S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

12/16/2016 - 23:20

ఈ సమాజంలో నాలుగు మంచిమాటలు చెప్పేవారే కరవయ్యారు. తమ రచనా చమత్కృతితో నాలుగు మంచి మాటలు చెప్పి సమాజాన్ని ఉత్తేజితులను చేయాలనే సంకల్పం కలవారు బహు అరుదు. అటువంటి వారిలో రాచపాళెం రఘు ఒకరు.

12/16/2016 - 23:15

గతవారం మెరుపు ప్రచురించిన మార్పు కథ సందేశాత్మకంగా సాగింది. సమాజంలో ఒక సాధారణ కూలీ తన కుటుంబం కోసం పడే తపన, కష్టపడి పనిచేసే తత్వం, మంచితనంతో అందరిని కలుపుకుపోయే గుణం గల వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చాయి. చివరికి అతను ఎలాంటి జీవితం గడిపాడు అనే కోణంలో కథను అందించిన తీరు బాగుంది. చివరికి అతనికి తోటి కూలీలు సాయపడంతో పాటు వారిలో గొప్ప మార్పు రావడం కథలో కొసమెరుపు.

12/11/2016 - 01:36

అప్పటిదాకా ఆడి ఆడి అలసిపోయిన భాస్కర్‌కు ఆకలి దంచేస్తా వుంది. పరుగు పరుగున వెళ్లి, ‘‘అమ్మా!... మో! కూడెయ్‌మా!’’ అన్నాడు.
కొడుకు అరుపు విని, ఆమె గబగబా పోయి ఒక సంగటి ముద్దను సగం తుంచి గినె్నలో వేసుకుని వచ్చింది. పాపం, భాస్కర్‌కు ఆ సంగటిని చూడగానే కడుపులో మండే ఆకలి సల్లగా ఎక్కడికో పోయింది. ఏడుపు మొహం పెట్టుకున్నాడు.
‘‘తినరా! అంది’’ అమ్మ.

12/11/2016 - 01:32

ఓ సంగీత సౌరభం నేలరాలింది
ఓ సుస్వర, సుమధుర గానామృతం
సుదూర తీరాలకేగింది
ఓ అపర త్యాగరాజు ఆహుతులను వీడి
అమరులయ్యారు
ఓ వెండితెర స్వరధ్రువతార అదృశ్యమైంది
ఓ రాగాల సృష్టికర్త అంతర్ధానమయ్యారు
ఓ వాగ్గేయకారుడు స్వర్గానికేతెంచారు
ఓ సంగీత దిగ్గజం తనువు చాలించింది
ఓ స్వరకర్త (మహాభి) నిష్క్రమించారు
ఓ గాత్రమాంత్రికుడు అవని అక్కున చేరారు

12/11/2016 - 01:24

గతవారం మెరుపులో ప్రచురించిన నల్లధనంపై కవితలు చాలా బాగున్నాయి. అర్ధరాత్రి నిర్ణయం శీర్షికతో చాకలికొండ శారదగారు రాసిన కవిత సామాన్యుల కష్టాలను వర్ణించింది. అలాగే యుద్ధం పేరుతో కుర్రాప్రసాద్ గారు రాసిన కవిత ఇంకా బాగుంది. నల్లధనాన్ని స్వాగతిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు సహజమే.. భరిద్దాం అంటూ ఉత్తేజభరితంగా రాసిన ప్రసాద్‌గారికి ధన్యవాదములు. కొడవలూరు ప్రసాదరావు గారి కవిత నల్లధనమా పారిపో కూడా బాగుంది.

11/28/2016 - 23:08

2015 నవంబర్ 16వ తేదీ సోమవారం భారీ వర్షాలని టివీలో హెచ్చరికలు. ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణం చేయరు. ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రాప్రగడ గారు తన హరివంశంలో జడివానను వర్ణించిన తీరు మహా అద్భుతం. అది కేవలం వర్ణన మాత్రమే అనుకున్నాను. కాని నేడు అది నిజమైంది. కాని.. ఆరోజు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను. ఒక్కసారి గతంలోకి వెళితే..అది 1980 సంవత్సరం నవంబర్ 16వ తేదీ ఆదివారం ముప్పది ఐదు సంవత్సరాలైనా మరచిపోలేని రోజు.

11/20/2016 - 06:49

అలైక్య పెరట్లో పేపర్ చదువుతూంది. తనకు వచ్చిన లెటర్‌ని అమ్మ అందిస్తే తీసుకొంది. అది వినోద్ నుండి వచ్చింది. అంతలో అలైక్య ఫ్రెండ్ లత వచ్చింది.
‘‘హాయ్ అలైక్య!’’ అంటూ వచ్చిన లతను చూసి ‘‘హలో! అడుగులో అడుగేస్తూ చప్పుడు చేయకుండా వస్తున్నావ్!’’ అంది.
‘‘అదేం లేదు! నేను మామూలుగా ఎప్పటిలాగానే వచ్చాను, నీవేమో బృందావనంలో కృష్ణుని కోసం ఎదురు చేసే రాధలా చేతిలో లెటర్‌తో పరధ్యానంలో ఉన్నావు!’’

11/12/2016 - 22:16

చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదు... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో... అన్నది పెద్దల మాట. అరచేతిలో సాంకేతికత ఇమిడిపోతున్నా... ప్రజాజీవనాన్ని ఆధునికత ఎంతగా ప్రభావితం చేస్తున్నా... బ్లాగులు, వెబ్‌సైట్లు నెట్టింట్లో వచ్చి పడుతున్నా.... పుస్తకానికున్న ఆదరణ నాటికీ నేటికీ వనె్న తగ్గలేదన్నది వాస్తవం. పుస్తక పఠనంపై ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన కేవలం ఓ విమర్శగానే మిగిలిపోయంది.

11/12/2016 - 22:02

నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు ప్రత్యేక పోటీలు నిర్వహించడంతో పండుగ వాతావరణ నెలకొంది. ఎల్‌కేజి నుంచి 2వ తరగతిలోపు విద్యార్థులు రెండు నిమిషాల వ్యవధిలో పద్యాలు చెప్పేవిధంగా, 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మూడు నిమిషాల సమయంలో పద్యాలు స్పష్టంగా పలికేవిధంగా ఈ పోటీలు నిర్వహించారు.

11/06/2016 - 08:08

కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్తవారి పరిచయం ఎలా ఉంటాయోనని ఆలోచిస్తూ జోగివారిపల్లెలో ఆటో దిగాను. అది ఊరిలో బస్టాపులాగుంది. అక్కడే ఉన్న చింతచెట్టు కింద ఎత్తుగా బండలు వేశారు. బండపైన ఒక పెద్దాయన న్యూస్ పేపరు తిరగేస్తున్నాడు.
నా సూట్‌కేసుతో సహా పెద్దాయన దగ్గరకు నడిచి ‘‘నమస్తే సార్’’ అన్నాను.
పేపర్ నుంచి చూపు మరలుస్తూ చిన్నగా తలెత్తి నావైపు చూశాడు.

Pages