S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

06/12/2016 - 00:44

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన

06/12/2016 - 00:41

‘స్టూడెంట్స్! మీరంతా బాగా చదివి, దేశం గర్వించదగ్గ మేధావులై దేశానికి మంచిపేరు తేవాలి’.. అంటూ అభిలషించారు తెలుగు మాస్టారు. ‘ఇప్పుడున్న పేరు బాగానే ఉందిగా మాస్టారు! భా-ర-త-దే-శం. ఇంకా ఏం మంచిపేరు తేవాలి?’ ఛలోక్తిగా అన్నాడు ఒక విద్యార్థి.
‘ఒహో! నీకు అలా అర్థమైందా? కూర్చో వెధవా!’ అంటూ గదమాయించారు. ఇంతలో మాస్టారి అనుమతితో లోపలికి వచ్చిన ఒక యువతి మాస్టారికి ఒక ఫొటో ఇచ్చి గుర్తుపట్టమన్నది.

06/12/2016 - 00:37

‘కంచి మేకలు’ కథా సంపుటితో ప్రారంభించి ‘చొరబాటు’తో కథకుడిగా తన స్థానం సుస్థిరం చేసుకున్న కథా రచయిత శిరంశెట్టి కాంతారావు. నాలుగో కథా సంపుటిగా ఆయన ‘చొరబాటు’ను ప్రచురించారు. ఈ కథలన్నీ ఇంతకుముందు వివిధ పత్రికల్లో ప్రచురించినవే. ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి. ప్రతి కథలోనూ దోపిడీ, పీడన సామాన్యుని జీవితంలోకి ఎలా చొరబడతాయో దృశ్యమానం చేసి చూపారు రచయిత.

06/05/2016 - 07:46

ఆరేళ్ల రాజు రోజూ ఉదయం 8 గంటలకు టిఫిన్ తిని బడికి వెళతాడు. ఇదే అతని నిత్యకృత్యం. రోజూ టిఫిన్ తినేటప్పుడు వాళ్ల ఇంటి పెరటిలోని మామిడి చెట్టు కింద కొంచెం పెట్టేవాడు. దాన్ని ఆ చెట్టు మీదున్న పక్షులు తింటుంటే ఎంతగానో ఆనందించేవాడు.

05/30/2016 - 00:12

‘ఏరా! నేను వ్యాపారం కోసం పట్నం వచ్చి రెండు నెలలైంది. ఇంటి దగ్గర వార్తలు ఏమీ తెలియటం లేదు. విశేషాలు ఏమిటి?’
‘మీరు ప్రేమగా పెంచుకునే చిలుక ఎగిరిపోయిందండీ!’
‘ఎలా ఎగిరిపోయింది? పంజరం తలుపు వేయటం మర్చిపోయారా?’
‘మర్చిపోలేదు. పనివాళ్లు కావాలనే తెరిచారు’
‘కావాలని ఎందుకు తెరిచారు?’
‘మన ఇల్లు కాలిపోతూంటే ఆ మంటల్లో పడి చచ్చిపోదటండీ!’

05/22/2016 - 22:40

ఆరోజు మాతృ దినోత్సవం. ఈసందర్భంగా కొత్తగా కట్టిన అనాధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో వృద్ధుల్ని, మరోవైపు అనాధల్ని చేర్చుకొని భోజనాలు, దుస్తులు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది తమ తల్లుల్ని సరిగా చూడక, పట్టించుకోకుండా ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఆరోజు కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధి గురునాథం గార్ని ప్రారంభోత్సవానికి పిలిచారు.

05/15/2016 - 05:38

అది మేము రోజూ కాలేజీకి వెళ్లేదారి. కాలేజీ బస్సు సరిగ్గా ఉదయం 8 గంటలకే బయలుదేరుతుంది. ఒక పెద్ద ఫ్లైవోవరు మీదుగా వెళ్లాలి. దాని కింది నుంచి రైళ్లు పరుగెడుతూ వుంటాయి. ఆ రైలు కట్ట పక్కనే ఒక గుడి వుంది. ఉదయం వేళ కాబట్టి గుడిగంటలు మైకులో బాగా వినిపిస్తూ వుంటాయి. ఈ ఫ్లైఓవరు మీద ట్రాఫిక్ రద్దీగా వుండటం వల్ల అన్ని మోటారు వాహనాలు మెల్లగానే వెళ్లాలి. అందువల్ల అన్ని శబ్దాలు బాగానే వినిపిస్తాయి.

05/08/2016 - 05:26

సుధకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైమ్ చూస్తే 7 గంటలైంది. ‘ఏమిటి ఇవాళ ఇంత నిద్రపట్టేసింది’ అనుకుంటూ బ్రష్ తీసుకుని బాత్‌రూంలోకి పరిగెత్తింది. ఫ్రిజ్‌లోంచి పాలు తీసి కాఫీ కలుపుకుని తాగింది. పనిమనిషి లక్ష్మి రోజూ 6 గంటలకే వస్తుంది. ఇవాళ ఇంకా రాలేదేంటబ్బా.. అనుకుంటూ గబగబా కుక్కరు పొయ్యిమీద పెట్టింది. ఇంతలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భర్త వినయ్ తిరిగి వచ్చాడు. అతనికి కూడా కాఫీ కలిపి ఇచ్చింది.

05/01/2016 - 05:16

గణపతి శివపార్వతుల కొడుకు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా! పొట్టిగా ఏనుగు తలతో, పెద్దపెద్ద చెవులతో బొద్దుగా, ముద్దుగా ఉంటాడు. ఒకరోజు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అతనికి ఉన్న రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. కోపం వచ్చి ఆటలు ఆపేసి ఇంటికి వచ్చేశాడు. మిగిలినవాళ్లు కూడా ఆడటం ఆపేశారు. గణపతికి రుచిగా ఉండే ఆహారం తినాలనిపించింది.

04/24/2016 - 06:38

‘చస్తే ఏ గోలా లేదు. చస్తే ఏ గొడవా లేదు. పుట్టే ప్రతివాడూ చస్తాడోయ్!’.. పాడుకుంటూ వంటింట్లోకి వచ్చిన మనవడిని ‘పొద్దునే ఆ చావు పాట ఎందుకు పాడుతున్నావురా?’ కసిరింది జానకమ్మ.

Pages