S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

02/19/2017 - 03:18

తెలంగాణ మాండలిక పదకోశాలను పరిపుష్టం చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలని కాంక్షించే ప్రముఖ కవి ‘ఎలనాగ’ అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. వృత్తిరీత్యా వైద్యులు. 2012లో రాష్ట్ర స్థాయి వైద్యాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో జన్మించిన ఆయన రచనా వ్యాసాంగాల్ని ప్రవృత్తిగా మలచుకుని సంగీత ఆరాధకునిగా, కథకునిగా, కవిగా మరియు అనువాదకునిగా అందరి మన్ననలు పొందారు.

02/19/2017 - 23:56

ఉదయ్ ఇంటికి వచ్చేసరికి గేట్ దగ్గర భార్య శ్రావణి, కొడుకు విశేష్ నిల్చుని ఉన్నారు. వారిని చూడగానే ఏమైంది? అని అడిగాడు ఉదయ్. ఈ రోజు తేలిపోవాలి, ఈ ఇంట్లో నేను ఉండాలో? మీ నాన్న ఉండాలో? అంటూ కోపాన్ని ప్రదర్శించింది శ్రావణి.
అసలు ఏమైంది ‘శ్రావణి’

02/05/2017 - 04:43

వాన తక్కువయ్యిందని మెల్లంగ బయలెల్లి నిర్మలక్క ఇంటికి పోయినము. నన్ను చెల్లెను జూసి ‘వాగుకు పోదాముపాయే’ అని మమ్ములను ఎంటేస్కుని తీసుకుని పోయింది. ఆడుకుంటూనే ఉన్నము. ఎంతయాళ్ల అయ్యిందో తెల్వదు. ఇల్లు యాదికొచ్చి అమ్మో అమ్మ ఏమంటదోనని మనసులో భయమన్పించింది.

02/05/2017 - 04:37

ఎడతెగని
ఆలోచనా తరంగాలు
పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ
హృదయ తీరాన్ని
కల్లోల పరుస్తుంటే..
కలత చెందుతు
కలవరపడుతూ
కలలు కనడం మాని వేస్తున్నప్పటికీ..
వేదనకు అంతులేదు!
ప్రతి రేయి కళ్లు చెమర్చే రోదనే
నన్ను వెంటాడుతుంటే...
ఏమి చేయను?
ఎలా ముందుకు సాగను?
పనులలో అవరోధాలు
నడకలో అడ్డంకులు
నన్ను వెక్కిరిస్తుంటే..

02/05/2017 - 04:30

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
**

01/29/2017 - 00:14

విజయ్ కుమార్ తన మిత్రుడి పెళ్లికి కరీంనగర్ వెళ్లాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి బంధుమిత్రులు అధిక సంఖ్యలో వచ్చి పెళ్లి జంటను ఆశీర్వదించారు. చిన్న చప్పుడు, పెద్ద చప్పుడు మాత్రమే కాకుండా పెళ్లికి జాజ్ బ్యాండ్ మరియు పైప్ బ్యాండ్‌ను తెప్పించారు.

01/29/2017 - 00:10

ఒకప్పుడు కీర్తి.. ఆత్మగౌరవానికి స్ఫూర్తి
ఇప్పుడు.. అమ్మకానికి ఆస్తి!
తథాస్తు దేవతలున్నంత కాలం
వరాలిచ్చేది పూజారులే!
ప్రతిభకు కొలమానాలు లేనప్పుడు
పురస్కారాలు ఏపాటి!
అడపా తడపా తెరుచుకునే పురస్కార గవాక్షాలు
గుమిగూడే జన సందోహాలు
‘బ్లాకు మార్కెట్’ దెబ్బతో కుదేలు!
ఏలినవారి దయాదాక్షిణ్యాలు
తోడేళ్ల ప్రజాస్వామ్యంలో

01/29/2017 - 00:04

తన కవిత్వానికి తెలంగాణ వలస జీవులే ప్రేరణ అని సవినయంగా ప్రకటించే ప్రముఖ కవి, రచయిత సంగెవేని రవీంద్ర ఇప్పటి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శకల్ల గ్రామానికి చెందినవారు. వృత్తిపరంగా ముంబాయిలో స్థిరపడ్డ ఆయన తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, ముంబాయి ఆంధ్ర మహాసభ ఉపాధ్యక్షుడిగానే కాక..పలు సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటూ తెలుగు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

01/22/2017 - 03:35

గోపాలానికి ఇద్దరు కుమారులు. వాళ్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. తను ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు.

01/22/2017 - 03:32

మోక్షం మోక్షం అంటారు
పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతారు
చుట్టూ ఆకలితో అలమటిస్తున్న
అన్నార్తులను మాత్రం ఆదుకోరు
స్వార్థం కోసం పేదవారి శ్రమను
పగలు రాత్రి దోపిడీ చేస్తారు
విరిసీ విరియని విరులను
బానిసలుగా చేస్తారు
బోలేడు సేవలు చేసుకుంటారు
భక్తి శివుని మీద పెట్టి
చిత్తం చెప్పుల మీద ఉంచుతారు
నోట్లో రామనామం జపిస్తారు

Pages