S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

09/03/2016 - 23:45

షాపింగ్ మాల్‌లోంచి బయటికొచ్చిన శృతి అతడిని చూసి షాక్ తింది. యశ్వంత్! కాలేజీ రోజుల్లో ఇలాగే.. ఇంత పోలిక ఎలా? ఇతనికి పాతికేళ్లు వుంటాయి. ఏదో అనుమానం. ‘మీ నాన్నగారి పేరేమిటి బాబూ?’ దగ్గరగా వెళ్లి అడిగింది. ‘తెలియదు’! సమాధానం విని తెల్లబోయింది. ‘మీ అమ్మ చెప్పలేదా?’ తల అడ్డంగా ఊపాడు. ‘మీ అమ్మ పేరు?’ అడిగింది. ‘్ధన్య’ అని చెప్పాడు. విషయం పూర్తిగా అర్థమైంది శృతికి. ‘నేను మీ అమ్మ ఫ్రెండ్‌ని.

08/31/2016 - 05:04

నాగరికతకి ఆధారమైన
జీవకోటికి ప్రాణాధారమైన
మానవ వౌన నేస్తాలు
పవిత్ర నదీనదాలు

అనాదిగా సాగే సంబంధం
విడదీయలేని అనుబంధం
కష్టసుఖాల అనుభవాల సారం
మనిషి చదవాల్సి‘నది’ గ్రంథం

మహారాష్ట్రంలోని
మహాబలేశ్వరంలో పుట్టి
ఆశలెన్నో మూటగట్టుకొని
ఆనందాలతో అడుగులేస్తోంది

08/31/2016 - 05:00

మీకు తెలుసా!.. ఉరుము ఎలాంటి శబ్దాన్ని మనకి వినిపిస్తుందో? అలాగే అది ఎలాంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడా తెలియదు కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!

08/31/2016 - 04:58

అదో చిన్న పల్లెటూరు. ఏకోపాధ్యాయ పాఠశాల వుందా ఊళ్ళో. ఒకటి నుండి మూడు తరగతులకు ఓ యాభైమంది విద్యార్థులున్నారు. శ్యాంసుదర్ ఆ ఊరి బడి ఉపాధ్యాయుడు. ప్యూన్ నుంచి హెడ్‌మాస్టర్ వరకు అన్ని పనులు తానే చేసుకోవాలి. తన హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పట్టిక, తదితర అన్ని రికార్డులు తన సంచిలోనే ఉంటాయి. మధ్యాహ్న భోజనం వండిపెట్టడానికో వంటమనిషి వుంది.

08/07/2016 - 04:43

రాజు, రమ అన్నా చెల్లెళ్లు. 7వ తరగతి చదువుతున్నారు. క్లాస్ జరుగుతుండగా ప్రిన్సిపాల్ గారు ఒక నోటీసు పంపారు. అందులో ‘పిల్లలూ..! ఇంకొక మూడు నాలుగు నెలల్లో మన స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది. మీరు స్వయంగా తయారు చేసిన మోడల్స్ ఆరోజు ప్రదర్శించవచ్చు. వాటికి ఫస్టు, సెకండ్ ప్రైజులు ఉంటాయి. అందరూ మెచ్చినదానికి ప్రత్యేక బహుమతి కూడా ఉంటుంది.

07/31/2016 - 07:48

జబ్బు ఒక్కోసారి మనుషులను దగ్గర చేస్తుంది. కమల, గౌతమ్ ప్రేమించి పెళ్ళి చేసుకుని ఒక పాప కలిగేక అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. పదేళ్ళ తరువాత ఏదో పురుగు కుట్టి కమల చనిపోతుందని తెలిసినప్పుడు గౌతమ్ ఆమె దగ్గరకెళ్ళి ఓదార్చి తనకు తెలిసిన డాక్టర్ ద్వారా ట్రీట్‌మెంట్ ఇప్పించి బతికించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ప్రేమగా మళ్ళీ దగ్గరయ్యారు.

07/26/2016 - 23:47

ప్రతి సింధువు వేలకోట్ల వర్షపు నీటి బిందువులకు మూలమైతే
కురిసే ప్రతి వర్షపు బిందువు పుడమితల్లికి ఆయువుపట్టే!
ఒడిసి పట్టే ప్రతి వర్షపు బొట్టే ప్రగతికి తొలిమెట్టైతే
నీటి పొదుపుకి వేసే ప్రతి మెట్టు పచ్చదనానికి ప్రాణం పోసినట్టే!
పట్టుపట్టు ప్రతి బొట్టు వెయ్యికోట్ల జీవుల దాహం తీరేట్టు..

07/26/2016 - 23:43

అన్నయ్య
కవితా సంకలనం
పుటలు 64,
వెల రూ. 40.
ప్రతులకు:
- గబ్బిట దుర్గాప్రసాద్,
అధ్యక్షులు, సరసభారతి,
2-405, శివాలయం వీధి,
రాజాగారి బంగ్లా వద్ద,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.
**

07/26/2016 - 23:48

‘బాల మృణాళతంతువును బాఱని నీకుచమధ్యమందు నీ
లాలకలగ్నమైన హృదయాంబు జమున్ మఱలింపఁజాలనో
బాల! ధనంజయాత్మజుఁడు వైరులు పన్నిన తమ్మి మొగ్గరం
బాలము సేయఁజొచ్చినటులయ్యెను వెల్వడనేర్పు చాలమిన్’

07/17/2016 - 07:26

‘ఉష ఆంటీ ఇప్పటికి నీకోసం మూడుసార్లు ఫోన్ చేశారమ్మా. నీ సెల్ స్విచ్ ఆఫ్‌లో వుందట. నీ ప్రయాణమెపుడని అడిగారు’
‘కాలేజీలో సెల్ ఆఫ్‌లో పెడ్తామని చెప్పకపోయావా? వొస్తూ టికెట్స్ తీసుకుని వొచ్చాను. ఈపూటే వెళ్తాను. రేపు నైట్‌కి రిటర్న్ అవుతాను. నేను ఉషతో మాట్లాడతాలే. ఇంతకీ నువ్వు మీ స్నేహితులని ఇక్కడికి రమ్మని చెప్పావా, లేదా ఈ రెండ్రోజులూ..’

Pages