S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

03/19/2017 - 08:55

స్కూలు నుంచి వస్తూనే సుధాకర్ పరిగెత్తుకుంటూ నానమ్మ దగ్గరకు చేరాడు. వెళ్తూనే ‘నానమ్మా! మరే, భోషాణం అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘అందులో ఏమి ఉంటాయి?’ ప్రశ్నించాడు.
‘ఏమి? ఎందుకురా అలా అడిగావు’ అన్నది నాయనమ్మ.

03/13/2017 - 22:00

‘డాడీ..! ఈసారి సంక్రాంతి పండక్కి మళ్లీ తాతగారి ఊరు వెళదామం’టూ పిల్లలిద్దరూ గొడవ చేయటం మొదలుపెట్టారు.
‘వేసవి సెలవుల్లో వెళ్లి వచ్చారుగా. ఈసారి సంక్రాంతికి మనం హైదరాబాద్ వెళ్దామం’ది పద్మజ.
‘మేం తాతగారి ఊరే వెళతామం’టూ పట్టుబట్టారు. ‘నాన్నగారు సంక్రాంతికి రమ్మని ఫోన్ చేశారు. సంక్రాంతి పెద్ద పండుగ గదా! వెళ్తేనే బాగుంటుంద’న్నాడు శ్రీ్ధర్.

03/13/2017 - 21:58

సీ. అంతరిక్షములోని కద్వితీయమ్ముగా
నూట నాలుగు ‘శాటిలైటు’లంపి
ఉద్వేగభరితమై ఉత్కంఠతో చూచు
వేలాది హృదయాల వేడ్క నింపి
గత రికార్డులనెల్ల గత చరిత్రగ మార్చి
అగ్ర దేశాల ముందడుగు వేసి
విశ్వవిజేతగా విఖ్యాతమై నిల్చి
జగతికే మనశక్తి చాటిచెప్పి

03/13/2017 - 21:54

రైల్లో సమోసాలు కొనుక్కుంటూ మా పెట్టెలోకి వచ్చిన మూడేళ్ల కుర్రాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చు స్వాతి బాబులా వున్నాడు. మూడు దశాబ్దాల క్రితం విజయవాడలో ఉండగా మా పక్కింట్లో ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఆనందరావు దంపతులకి ఒక్క బాబు. వాడు స్వాతి నక్షత్రంలో పుట్టేడని వాడికి ఆ పేరు పెట్టమని చెప్పాం. వాళ్లు మా ఇంట్లో వున్నంతకాలం ఎక్కువగా నా దగ్గరే ఉండేవాడు. తరువాత వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు కలిగారు.

03/05/2017 - 08:32

‘అమ్మతో ఇక గొడవ పడకు’ అన్నాడు హరి.
‘ఎందుకని? అయినా, ఈమధ్య ఆవిడ చాలా వౌనాన్ని పాటిస్తున్నారు. అసలేం జరిగింది?’ కుతూహలంగా అడిగింది రమ.

02/26/2017 - 08:20

అరుణ, ఆనంద్‌ల పదహారు రోజుల పెళ్లి పండుగ ఆరోజు. పెద్దలంతా వారిని ఆశీర్వదిస్తున్నారు. ‘ఏమైనా పెళ్లికొడుకు ముందు పెళ్లికూతురు వెలవెలాబోతోంది’ అని అమ్మలక్కలు అంటుంటే అరుణ బాధపడలేదు సరికదా, ఒకింత గర్వపడింది - అందగాడైన తన మగడిని చూసుకొని.

02/20/2017 - 00:59

అప్పుడే తూరుపు తెలతెలవారుతోంది. ఆ మసక వెలుతురులోనే పున్నమ్మ లేచి కోడిపిల్లలను గంప ఎత్తి బయటకి వదిలింది. మనవడిని, మనుమరాలిని 3లెగండిరా.. తెల్లారిపోయింది. మోకాలు కడుక్కుని కాస్త సద్దన్నం తిని పనికి వెళ్లండి2 అని కేకలేస్తూ లెగ్గొట్టింది.

02/13/2017 - 23:04

ఒంటింట్లో పనంతా పూర్తిచేసుకొని, దేవుని పూజ చేసుకొని కాస్త ప్రశాంతంగా బటయపడింది విశాలాక్షి. కొడుకు ఆఫీసుకు వెళ్లాడు. కోడలికి పురిటి కోసం తాను బెంగుళూరు వచ్చి వుంది. ఆర్నెల్లు గడిచినా తిరిగి ఇంటికి పంపటం లేదు. చిన్నపిల్లాడితో పనులు చేసుకోవటం కష్టమని ఇక్కడే వుండమంటున్నారు. అక్కడాయన వేళకి తింటున్నారో, లేదో? వంట చేసుకోవటం రాదు. మనసెందుకో దిగులుగా అనిపించింది. భర్తను చూడాలనుంది.

02/13/2017 - 23:01

ప్రతి వాక్యం
ప్రేమకు ప్రతిరూపమై
కళ్లు చెమర్చేవి
నాడు నాకొచ్చిన ఉత్తరం
చిన్న కార్డుముక్కే అయినా
వచ్చీరాని భాషలో రాసినా
గోరుముద్దలు
తిన్నంత కమ్మగా
అమ్మ ఒడిలో
సేదతీరినంత
హాయిగా వుండేది!
అక్షరం అక్షరంతో కలిసి
అమృతం కురిసి
నాన్న నన్ను
గుండెకు హత్తుకున్నంత
ఆనందంగా
మరలా మరలా
చదవాలనిపించేది!

02/13/2017 - 23:06

ఆటోలోంచి సూట్‌కేస్ పట్టుకుని దిగుతున్న అంజలిని చూసి ‘మళ్లీ అలిగి వచ్చేశావా?’ నవ్వుతూ అడిగింది అరుణ.
‘నేను బావనే పెళ్లి చేసుకుంటాను పిన్నీ. అమ్మ ఒప్పుకోవడం లేదు. బావకి నేనంటే చాలా ఇష్టం తెలుసా?’ అంది అంజలి.
‘మీ అమ్మా-నాన్న నిన్ను విడిచి వుండలేరు. బావ అమెరికా వెళ్లిపోతాడు. మరి ఎలా చెప్పు? నీకంటే పనె్నండేళ్లు పెద్దవాడు’.. నచ్చచెప్పాలని చూసింది. వినలేదు. చిరాకు పడింది.

Pages