S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

07/30/2017 - 02:26

నుదురెంత వెడదయో హృదయాబ్జమింకను
వింగడమ్మయితోచు వెలుగులిడుచు
కనులెంత విరివియో కనుచూపులింకను
విస్తృతమ్ముగతోచు వీక్షకులకు
అధరమ్ములవి యెంత నత్యంత నవకమో
మాటలింకనుతోచు మార్దవముగ
కరశాఖలవి యెంత కమనీయమైనవో
కైతలింకనుతోచు నూతనముగ
ఆకృతదెంత గంభీరమో! అరయమోము
పై ప్రశాంతమ్మెతోచు నవాంతముగ
వేషమును చూచినంత, కవివరుండంచు

07/23/2017 - 01:39

ప్రముఖ రాజకీయ నాయకుడు

అహోబలరావు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స

పొందుతూ కోలుకుంటున్న సమయంలో

ఆకస్మికంగా మృతి చెందారని,

పార్ధీవదేహాన్ని ఆసుపత్రి నుంచి ఆయన

స్వగృహానికి తరలిస్తున్నారన్న వార్త టీవీ

ఛానళ్ల ద్వారా రాష్టమ్రంతటా వ్యాపించింది.

దాంతో సహచరులు, అభిమానులు, అధికార

పార్టీ నాయకులు, మంత్రులు, ఆయన

07/23/2017 - 01:37

ఒక అడవిలో ఒక నక్క ఉండేది. తనకు

ఆకలిగా ఉండటంతో అడవి అంతా

తిరగసాగింది. ఎక్కడా తనకు ఆహారం

దొరకలేదు. అలసిపోయి ఒక చెట్టు దగ్గర

కూర్చొని ఆలోచిస్తూ ఉండేది తన ఆకలి

బాధ ఎలా తీర్చుకోవాలి? అని. అప్పుడే నక్క

ఉన్న దగ్గరలో ఒక ఏనుగు చచ్చి పడి

ఉంటుంది. నక్కకు చాలా సంతోషం వేసి

అక్కడికి వెళ్తుంది. తన పళ్లతో ఏనుగు

07/23/2017 - 01:37

సాహితీవనంలో జీవిస్తున్న విశాఖపట్నంకు

చెందిన రచయిత అడపా రామకృష్ణ

ఆధ్వర్యంలో వెలువడిన మరో సంపుటి

‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’.

ఉత్తమమైన కవితలు, కథలు, కథానికలు

ఏర్చి ఒక సంపుటిలో వెలువరించడం

రివాజు. అలాగే అప్పుడప్పుడు వ్యాసాలు

వస్తుంటాయి. తాజాగా రామకృష్ణ కూడా

అటువంటి పనిచేశారు. వివిధ దిన, వార

07/23/2017 - 01:36

ఐదు దశాబ్దాలకు ఆవల
రెండు పదుల నిండు యవ్వనంలో
నాచేయి పట్టుకొని
ఏడడుగులు నడిచిన దృశ్యం
నా కనుల ఎదుట నిరంతరం
సాక్షాత్కరిస్తూనే ఉంది
నేటికి ఏడు పదులు నిండినా
అంతరంగంలోని
ప్రేమానుభూతులు
చలన రహితమై చెక్కుచెదరలేదు
నువ్వు నాలో సగమై
అర్ధాంగిగా రూపుదాల్చిన తరువాత
భౌతికంగా, మానసికంగా
నాలో మార్పులొచ్చాయిగానీ

07/23/2017 - 01:34

ప్రవాస దేశంలో ఉంటూ తెలుగు ప్రజల

సంస్కృతి, కళలు, తెలుగు నాటక రంగ

వికాసం కోసం ఉద్యమిస్తున్న ‘తెలుగు

కళాసమితి-కువైట్’ జాతీయ స్థాయి నాటిక

రచనల పోటీలు నిర్వహిస్తున్నట్లు

సమన్వయకర్త వైఎస్‌కెఎన్ స్వామి, సంస్థ

నూతన అధ్యక్షుడు వాసు మాగులూరి,

కార్యదర్శి పార్థసారథి ఒక ప్రకటనలో

తెలిపారు. నాటిక రచనల విభాగంలో ప్రథమ

07/16/2017 - 01:19

పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. రైతు

సిద్ధయ్య గట్టున కాలుమీద కాలు వేసుకొని

ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. జగదీష్ పని

జరిగేలా చూస్తున్నాడు. సిద్ధయ్య ‘ఒరేయ్ జగ్గా!

ఎంతసేపురా అక్కడ! రారా! నాకు ఇక్కడ చెనా

ఆకలిగా ఉండాది’ అన్నాడు. ‘పని చేస్తా ఉండ్లా

ఈడ నీకేమి కురిచీలో కూరుచుని సవాళ్ళు

పట్టిస్తా ఉంటావు. ఉండుమామా! ఫైవ్ మినిట్స్‌లో

07/16/2017 - 01:18

ఏరా.. బాగున్నావా?
ఎన్నాళ్లైంది ఈ పిలుపు విని
ఆ పిలుపులోని ఆప్యాయత
అనురాగం, ఆర్ధ్రత
ఎన్నాళ్లైంది వీటిని అనుభవించి
జౌను..
చదువు కోసమని, ఉద్యోగమని
కన్నతల్లిని, ఉన్న ఊరిని
అయినవారందరినీ విడిచి
ఆశగా పరుగెత్తాను
ఎండమావుల్లాంటి విదేశాల వైపు
కావాల్సినంత సంపాదించాను
ధగధగలాడే భవనాలు
కట్టుకున్నాను
అయినా.. ఏదో వెలితి

07/16/2017 - 01:17

కోపూరి పుష్పాదేవి రచయిత్రిగా, కవయిత్రిగా

తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర

వేసుకున్నారు. గృహిణిగా వుంటూనే నిత్యం

ఎంతో ఆసక్తిగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ

సాహితీ సేవ చేస్తున్నారు. అత్యంత సులభ శైలిలో

వెలువరించే ఈమె కవిత్వం, కథలు ఇప్పటికే

పాఠకుల మదిలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇంతకుముందే ‘పుష్పరాగాలు’ (2006),

07/09/2017 - 00:54

సన్నగా పడుతున్న చినుకులు ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చటంతో ఏమిచేయాలో పాలుపోక బెల్లూ-బ్రేకులు, కనీసం స్టాండు కూడా లేని పాత సైకిల్‌ను కింద పడేసి ఓ చెట్టు కింద నిలబడ్డాడు ఆ కోయగూడేనికి కొత్తగా వచ్చిన రఘు మాస్టారు. వాన తెరిపివ్వటంతో సైకిల్ తీసుకొని ఊళ్లోకి వెళ్లాడు. ‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు’ ఆ ఊరి పటేలే పలకరింపుగా ‘కొత్తగా కనబడతావుండావే. ఎవరు నువ్వు?’ అని అడిగాడు. ‘నేను ఈ గూడెం పటేల్‌ని.

Pages