S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

03/26/2017 - 02:31

లక్ష్మికి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం రావడంతో చాలా ఆనందానికి లోనయ్యింది. తల్లిదండ్రులకు మిఠాయిలు, స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఆ ఆనంద క్షణంలో ఒక ఫోన్ కాల్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు విచారంలో మునిగేలా చేసింది!
ఆ ఫోన్ కాల్ సందీప్ నుండి వచ్చింది. లక్ష్మి క్లాస్‌మేట్ మరియు స్నేహితుడు.
లక్ష్మి నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్లు ఉన్నావ్ అన్నాడు ఫోన్‌లో సందీప్!

03/19/2017 - 08:45

నిండు చంద్రుడు వెలిగిపోతున్నాడు. ధవళ వస్త్రం ధరించినట్టు ధరణి సొగసులు పోతుంది. చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తున్న చంద్రుణ్ణి చూసి చాలా కాలమైంది. నగరానికి వచ్చి ఐదేళ్లు అయిపోయింది. ఇప్పుడే చూస్తున్నంత కొత్తగా గమ్మత్తుగా ఉంది చంద్రుడ్ణి చూడటం. అలాగని పెట్టెలు పేర్చినట్టుండే అపార్ట్‌మెంటెం కాదు. సిటీని ఆనుకుని ఇప్పుడిప్పుడే వెలుస్తున్న సొంతింటి కలల కాలనీ.

03/12/2017 - 05:07

మార్చి 13వ తేదీ కవిభూషణ్ ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి 125 వ జయంతి. ఆధునికాంధ్ర కవిత్వాన్ని సుసంపన్నం చేసిన భావకవి కోకిల స్వామి ఆయన. వారి పేరు చెబితే చాలు - ‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపింతునాడు’- అనే పద్యం గుర్తుకొస్తుంది. ‘ఏదేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని..

03/12/2017 - 05:01

సీ. అంతరిక్షములోని కద్వితీయమ్ముగా
నూట నాలుగు ‘శాటిలైటు’లంపి
ఉద్వేగభరితమై ఉత్కంఠతో చూచు
వేలాది హృదయాల వేడ్క నింపి
గత రికార్డులనెల్ల గత చరిత్రగ మార్చి
అగ్ర దేశాల ముందడుగు వేసి
విశ్వవిజేతగా విఖ్యాతమై నిల్చి
జగతికే మనశక్తి చాటిచెప్పి

03/12/2017 - 04:57

రైల్లో సమోసాలు కొనుక్కుంటూ మా పెట్టెలోకి వచ్చిన మూడేళ్ల కుర్రాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చు స్వాతి బాబులా వున్నాడు. మూడు దశాబ్దాల క్రితం విజయవాడలో ఉండగా మా పక్కింట్లో ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఆనందరావు దంపతులకి ఒక్క బాబు. వాడు స్వాతి నక్షత్రంలో పుట్టేడని వాడికి ఆ పేరు పెట్టమని చెప్పాం. వాళ్లు మా ఇంట్లో వున్నంతకాలం ఎక్కువగా నా దగ్గరే ఉండేవాడు. తరువాత వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు కలిగారు.

03/05/2017 - 08:41

ప్రయాణంలో చల్లగాలి ఎక్కువగా ఉంది. పూర్ణ సిటీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. తిండి, బట్ట ఖర్చు ఉండదు. కొంత జీతం ఇస్తారు. వృద్ధాప్యపు పింఛను వెయ్యి వస్తుంది. ప్రతినెలా 2,3 తారీఖుల్లో బయలుదేరి పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లి పింఛను తెచ్చుకునేది. ఈసారి నగదు రహితంలో వెళ్తే వేలిముద్రలు పడలేదు. పింఛను ఇవ్వలేదు. తిరిగి మళ్లీ పండుగ రేషన్‌కి రమ్మన్నారు. పల్లె వెళ్లినప్పుడల్లా... వంద కాగితం ఖర్చు.

02/26/2017 - 22:50

వెంకట్రావుది రాజమహేంద్రవరం. బి.కామ్ చదివి, ఓ ఆఫీస్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. అవ్వట్లేదు. ఓ రోజున అన్నీ కుదిరాయి. వాళ్లు అమ్మ, నాన్న జాతకాలు బాగా లేవని వద్దన్నారు. ‘ఇలాగా’ జీవితంలో వుండాలి, ‘ఎలాగా’ జీవితంలో ఉండాలి, ఒకోసారి ‘ఇదేనేమో’ జీవితం అనుకునేవాడు.

02/26/2017 - 22:48

ఆకలి చీడ
అడవిని అల్లుకొన్న వేళ
దారిద్య్రపు జోరుగాలి
పేద బడుగు జీవితాన్ని తాకి
కొండలచెంత అమాయకంగా నిల్చొని ఉంది
అంధకార బంధమో
అయోమయపుతనమో
వెనుకబాటుతనం ఇంకా వెక్కిరిస్తూనే
అడుగుని అనుమానించి
ఉనికినే ప్రశ్నించే పరిస్థితి
బతుకుబాటకు తెలీని వెతుకులాట
పెగుల్చుకొన్నా పైకి రాని చేదుపాట
అనంతంగా సాగిపోయే దారులు

02/20/2017 - 00:40

‘‘సూర్యుడు తూర్పున బంగారు బంతిలా ధగధగలాడుతున్నాడు’’. కిటికీలోంచి సూర్యకిరణాలు వేగంగా వచ్చి - బెడ్‌రూమ్‌లో పరచుకుంటున్నాయి.
‘‘సకల మానవాళి - మేల్కొని వారి వారి పనుల్లో బిజి అయిపోతున్నారు.’’

02/13/2017 - 22:48

బాల్కనీలో నుండి హాల్లోకి హాల్లో నుండి బాల్కనీలోకి తిరుగుతున్న వసంత భర్త రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.
‘ప్రతిరోజూ ఆరున్నరకే వచ్చేసేవారు. ఈరోజు ఏడవుతున్నా రారేమిటబ్బా?’ అనుకుని నిముషాలు లెక్క పెడుతోంది.
అపార్ట్‌మెంట్ కింద స్కూటర్ హారన్ వినిపించడంతో ‘హమ్మయ్యా ఆయన వచ్చేసారు’ అనుకుంటుండగానే వసంత భర్త తరుణ్ ఇంట్లోకి వచ్చాడు.

Pages