒకే ఊరుకే క్లాసు అవటం వలన ముగ్గురు ఎప్పుడు ఒకటిగా వుంటారు. తమ ఊరికి పోతున్నందుకు చాలా సంతోషంగా వుంది.

07/10/2016 - 00:03

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.

07/10/2016 - 00:02

ఈరోజుల్లో ధనవంతుల పిల్లల పరిస్థితి ఎలా వుంది, వాళ్ల ప్రవర్తన వల్ల సమాజంలో ఎటువంటి దుష్ప్రరిణామాలు సంభవిస్తాయో కళ్లకు కట్టినట్లు వివరించిన కథ రియల్ పరదాల. రచయిత ఆలకుంట రెడ్డిప్రసాద్ గారిని ముందుగా అభినందించాలి చక్కటి సందేశాత్మక కథను ఎంతో నేర్పుగా తీర్చిదిద్దినందుకు.

07/03/2016 - 05:28

రాత్రి పనె్నండు గంటలు కావస్తోంది. పరదాలకు నిద్రపట్టట్లేదు. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. అతన్ని విషాదం ఆవరించి ఉన్నది. నిన్నటి నుంచి జరుగుతున్న విషయాలు అతనిని భయపెడుతున్నాయి. భవిష్యత్ గురించి అతను తీవ్రంగా ఆలోచిస్తూ, జరిగిన దాన్ని మననం చేసుకుంటున్నాడు.

,
06/27/2016 - 22:35

రా! కదలిరా!
నల్లమబ్బుల కురులు విదుల్చుకొని
కావ్యకన్యకలా
జలజల గలగల రాలుతూ
నింగిని విడిచి నేలపైకి దిగిరా!
మోడువారిన బ్రతుకులెన్నో
మొండి ధైర్యముతో నింగి వంక చూస్తూ
వేడి నిట్టూర్పుల వడగాల్పుల కోర్కెలతో
పాడి పంటలు కరువు కాగా
నీకై ఎందరెందరో ఎదురు చూచుచుండగా
కదలిరా! కలుసుకొనిరా!
చినుకువై కోర్కెల మిణుకువై

06/27/2016 - 22:31

చిన్నప్పటి నుండి చిన్నచిన్న కోరికలే తీరలేదు సీతమ్మకు. ఆమె తండ్రి ఆమెకు ఎంతో చదవాలని ఉన్నా ఎస్. ఎస్.సి.తో ఆపేసి ఒక గుమాస్తాకు ఇచ్చి పెళ్లి చేసేశాడు. కొన్నాళ్లకు అత్త ఆరళ్లు భరించలేక వేరు కాపురం పెట్టారు సీత-రఘు. పేరుకు వేరు కాపురమే అయినా రఘు ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ యివ్వలేదు. ఏదైనా అతడి పేరు మీద జరగాల్సిందే తప్ప, ఒక్క చీర కొనే స్వేచ్ఛ కూడా లేదు ఆమెకు. పులి మీద పుట్రలాగ ఆమెకు పిల్లలు కలగలేదు.

06/27/2016 - 22:29

ప్రతులకు : పెరుగు రామకృష్ణ,
డో.నెం.25-1-949, 5వ వీధి, నేతాజినగర్, నెల్లూరు-4 చరవాణి : 9849230443
**

06/27/2016 - 22:23

గత వారం మెరుపులో పెండ్యాల గాయిత్రి గారు అద్భుతంగా మలిచిన కథ సారీ వాస్తవ దృశ్యరూపం ఎస్కార్టు. ఈ కథ చదవడానికి పెద్దదిగా వున్నా చదువుకుంటూ పోతే అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపించింది. ముఖ్యంగా రచయిత ఎంచుకున్న విషయం ఎంతో గొప్ప అంశం. ముఖ్యంగా కథలను పలు రకాలుగా రాస్తూ వుంటారు కవులు. అయితే ప్రత్యేకంగా వికలాంగులపై మాత్రమే కథ రాయాలనే తలంపే ఈ కథ విజయానికి కారణం.

06/19/2016 - 08:05

మనిషి జీవితంలాంటిదే రైలు ప్రయాణం కూడ. బతుకుబండి నడవాలంటే ఎన్ని స్థాయిలు మారాలో ఈ రైలుబండిలోనూ అన్ని స్థాయిలున్నాయి. ఏ.సి. నుంచి జనరల్ దాక.

06/05/2016 - 06:24

కుండపోతగా కురుస్తున్న వర్షంలో గొడుగు వేసుకుని మరీ వచ్చిన శేషగిరిని చూసి నేనాశ్చర్యపోయాను.
‘‘ఇంత వర్షంలో వచ్చావేంట్రా? రారా!’’ అంటూ ఆహ్వానించాను, ఉబుసుపోక తిరగేస్తున్న ‘పోసుకోట పిట్ట’ తెలుగువీక్లీని పక్కన పడేసి..
శేషగిరి గొడుగు గుమ్మానికి ఆనించి, చెప్పులు విడిచి లోనికి ప్రవేశించాడు.

Pages