S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

09/26/2016 - 21:20

అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన సోమనాథం తన భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాడు. సోమనాథం ఒక ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఎంతో ఆనందంగా తన రోజులను గడుపుతున్న సోమనాథం ఆనాడు ఎందుకో విచారంగా కనిపించాడు. భర్త మొహంలో ఉన్న విచారమును కనిపెట్టిన సీత మీరు కూడా నేను ఆలోచిస్తున్నదే ఆలోచిస్తున్నారా అని అడిగింది. అవును అన్నట్టుగా తల ఊపాడు సోమనాథం.

09/26/2016 - 21:20

కీ.శే. అద్దేపల్లి రామమోహనరావు ఆరు దశాబ్దాల సాహితీ ప్రస్థానం ఎందరికో మార్గదర్శనం అయ్యింది. ఒక వ్యక్తిగా సాహితీ వ్యవస్థలో జరిగిన అన పరిణామాలకు తన సొంత ముద్రను కలిగి ఉన్న అగ్రేసర కవులలో అద్దేపల్లిది విలక్షణమైన, విశిష్టమైనదనే చెప్పవచ్చును.

09/18/2016 - 18:33

‘స్కూళ్లు తెరుస్తారు. మనవల పుస్తకాల సంచులు రెండూ చిరిగి ఉన్నాయి. కుట్టించుకురండి!’
‘ఆ బెంగుళూరు నుంచి తెచ్చిన సంచులే?’
‘ఆ బెంగుళూరైతేనేవిటి? మంగుళూరైతేనేవిటి? మణుగులేసి బరువులున్న పుస్తకాలను వాటిలో కూరి తీసుకువెడుతున్నారు. చిరక్క ఏమవుతాయి?’
‘వెనె్నముక విరిగేలా అన్ని పుస్తకాలను రోజూ తీసుకొని వెళ్లడమెందుకు, ఏ రోజు సబ్జక్టు పుస్తకాలు ఆరోజు తీసుకొని వెళ్లచ్చుగదా?’

09/11/2016 - 07:45

శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మహా పుణ్యక్షేత్రానికి బయల్దేరాడు. శ్రీనివాస్ తన భార్య శ్రీవాణి, చెల్లెలు సుగుణ బైకు మీద, మిగతా కుటుంబ సభ్యులు గుడికి చేరుకున్నారు ఓ గంట తరువాత.
ఆ గంట ప్రయాణంలో గుడి రోడ్డు ఇరువైపులా చెత్తతో నిండిపోయింది. శ్రీవాణికి దాహం వేయడంతో గుడి ఎదురుగా ఉన్న షాపులో డ్రింకు తాగారు శ్రీవాణి, శ్రీనివాసు.

09/05/2016 - 03:00

ఆదరం తువాలుతో
అక్షరం ముఖం తుడుచుకొన్నట్లుంటుంది
మాటలు కంటే చూపులే
చేతులు కంటే మనసులే
ముందుగా హత్తుకుంటాయి

పుస్తకాల రెక్కల చప్పుడుకు
మెదడు చిగురాకులా కదిలిందీ అక్కడే
పత్రాల ఎదల్లో మాటువేసిన హరిత వర్ణం
ప్రపంచమంత విస్తరిస్తోన్న దృశ్యం
చూసిందీ అక్కడే

09/05/2016 - 02:45

‘ఎలాగైనా సరే అబ్బాయిని మెడిసిన్‌లో జాయిన్ చెయ్యాల్సిందే’ అంటూ భార్య రంజిత చేసిన హెచ్చరిక లాంటి స్వరం ఈజీ ఛైర్‌లో, ఎసిలో కూర్చున్న శంకర్‌ను చెమటతో కంపనాలు వచ్చేలా చేస్తోంది. ఒక లక్షా రెండు లక్షలతో పోయే వ్యవహారం కాదు. ఏకంగా యాభై లక్షల వ్యవహారం. ఎక్కడ నుండి తేవాలి? అప్పు చేస్తే తీర్చగలమా? మరి దారేమిటి?2 రకరకాల ప్రశ్నలతో అంతరంగం వేడెక్కిపోతోంది శంకర్‌కి.

09/05/2016 - 03:00

కిరణ్, స్వాతి కొత్తగా పెళ్లయిన జంట. పెళ్లయిన రెండు నెలల తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. ముందుగా వ్రతానికి కావాల్సిన సామాన్లను కొంటున్నారు. కొబ్బరికాయలు కొని బయటకు వస్తున్నప్పుడు ఓ ఎనభై సంవత్సరాల ముసలి అవ్వ వాళ్ల దగ్గరకొచ్చి ఒక రూపాయి ధర్మం చెయ్యండి అంటూ ప్రాధేయపడింది. అంచులు చిరిగి, రంగు వెలిసిన పాత చీర..

09/05/2016 - 02:39

‘‘్ఛఛీ వ్యవస్థ నాశనమైపోతోంది. ఎక్కడ చూసినా మోసమే. ఎవ్వడిలోనూ నిజాయితీ లేదు. యువత మరీ చెడిపోయింది. ఎవరికీ క్రమశిక్షణ లేదు’’ ఈ సమాజం తీరు తెన్నులను ఏవగించుకుని రోజుకు ఓ పది పదిహేనుసార్లు అనుకోవడం భుజంగరావు మాస్టారుకి అలవాటు. ‘‘జనాల మనస్తత్వాలు బాగుపడతాయనుకోవడం, మంచి రోజులొస్తాయనుకోవడం ఉత్తభ్రమ’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు క్యూలో తన వెనుక నించున్న వ్యక్తితో.

09/05/2016 - 02:35

కర్త: డా. ఎస్వీ రాఘవేంద్రరావు
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
నవోదయ బుక్ హౌస్
శ్రీమతి ఎస్ కామేశ్వరి
సుమశ్రీ నివాస్, ఇం.నెం.ఎంఐజి. 59
ఎపిహెచ్‌ఒ కాలనీ, లాలాచెరువు
రాజమహేంద్రవరం-6
**

08/28/2016 - 23:20

ఎందరో మహానుభావుల త్యాగఫలం
మన త్రివర్ణ జెండా
అందుకే ప్రతి ఒక్క భారతీయుడిలో
ఉండాలి నిజమైన దేశభక్తి గుండె నిండా
మూడు రంగుల జెండాయే కదరా
సమస్త భారతీయులకు అండ
నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు మెలగాలి
అప్పుడే కదా దేశఖ్యాతి పాకుతుంది
ఖండాంతరాల గుండా
దేశ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడే
ఈ జెండాయే మనకు చల్లని నీటికుండ

Pages