S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

01/31/2016 - 03:58

‘నాన్నగారూ! ఎల్లుండి మనం షిరిడీ వెళ్లబోతున్నామని నేను పెట్టిన పోస్టింగుకి వంద లైకులొచ్చాయండీ..’ ఆనందంగా చెప్పాడు మా పెద్దోడు అభిషేక్.
‘ఏమిటో ఈ ఫేస్‌బుక్ గోల. ప్రతి చిన్న విషయాన్నీ పదిమందితో పంచుకోనిదే నిద్రపట్టదేమో నీకు’ కాస్తంతా తీక్షణంగా వాడి కళ్లల్లోకి చూశాను.

01/19/2016 - 22:39

‘నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే! అవును, అంతే! ఈ ఒంటరితనం నేను భరించలేను. అది అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది!’ లోలోన అనుకోవాల్సిన మాటలు పైకే అనేశాడు ధీరేంద్ర. తనలోని మనిషి తనలాంటి మనిషి ఎదురుగా నిలబడ్డాడు. కళ్లు నులుముకుని మరీ చూశాడు. ఏ సందేహం లేదు. అవును అది తనే.. మరి ఇక్కడ ఉన్న నేను.. ఆశ్చర్యంగా చూస్తూ ఎవర్నువ్వు? అన్నాడు.
‘నీకు తెలియదా!’ నేనే అనుకున్నట్టున్నావ్

01/11/2016 - 02:02

సర్వీసు ఆటో ముగ్గురు ప్రయాణీకులతో స్పీడుగా గాకుండా మధ్య తరగతి పంథాలో పోతున్నది. ముగ్గురూ ఒకే ప్రదేశంలో ఎక్కలేదు. ఒకరొకచోట, ఇద్దరు కలిసి మరోచోట ఎక్కారు. ఈమధ్య ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ఒక్క పాసింజరు కనపడ్డాగాని ఆపి అడిగి మరీ ఎక్కించుకుని తీసుకుపోతున్నారు ఆటోవాలాలు.

01/02/2016 - 22:56

గడిచిపోయిన రోజులను
ఎదగుడిలో భద్రంగా దాచుకొని
రేపటి రోజు నీ కోసం
ఎదనిండా ఆశలతో...
కళ్లలో కోటి కాంతులు
వెలుగు నింపుకొని...
ఆహ్వానిస్తున్నాము
ఓ నూతన సంవత్సరమా !
మా జీవితాలలో సంతోషాలు నింపి
బంధాలు, బంధుత్వాలు మరిచిపోకుండా
ప్రక్కవారిని ప్రేమించే తత్వాన్ని పెంచుతూ...
నిత్యం టెన్షన్లతో సతమతమయ్యే మాకు

12/26/2015 - 21:21

‘లంచం ఇవ్వడం నేరం- లంచం తీసుకొనుట నేరం’ అని అంతంత అక్షరాలతో బోర్డులు పెట్టిమరీ దండిగా లంచాలు దండే ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగిరీ ఉద్యోగం చేస్తోన్న సుబ్రావ్‌కి ఎంతటివాడైనాసరే తనకి లంచం ముట్టజెప్పందే చిన్న పని కూడా చేసిపెట్టడం అలవాటు లేదు. పైపెచ్చు ఎప్పుడూ అందరికీ నీతి కబుర్లు చెప్తూ హితబోధలు చెయ్యడంలో అతనో దిట్ట!

12/20/2015 - 01:22

‘అమ్మాయ్! ఓ అమ్మాయ్! పలకవేం నిష్ఠూరంగా ఒకింత విసుగుతో అన్నారు కాంతమ్మ గారు. ఆమె మొదటి మాటకే అలా విసుక్కోవడం శ్రీయుతకు అలవాటే. అందుకే ఆమె చాలా సాధారణంగా జవాబు ఇచ్చింది ఇలా...
‘ఇప్పుడే గదా పిలిచారు! వస్తున్నాను’ ఏంటో చెప్పండి. తాపీగా అన్నాను.
అదే నిలువు గినె్న నిండా పిండి రుబ్బావు గదా!
‘రెండ్రోజుల నుండీ చూస్తున్నాను, నాకు అట్టో, ఇడ్లీనో వేసి పెట్టేదేమైనా ఉందా! లేదా!’

12/13/2015 - 04:22

‘డోర్ లోంచి పైకి రావాలి’ గట్టిగా అరిచాడు కండక్టర్ కిషోర్.
బస్సు వేగంగా పరుగులు తీస్తోంది... అంతకంటే వేగంగా టిక్కెట్లు ఇస్తున్నాడు.. బస్సు రష్‌గా ఉంది...
వెనక సీట్ల దగ్గర టికెట్లు ఇస్తున్న కిషోర్ మరోసారి అరిచాడు...
మెట్లమీద వేలాడుతున్న స్టూడెంట్లు పైకి వచ్చారు...
తృప్తిగా తలాడించి తన పనిలో నిమగ్నమైపోయాడు..

12/07/2015 - 09:03

మెరుపు - రాజమండ్రి

వినదగునెవ్వరు చెప్పినా...

కథ

11/22/2015 - 04:51

యువకుడు గోవిందయ్య పరమానందస్వామి ఆశ్రమంలో జ్ఞాపకశక్తి లేమి కారణంగా చాలాకాలంగా విద్య కొనసాగిస్తున్నాడు. గోవిందయ్య ఆశ్రమానికి శాశ్వత విద్యార్థి అని సాటి విద్యార్థులు ఆట పట్టించినా గొడవ పడేవాడు కాదు. వౌనంగా చింతించటం తప్ప జ్ఞాపకశక్తి పెంచుకునే ప్రయత్నాలు చేసేవాడుకాదు.

06/20/2015 - 11:03

మహబూబ్‌నగర్, జూన్ 19: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు.

Pages