S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

01/30/2016 - 23:05

నవంబర్ పదిహేనవ తేదీ... సాయంత్రం ఆరు కావస్తోంది. చిరుచీకటి దుప్పటి కప్పుకుని చలి తన పంజా విసిరేందుకు సిద్ధపడుతున్న సంధ్యా సమయమది. సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ మాత్రం కాలంతో పనిలేకుండా ఎప్పటిలాగే గోలాహలంగా ఉంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వచ్చేవాళ్లు... ఆయుష్షు తీరిపోయేవాళ్లు.. ఈ వచ్చిపోయేవాళ్ల వెంట ఉన్న మనుషుల్లో సందర్భాన్ని బట్టి హర్షాతిరేకాలు లేదా అంతులేని శోకాలు.. అన్ని ఒక్కచోటే.

01/30/2016 - 22:46

కార్తీకమాసం... ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయం.. చీకట్లు ఇంకా తొలగిపోలేదు. అపుడే నిద్రలేచిన నేను నిద్రమత్తును విడిచి మెల్లగా పనులు మొదలుబెట్టాను. మధ్యలో ఎందుకో నా చూపు మా పక్కింటిపై పడింది. వాళ్లు ఇంకా రాలేదు. వారింటికి ఇంకా తాళం వేసే ఉంది.
మా పక్కింట్లో ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది. తల్లితో బాటు ఇద్దరు కొడుకులు ఉంటారందులో.

01/17/2016 - 22:32

నిన్ను వదిలి వెళ్లడం తప్పదా మమీ కన్నీళ్లతో అడిగాడు వరుణ్. ‘ఈ ఒక్క సంవత్సరమే నాన్నా, వచ్చే సంవత్సరం నుంచి మనిద్దరం కలిసే ఉంటాం, సరేనా? అంటూ అనునయించింది సీత.
‘అయితే ఈ రోజంతా నువ్వు నాతో ఉండు. రేపే నేను స్కూళ్లో జాయిన అవుతా’
‘సరే’నంటూ ఇద్దరూ కలిసి గుడి, పార్కు, రెస్టారెంటూ తిరిగి రాత్రికి ఇంటికి చేరారు.

01/11/2016 - 00:17

నిశబ్దం తాండవనృత్యం చేస్తున్న ఆ గదిలో పదవ తరగతి పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. ఇన్విజిలేటర్‌గా పార్థసారథి మాస్టారు, ఆయనకు సహాయంగా గోపాలకృష్ణ మాస్టారు విధులు నిర్వహిస్తున్నారు.

01/02/2016 - 21:39

కాలచక్రం మామూలుగానే తిరుగుతోంది. కానీ మనుషుల్లో విలువలు మాత్రం మారిపోతున్నాయి. కారణాలు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంతే అని అదేమిటో తమకు సంబంధం లేనిదిగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఇదే కొనసాగితే ఎంతటి సునామీ ఎదురౌతుందో ఎవరికీ అర్థం కావటం లేదని మనసులోనే మధన పడుతున్నాడు విశాల్రావు. అదే సమయంలో ఫోన్ మ్రోగింది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ కళ్లజోడు పెట్టుకుంటూనే ఎత్తారు.

12/26/2015 - 20:56

‘అమ్మా, ఏడవకమ్మా! ప్లీజ్.. ఏడవకమ్మా! నీవు ఏడిస్తే నాకూ ఏడుపొస్తుంది’
భర్త వివేక్ పలవరింతలకు కలల లోకాల్లో తేలిపోతున్న కౌముది దిగ్గున లేచింది.
‘ఏవండీ!’ భర్తను గట్టిగా కుదుపుతూ లేపింది కౌముది. కళ్లు తెరచి కౌముదివైపు అయోమయంగా చూస్తున్న వివేక్ ఒక్కసారి చంటి పిల్లాడిలా బోరుమంటూ కౌముది ఒడిలో తలదాచుకున్నాడు.
‘ఏవండీ! ఏం జరిగింది?’

12/19/2015 - 22:08

లావణ్యకు శ్రీరాంతో పెళ్లై పది సంవత్సరాలు కావస్తుంది. ఇద్దరికీ హైదరాబాదులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. కారు, స్వంత ప్లాటు..ఈలోగా ఇద్దరు పిల్లలు. అమ్మాయికి ఆరేళ్లు, అబ్బాయికి నాలుగేళ్లు. సాఫీగా సాగుతున్న సంసారం. పెళ్లి పదవ వార్షికోత్సవానికి లావణ్యకు ఓ మంచి గిఫ్ట్ కింద నాలుగు లక్షల పైన ఖరీదు చేసే ‘నెక్లెస్’ ఇవ్వాలనుకున్నాడు.

12/12/2015 - 21:33

క్షణం తీరికలేని జీవితం. అలసటలోనే ఆనందం. ఆ సంతోషంలోనే సుఖమూ శాంతీ. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నది డాక్టర్ రూప. ఆమె పేరుకు తగినట్లే చక్కటి రూపంతో పాటు సహనాన్ని సాంతం చేసుకున్న నిరుపేదల పాలిటి ఆరాధ్యదైవం. అవసరమున్నా లేకున్నా అనవసరమైన పరీక్షలు చేయించుకోమనటం, మందులు రాయటం ఆమెకు నచ్చని పని.

12/07/2015 - 08:49

ఆఛార్య దేవోభవ!

కథ

11/21/2015 - 23:13

రోజూ కోడికూతతో మేల్కొనే ఆ గ్రామప్రజలు ఆ రోజు అంతకంటే ముందుగానే లేచారు. కారణం-ఆ రోజు వాళ్ల ఊర్లో ‘జాతర’. చుట్టుపక్కన ఉన్న గ్రామ ప్రజలంతా వస్తారు. వస్తారేంటి? వచ్చేశారు కూడా! పొద్దున తొమ్మిది గంటలకల్లా రాములవారి రథాన్ని ఊరంతా తిప్పుతారు. ఆ సమయంలో ఎవరి గుమ్మాలముందు వాళ్లు హారతి పళ్లెం పట్టుకొని దేవుడి రథం కోసం ఎదురు చూస్తుంటారు.

Pages