S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

07/09/2017 - 00:53

తెలుగుజాతి వైభవాన్ని
తెలుగు భాష మాధుర్యాన్ని
తెలుగు పాట సోయగాన్ని
దశదిశలా చాటిన మేధోనిధి
విశ్వంభరతో జ్ఞానపీఠాన్నధివసించిన
పుంభావ సరస్వతి
నన్ను దోచుకొందువటే అంటూ
వలపు తలపులు చిలకరించినా
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని
శిలలలో మృదుభావాలు పలికించినా
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని
స్వేచ్ఛాగీతం ఆలపించినా

07/09/2017 - 00:52

సుందరం నా మిత్రబృందంలో ఒకడు. చాలారోజుల తర్వాత సుందరాన్ని చూడటానికి వెళ్లాను. ఇప్పుడది ఇల్లుకాదు, విల్లా! అందమైన షోకేసులు, వాటిలో సుందరం, వాడి శ్రీమతి ఫొటోలు, కొడుకు వారిని హత్తుకొని ఉన్న భంగిమలు! వాడు కవి కావటం వల్ల ఎన్నో జ్ఞాపికలు, సన్మాన పత్రాలు కూడా అలంకరించి ఉన్నాయి. ‘ఈరోజుల్లోనూ అంత అనురాగం చూ పే పుత్రరత్నాలు ఉన్నారా?’ అని మనసులోనే అనుకున్నా. సంతోషించాను.

07/09/2017 - 00:51

కవి జాని తక్కెడశిల మనసులో తనెలా అనుకుంటే అలా పదాల అమరికతో కవితలల్లారనే చెప్పాలి. ఎందుకంటే ఏభై ఒక్క కవితల కదంబమాల అంటే రంగు రంగుల పుష్పాల మాలనే కదంబ మాటల అంటారు. అలాగే రకరకాల కవితా వస్తువులతో అల్లిన కదంబ కవితా సంపుటి ఈ అఖిలాశ. ‘పెళ్లికూతురు’ కవితలో పెళ్లి వేడుకను కళ్లకు కట్టారు. ‘మాంగల్యం’ కవితలో పవిత్రత గురించి చెప్పారు.

07/03/2017 - 00:46

ఆదివారం ఉదయం 10 గంటలు. అమలాపురం అమ్మాయికి, అమెరికా అబ్బాయికి పెళ్లి. స్మార్ట్ ఫోన్, వాట్సాప్‌లో అందరికీ ఆహ్వానం. సుధీంద్ర పురోహితుల వారు జానెడు జరీ అంచు పంచె కట్టి, ఎర్ర శాలువా కప్పుకొని, ఐదు వేళ్లకి ఐదు ఉంగరాలు, మెడలో పులిగోరు చైన్ వేసుకొని, ఇన్నోవా కారులో కూర్చొని, ట్యాబంత అమెరికా సెల్‌ఫోన్‌లో నెట్ ఓపెన్ చేసి వివాహ వేడుక ఆహ్వానం సుమూహూర్తం సమయానికి అందరికీ మెసేజ్‌లు పెట్టారు.

07/03/2017 - 00:45

నా బాల్యంలో మా పల్లెలో
కల్మష రహిత రైతన్నల ఇళ్లలో
నా శ్రవణపు లోగిళ్లలో సందడి చేసిన
ఓ అందమైన పదరాజం.. ‘పాతర’!
ధాన్యపు రాసులతో నిండిపోయి
కళకళలాడుతుండేది పాతర
దాని వీక్షణలో నాడెందమానంద
డోలికల్లో విహరించేది
నేడుకూడా నా శ్రవణ శక్తికి
పరీక్షగా వినిపిస్తోంది పాతర!
ఉన్మాదుల వికృత చేష్టలతో
నైతిక విలువల పాతర..
కులాల కార్పణ్యాలతో

07/03/2017 - 00:43

‘ఈ శతాబ్ది నాది’- అని మహాకవి చెప్పుకున్నాడంటారు ఘనత వహించిన కొందరు వీర కమ్యూనిస్టులు. ఈ శతాబ్దంలో నాకూ భాగముందని బుచ్చిబాబు భావిస్తాడని నేనంటాను. విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. నాకెప్పుడూ ప్రభుత్వ విధానాల మీద, దాని తెలుగు భాషాభిమానం మీద నమ్మకం లేదు.

07/03/2017 - 00:43

‘నువ్వు భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండిపోతావా? మీ ఇంటి ఎదురుగానే మా పిన్ని ఇల్లు. మీ ఇల్లు నరకంలా ఉంటుందట. కలిసినప్పుడల్లా చెబుతుంటుంది. మీ అన్నలిద్దరూ మందుబాబులు. రాత్రి 10గంటల తరువాత ఇంటికి చేరి రచ్చరచ్చ చేస్తారట. తిట్లు, అరుపులు, అప్పుడప్పుడూ మీ వదినలను కొట్టటం నిత్యం జరిగే తంతట. మీ అమ్మా, నాన్న ఈ గోల భరించలేక తొమ్మిదింటికే భోజనం చేసి, తలుపులు బిగించుకొని పడుకుంటారట వారి గదిలో.

07/03/2017 - 00:42

తెలుగు సాహిత్య రంగానికి కొత్త రచయితలను అందించాలనే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరులో కథా రచయితల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసిద్ధ కథా రచయితలు విహారి, డా. వేదగిరి రాంబాబు, పాపినేని శివశంకర్, డా.

06/25/2017 - 01:54

అది ఒక ఆశ్రమం. స్వామీజీ తన శిష్యులను చెంతకు పిలిచారు. ‘మన చుట్టూ వున్న సమాజం రానురాను మంచి అలవాట్లను మరచిపోతూ చెడు చేసేవాటికి లొంగిపోయి తన ఆరోగ్యాన్ని తానే పాడుచేసుకుంటోంది. మనం గ్రామ గ్రామానికి వెళ్లాలి. ‘ఇప్పుడు మీరు చేస్తున్న పని సరైనది కాదు- మంచి మార్గంలో నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని వివరించాలి’ అని చెప్పారు. ‘మీరు కాగితం, పెన్నూ తీసుకురండి. నేను చెప్పిన విషయాలు రాసుకోండి.

06/25/2017 - 01:53

ఈరోజు మార్కెటింగ్ చెయ్యని
దినుసే లేదు
డబ్బుంటే ఆకాశం తోటలో
నక్షత్ర పుష్పాలనే కొనితెచ్చి
సిగలో తురుముకోవచ్చు
సముద్ర జలపుష్పాలు, మంచి ముత్యాలు
రాళ్లు, రత్నాలు సకల సంపదలు ధరవరలో
అమూల్య వ్యాపారమై రేటు పలుకుతోంది
చంద్రమండలంపై గ్రహరాశుల మీద
రేపు రియల్ ఎస్టేట్ బిజినెస్
మూడు పువ్వులు.. ఆరు కాయలుగా
వర్థిల్లనుంది

Pages