S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

04/30/2017 - 03:32

నాలుగు సంవత్సరాల నుండి నడుస్తున్న క్రిమినల్ కేసుకు రేపే తుది తీర్పు. న్యాయస్థానానికి సాక్ష్యాలే ఆధారం. న్యాయదేవత కళ్లకి నల్లగుడ్డ కట్టుకొని చేతిలోకి త్రాసుతో న్యాయాన్యాయములను తూకం వేస్తుంది. అపరాధిని శిక్షించడానికి కావలసిన సాక్ష్యాల భారం సంతృప్తికరంగా ఉంటే శిక్ష ఖరారు అయినట్లే! అది దొంగ సాక్ష్యమైనా అనవసరం. న్యాయస్థానంలో భగవద్గీత తాకగానే అది పవిత్రమైపోతుంది.

04/30/2017 - 03:27

భూతకాల వలయంలోంచి
జ్ఞాపకాలు ఎగసిపడుతాయి
భవితాకాశమంతా
ఆశల పూజలు విరబూస్తాయి
వర్తమానమొక్కటే
వాస్తవాలతో జత కడుతుంది
మానవ జన్మ మాత్రం
నూరేళ్ల జీవితమై విస్తరిస్తుంది
కొందరు మాత్రమే
మనిషితనానికి రూపవౌతారు
వాళ్ల అనే్వషణ ప్రవృత్తి అవుతుంది
అనునిత్యం కాలాన్ని గమనిస్తూ
అవాస్తవాలపై కనె్నర్రజేస్తారు

04/30/2017 - 03:21

ఒకసారి శ్రీశ్రీని కొందరు ఇంటర్వ్యూ చేస్తూ ‘శ్రీశ్రీ మహాకవి అయితే కావచ్చు గానీ, ప్రజాకవి కాడని కొందరు విప్లవకారుల అభిప్రాయం. మీ వ్యాఖ్య?’ అని అడిగారు. దానికి శ్రీశ్రీ సమాధానమిస్తూ.. ‘ఏకీభవిస్తున్నాను. నేను అక్షరాస్యుల కవిని, చదువు రానివారి కవిని కాను. ప్రజాకవి కానివాడు మహాకవి కూడా కాలేడు’ అన్నారు. శ్రీశ్రీ మహాకవో, ప్రజాకవో, మరో కవో చెప్పాల్సింది శ్రీశ్రీ కాదు, కాలం!

04/24/2017 - 23:11

పేద విద్యార్థులకు వరంగా మారిన
విశాఖ హిందూ రీడింగ్ రూం

04/16/2017 - 01:56

బయటంతా చిమ్మ చీకటి అంధకారాన్ని చీల్చుకుంటూ రైలు దూసుకుపోతుంది. మూడురోజుల నుంచి నిద్ర సరిగా లేకపోవటంతో మత్తుగా పట్టేసింది.

04/16/2017 - 01:54

మా ఊరికి వస్తూనే ఉంటాయి
ఆత్మబంధువులై
చలికాలం మంచుపూలు కురిసే
వెనె్నల వేళ
మా ఊరి చింతచెట్లపైకి
దేశదేశాలు దాటి
ఎతె్తైన కొండల వరుసలు దాటి
అలల శబ్దాల గంభీర
సముద్రాలు దాటి
పైనుంచి పైకి ఎదిగిన ఎతె్తైన
అడవుల శిరస్సుల పైనుంచి
వస్తూనే.. వస్తూనే ఉంటాయి
రెక్కల టపటపల శబ్దాలు చేస్తూనే
వరుస వరుసలుగా సైబీరియా విహంగాలై

04/16/2017 - 01:43

ప్రతులకు:
శ్రీ సత్య పబ్లికేషన్స్,
రామన్నపేట, అత్తిలి-534134
పశ్చిమగోదావరి జిల్లా,
సెల్: 7794959011
*

04/11/2017 - 23:38

పచ్చిపూల మండపము. వీధి అంతా రంగురంగు దీపాలతో, నాల్గు వీధుల చావడిలో అందంగా పెద్దగేటు కట్టి అలంకరించారు. ఇది రాజకీయ పండగ అయితే రంగు జెండాలు కడతారు. అంత కంటే ఘనంగా ఎంతో అందంగా పూలు, దీపాలు అమర్చారు. సందడంతా ఆ గ్రామంలోనే ఉందా! అనేలా ఉంది.

04/11/2017 - 23:35

అధరం తువాలుతో
అక్షరం ముఖం తుడుచుకొన్నట్లుంటుంది
మాటలు కంటే చూపులే
చేతులు కంటే మనసులే ముందుగా హత్తుకుంటాయి

పుస్తకాల రెక్కల చప్పుడుకు
మెదడు చిగురాకులా కదిలిందీ అక్కడే
పత్రాల ఎదల్లో మాటువేసిన హరిత వర్ణం
ప్రపంచమంత విస్తరిస్తోన్న దృశ్యం చూసిందీ అక్కడే

04/11/2017 - 23:31

ప్రతులకు
చావలి ఆంజనేయమూర్తి,
2వ అంతస్తు, సూర్య ఎన్‌క్లేవ్, రామాలయం ఎదుట,
విశాలాక్షినగర్, విశాఖపట్నం.
ఫోన్: 0891-2795930,
సెల్: 9441170455.
**

Pages