S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

03/12/2017 - 02:19

అనుభూతిని పంచేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి శ్రీ జి.వి.కృష్ణమూర్తి వృత్తిరీత్యా ఉద్యోగవిరమణ చేసిన ఉన్నత పాఠశాల ప్రధానచార్యులు. గణితశాస్త్ర బోధకులుగా అందరి మన్నన పొందిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. ఛందోబద్ధ పద్య రచన చేయడంలో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్‌కు చెందినవారు.

03/05/2017 - 07:50

ఏడు పదుల వయసుదాటిన కమలమ్మ వృద్ధాప్యంలో..తన సొంతింట్లో ఓ మారుమూల గ్రామంలో జీవనం గడుపుతోంది. ఆ గ్రామంలోని మనుషులందరూ ఆమెను ఆప్యాయంగా నానమ్మ, అమ్మమ్మ అని పిలుస్తుంటారు. బాగా చదువుకోక పోయినా రాయడం, చదవడం తెలుసు..దశాబ్దాలుగా ఆ ఊళ్లో ఉంటున్న ఆమెకు సొంత ఇల్లే లోకం.. తనకున్న నలుగురు కొడుకులు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త చనిపోయి..నలభై ఏళ్లు కావస్తోంది.

02/25/2017 - 23:24

అప్పటికే ఆలస్యమైందనుకుంటూ వడివడిగా నడుస్తూ సునీత బడిలోకి చేరింది. యుకేజీ చదువుతున్న దినేష్‌కు లంచ్ టైంలో అన్నం తినిపించడానికి ఇంకో నాలుగైదు నిమిషాల సమయమున్నట్లుంది. పిల్లలకు భోజనం పెట్టడానికి అన్నపూర్ణమ్మలు ఒక్కొక్కరు బడిలోకి చేరుతున్నారు. మూడు గంటల సేపు చదివి చదివి ఆకలితో అలమటిస్తున్నట్లుంది బడి.

02/25/2017 - 23:23

పేజీలు: 108, వెల : 50/-
ప్రతులకు: ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ హైస్కూల్
ముస్తాబాద్-505404
రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9440676048
**

02/25/2017 - 23:15

నీ మృదు మధుర స్వరం
తాత్కాలికమే సుమా!
ఎప్పుడు అది మూగబోతుందో
పెన వేసుకున్న
ఆత్మీయతానుబంధాలు
ఏవౌతాయో ఎవరికి ఎరుక?
ఇప్పుడున్న రహదారులన్నీ
మృత్యు లోగిళ్లవుతుంటే..
బయటికి వెళ్లిన వారు
తిరిగి ఇంటికి చేరుతారన్న
భరోసాలేదు!
నీ ఆశను శ్వాసను.
విశ్వంతరాల్లో
ఎప్పుడు ఏకం చేసుకుంటాయో తెలియదు!
నీ ప్రయాణం

02/25/2017 - 23:09

సాహిత్య పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతలను పెంచుతాయని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం పొందారు. అంతేగాక..అనేక సాహితీ సంస్థల నుండి పురస్కారాలను అందుకున్నారు.

02/19/2017 - 03:31

ఆత్మహత్య చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. ఫ్యాషన్ కూడా అయిపోయింది. ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకునే యువతీయువకులు, పరీక్ష తప్పామని ప్రాణాలు తీసుకునే విద్యార్థులు, వ్యవసాయంలో నష్టపోయామని ప్రాణత్యాగం చేసే రైతన్నలు, ఒకరేమిటి, ప్రాణాలంటే త్రుణప్రాయం అయిపోయాయి ఈ రోజుల్లో.

02/19/2017 - 03:25

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా
సాహసమే ఊపిరిగా
న్యాయం కోసం పోరాడు!
అలసిపోక, అదిరిపోక.. ముందుకు సాగు!
అవినీతిపరుల భరతం పట్టు
నిజాయితీకి పట్టం కట్టు..
వంచనకు గురయితే..
పడి లేచే కెరటంలా
పోరాట పటిమకు శ్రీకారం చుట్టు!
నువ్వు చేస్తున్న పోరాటం న్యాయమని..
నీ అంతరాత్మ చెబుతుంటే..
ఇంకా బెదురెందుకు?
ధైర్యానే్న ఆయుధంగా మలుచుకో

02/19/2017 - 03:18

తెలంగాణ మాండలిక పదకోశాలను పరిపుష్టం చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలని కాంక్షించే ప్రముఖ కవి ‘ఎలనాగ’ అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. వృత్తిరీత్యా వైద్యులు. 2012లో రాష్ట్ర స్థాయి వైద్యాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో జన్మించిన ఆయన రచనా వ్యాసాంగాల్ని ప్రవృత్తిగా మలచుకుని సంగీత ఆరాధకునిగా, కథకునిగా, కవిగా మరియు అనువాదకునిగా అందరి మన్ననలు పొందారు.

02/19/2017 - 23:56

ఉదయ్ ఇంటికి వచ్చేసరికి గేట్ దగ్గర భార్య శ్రావణి, కొడుకు విశేష్ నిల్చుని ఉన్నారు. వారిని చూడగానే ఏమైంది? అని అడిగాడు ఉదయ్. ఈ రోజు తేలిపోవాలి, ఈ ఇంట్లో నేను ఉండాలో? మీ నాన్న ఉండాలో? అంటూ కోపాన్ని ప్రదర్శించింది శ్రావణి.
అసలు ఏమైంది ‘శ్రావణి’

Pages