S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

05/29/2016 - 06:31

అతని పేరు పరాంకుశం. ‘అంకుశం’ అతని కలం పేరు ‘అవినీతి, అక్రమాలకు తన రచనలు ‘అంకుశం’ వంటివని అతనంటుంటాడు. వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డ అతని కథలు ‘అంకుశం కథలు’ అన్న పేరుతో ఈ మధ్యనే పుస్తకంగా అచ్చయ్యాయి.

05/22/2016 - 05:13

పెళ్లి మండపమంతా కోలాహలంగా ఉంది. పెద్దవారితో తాకించి మంగళధారణ కార్యక్రమం పూర్తి చేయడంతో మగవాళ్లు, ఆడవాళ్లు అంతా వరుసగా వేదికపైకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ వారి గుర్తుగా బహుమతులు ఇస్తున్నారు. వారి గుర్తుగా ఇస్తున్న జ్ఞాపికలను, డబ్బులు పెట్టి ఇస్తున్న కవర్లను పక్కనే కూర్చున్నా అమ్మమ్మ చేతికందిస్తుంది పెళ్లి కూతురు కళ్యాణి.

05/15/2016 - 06:09

నల్లని మబ్బు ఆకాశాన్ని కమ్మేయ్యాలని చూస్తోంది. ఇద్దరు అమ్మాయిలు దానినే తదేకంగా చూస్తున్నారు. ఒకటే దృశ్యమైనా వారిద్దరి భావాలు మాత్రం విభిన్నంగా ఉండటమే విచిత్రం.
అత్యాచారానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిలా మబ్బు, అందమైన, అమ్మాయిలా ఆకాశం మాధవికి కనిపిస్తే, అరాచికాలను అధిగమించే ధీరవనితలా మబ్బు, అందుకు కారకులైన అబ్బాయిలా ఆకాశం కనిపిస్తోంది ధైర్యకు.
‘మధూ! ఏమాలోచిస్తున్నావ్?’

05/08/2016 - 03:30

‘అబ్బబ్బ ఏం పనిమనుషులో ఏమిటో? సరిగ్గా టైంకు రానేరాదు. వేగలేక పోతున్నాననుకోండి’ అంటూ ఆధునికతకు అద్దం పట్టేలా వున్న ఆశ అప్పుడే లోపలికి వచ్చింది. ‘అదేం! మీ పనిమనిషి పని శ్రద్ధగా చేస్తుందిగా అన్న లక్ష్మిమాటలకు’ ఔనండీ చెయ్యకేం చేస్తుంది. పిల్లల్ని చదివించాలిగా. భర్త అనుమానంతో సతాయిస్తున్నాడట రోజు. ఫోనే్లండి వాళ్ల గురించి మనకెందుకు.

05/01/2016 - 05:31

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..

04/24/2016 - 05:45

కోటి ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన స్వప్నకు, అందరి ఆప్యాయతల మధ్య అత్తారిల్లు పొదరిల్లులా తోచింది. ఇంతలో ఉద్యోగరీత్యా బెంగుళూర్‌లో కాపురం పెట్టాల్సివచ్చింది. ప్రేమించే భర్త నీడలో జీవితం సాఫీగా సాగుతుంది. స్వప్న భర్త అనీల్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రొద్దున తొమ్మిది గంటలకు ఆఫీస్‌కి వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిదవుతుంది.

04/17/2016 - 23:23

నా చెప్పులు ఆగమయినయి!
నా వెంట వొచ్చినోడు తప్పిపోయినట్టు
ఆ గుడిబయట ఇడిసిన నా చెప్పులే
ఎవని కాళ్లో పట్టుకొని పోయానని
గట్టిగా అరవలేని మూగవేదన
చిన్న పిల్లాడిలా కాళ్లు నేలక్కొడుతూ
ఏడువలేని పాదదుఃఖం
దారిలో ఏమేకు పంటికో తగిలి
పాద బుగ్గలు చిట్లుతాయని
తుమ్మముల్లు గుచ్చుకున్నట్టు
కాళ్ల చుట్టూ తిరుగుతున్న
చెప్పులు పోయిన బాధ

04/17/2016 - 23:14

భువన ఉద్యోగంలో చేరి వారమయ్యింది.
ఆ స్కూలు, అక్కడి పరిసరాలు, వాతావరణం అన్నీ తనకు భాగా నచ్చాయి. తను పదవతరగతి విద్యార్థులకు బయాలజీ బోధిస్తుంది. అన్ని సెక్షన్ల విద్యార్థుల కంటే ‘ఎ’ సెక్షన్ విద్యార్థులు చదువులో ఎంతో ముందున్నట్లుగా ఆమె గుర్తించింది. వాళ్లపట్ల మరింత శ్రద్ధ చూపించి వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది.

04/17/2016 - 23:14

నన్నయ నుండి నేటి ఆధునిక కవితా యుగం వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ శతకం. సంస్కృత, ప్రాకృత వాజ్మయం శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిబింబమే. అయితే తెలుగులో ఈ ప్రక్రియ ఎంతో విశిష్టతను సంతరించుకుని ముందుకు దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన నందనందనంలో రచయిత తనకు ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణ లీలలను ప్రధానాంశంగా చేసుకున్నారు. రసగుళికల వంటి 126 పద్యాలను సరళమైన శైలిలో రాసి అందించారు.

04/17/2016 - 23:06

కవిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది శైలి. రచనా సంవిధానాన్ని బట్టి ఆ కవి ప్రతిభను ఊహించవచ్చు. రచయిత తన శైలికి ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో తన రచనలో దిశా నిర్దేశం చేసిన నల్లి ధర్మారావు తన దృక్పథాన్ని ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’ అనే అనువాద రచన ద్వారా తెలియజేశారు. ధర్మారావు అనువాదకుడు, కవి, రచయిత, విశే్లషకుడు.

Pages