S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

05/15/2016 - 05:27

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.

05/08/2016 - 05:10

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.

05/01/2016 - 04:57

‘నాకు నీ వాలకం నచ్చటం లేదు’ కోపంగా అన్నాడు శ్రీరాజ్.
‘ఏం నేనేం తప్పు జేశాను’ ఏడుపు ముఖంలో అంది ఉషా సింగ్.
‘నీవు ఫోన్ మాట్లాడేటపుడు స్పీకర్‌లో పెట్టమన్నానా?!’ రౌద్రంగా ఉంది అతని ముఖం.

04/24/2016 - 06:20

అనంతపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగిన నగరం!

04/18/2016 - 07:28

భయపడుతున్నారు పిల్లలు తెలుగు నేర్వాలంటే
దండిస్తున్నారు ఉపాధ్యాయులు తెలుగు మాట్లాడితే!
జరిమానాలు విధించి జడిపిస్తున్నారు
తెలుగు శబ్దం వినిపిస్తే!
లక్షలు పోసి చదివిస్తున్నాం కనుక ఆంగ్లభాషే
లక్ష్యమని భావిస్తున్నారు తల్లిదండ్రులు!

04/18/2016 - 07:23

అక్కడ కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడ బాధలు భీతిల్లుతున్నాయి. ప్రతి మనిషికీ ఇది నా ఊరు అనేది ఉంటుంది కానీ నాకు లేదు. ఇదే నా బెంగ. ఉండడానికి నాకంటూ ఊరు ఉన్నా అక్కడ నాకంటూ బంధువులు లేరు. అక్కడ నాకంటూ ఉన్న రాళ్లు రప్పలు ఎవరో ఆక్రమించుకుంటున్నారు. వాటి గురించి పోరాడాలనే ఆశయం, ఆశ నాకు లేవు. అయినా పండక్కి అందరూ తమ సొంత ఊరు వెళుతున్నారు. నేను వెళ్లడానికి ఏ ఊరూ లేదు. అనేక సంబరాలు...

04/18/2016 - 07:21

‘తలెత్తి ఆ కుర్రాడిని చూడవే.. రాజకుమారుడులో మహేష్‌బాబులా ఎంత లేతగా వున్నాడో’ అంది శ్రావ్య.

04/18/2016 - 07:19

ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది.
‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకు వెళ్లిపోయి మనల్ని ఒంటరివాళ్లని చేసింది’’ గద్గదస్వరంతో చెప్పాడు నవీన్.
అది విని జగదీష్ కాళ్లు వణికాయి.
‘‘అన్నయ్యా! అసలు ఏమయిందో చెప్పు అన్నయ్యా’’ అంటూ ఆందోళనగా అడిగాడు.

04/10/2016 - 07:37

శిల్ప ట్యూషన్ ముగిసిన తర్వాత తొరగా ఇంటికి బయలుథేరింది. కూతురు కోసం తల్లి ఎదురు చూస్తోంది. కూతురిని వీధి చివరకు రావడం చూసి కప్పు వేడి పాలలో చక్కెర కలిపింది. ఇంట్లో అడుగుపెట్టిన శిల్ప ‘మమీ, మమీ! ఎక్కడున్నావ్... నేనొచ్చేశాను’ అంటూ పిలిచింది.
‘ఆ... వస్తున్నాను... ఏంటి సంగతి... మంచి హుషారుగా ఉన్నావు’ తల్లి కాత్యాయని ఎదురురెళ్లింది పాల కప్పుతో.

04/03/2016 - 21:17

ఎంత వెదికినా వేపచెట్టు కనపడదే!
విందామంటే కోయిలపాట వినపడదే!
నాలో ఏమైనా లోపమా!
లేదు లేదు లోపం నాలో లేదు
కాలమే మారిపోయింది. నా పిచ్చిగాని,
అరణ్యాలు జనారణ్యాలుగా మారుతున్న వేళ
ఆక్రమణల పర్వంలో
అరుగులు లేని అపార్ట్‌మెంట్లు
వాకిళ్లు లేని లోగిళ్లు
ఇక చెట్టుకు దిక్కేది, పిట్టకు గూడేది
రెడీమేడ్ బోగి పిడకలు, ఉగాది పచ్చడి పేకెట్లు

Pages