S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

12/31/2016 - 23:41

మంచి పుస్తకాలలోని విషయాలు అక్షరాలు. అంటే శాశ్వతాలు. అక్షయ పరమాత్మ తత్త్వానికి ప్రతీకలు. అవి సారస్వత యశఃపతాకలు. నిరంతరం అక్షర రచనార్చన చేసేవారే కవులూ, రచయితలూ. అక్షర ప్రసాదాలను అందజేసే కార్యాలయాలే పుస్తక ప్రచురణ సంస్థలు. అంబరాన్ని అంటే సంబరంతో ఆ సువర్ణ ప్రసాదాన్ని పాఠక భక్తులు అందుకునే పండుగే పుస్తకాల సంక్రాంతి.

12/25/2016 - 08:31

సాయికృష్ణ నాలుగంటల నుండి కొడుకుని లేవుతున్నాడు. కానీ ముసుగుతన్ని మరీ పడుకుంటున్నాడు.
‘ఒరేయ్ సన్యాసీ! లేవరా. ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్టులు పోయాయి. లేచి చదువుకో. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి’
‘ఇంకో గంట పడుకుంటా నాన్నా. ఐదు గంటలకి లేస్తానులే’
‘ఒరేయ్ రాజీవ్ లేవరా! బాగా చదవకపోతే ఉద్యోగం రాదు’
‘గూగుల్‌లో గానీ, మహేంద్రలో గానీ వస్తాదిలే నాన్నా’

12/20/2016 - 23:03

‘ప్రిన్స్ ద గ్రాండ్’ ఇంటర్నేషనల్ హోటల్ కమ్ లాడ్జి 5వ అంతస్తును పోలీసులు చుట్టుముట్టి విజల్స్‌తో హోరెత్తించారు. నిత్యం అత్యంత రద్దీగా వుంటే బిగ్‌బజార్ వద్ద జనం క్యూలో చికాకుగా తిరుగుతూ తమాషా తిలకిస్తున్నారు. మహిళల ముఖాలకు ముసుగులు తగిలించి బిలబిలమంటూ రోడ్డు మీదకు వచ్చి, అప్పటివరకు ముసుగులో వున్న బోడిగుండు వ్యక్తిని పోలీసు అధికారి ప్రజలకు చూపించాడు.

12/20/2016 - 23:00

ఫెళఫెళలాడుతున్న ఎర్రని రెండు గాంధీబొమ్మ నోట్లు పైజేబులో పెట్టుకుని హుషారుగా నా పల్సర్ బైక్‌పై స్నేహితుడు నరహరి పెళ్లికి వెళుతున్నాను.
‘ఒరేయ్ శేఖర్ పెళ్లి ఆదివారం కదా. నీకు సెలవు. పెళ్లి రాత్రి అయినా తెల్లవారినప్పటి నుండి నువ్వు నా పక్కన ఉండాలి. అసలే నీకు మతిమరుపు. మరిచిపోగలవు జాగ్రత్తరోయ్’ అంటూ హెచ్చరించిన స్నేహితుడి హెచ్చరిక గుర్తుకొచ్చింది.

12/20/2016 - 22:52

‘ప్రజానటుడు’ కర్నాటి లక్ష్మీనరసయ్య నేతృత్వంలో 1965లో ఆవిర్భవించి గత ఏభై ఏళ్ళుగా అన్ని కళా రంగాలను ప్రోత్సహిస్తూ సేవ చేస్తున్న ఆంధ్ర నాటక కళాసమితి ఈ సంవత్సరం (2017) దేశ విదేశాల్లోని తెలుగు రాష్ట్రాల స్ర్తి, పురుషులను కవితల పోటీకి ఆహ్వానిస్తోంది. విజేతలకు సముచిత బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

12/16/2016 - 23:49

డెస్క్‌లో వార్తలు దిద్దడంలో బిజీబిజీగా వున్నాను. గడియారం ముళ్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. రిపోర్టర్‌కి అవసరమైతే తప్ప ఫోన్లు చెయ్యడమేకాని పర్సనల్ కాల్స్‌కి అటెండయ్యే తీరిక వుండదు. బిజీబిజీ.. పేజీలు ప్రింటింగ్‌కు వెళ్లేదాకా ఊపిరాడని పని. క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఇన్‌ఛార్జి దుర్గారావు తొందర పెడుతున్నారు. మళ్లీ మళ్లీ ఫోన్ రింగవుతోంది.

12/16/2016 - 23:42

వెల. రూ. 100
ప్రతులకు: మల్లెతీగ,
మన్నవవారి వీధి,
కృష్ణలంక, విజయవాడ.
చరవాణి : 9246415150
**

12/11/2016 - 02:11

ఉదయం ఐదు గంటలకి వాకిట్లో ముగ్గు వేస్తున్నాను. ఒక వృద్ధురాలు పూర్తిగా నడుము వంగిపోయి నేలవంక చూస్తూ వెళుతోంది. ధనుర్మాసం. ఇంకా పూర్తిగా వెలుగురాని ఈ సమయంలో ఏం పని? మళ్లీ తొమ్మిది గంటలకి ఒక ప్లాస్టిక్ కవరులో బాక్స్ పెట్టుకుని మా ఇంటి ముందు నుంచే వెళ్లింది.

12/11/2016 - 02:12

‘అమ్మా! మీ ప్రభాకర్ అన్నయ్య బకెట్ తనే్నశాడట. మా ఫ్రెండ్ చెప్పాడు’ అన్నాడు రవి.
‘పిచ్చివాగుడు ఆపరా. మొన్నకూడా ఆ తాయారమ్మ గారు పోయారని చెప్పావు. ఆవిడ నాకు రామకోటిలో కనిపించింది. ఎందుకిలా అందరినీ చంపేస్తున్నావు? మావోడికి కొద్ది నోటిదురుసు. అందుకే అందరం దూరంగా వున్నాం. చచ్చిపోయినా చెప్పనంత కక్షలు మామధ్య లేవు’ అంది దుర్గాంబ కోపంగా.

11/29/2016 - 00:20

‘బావని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని, అలాకాకుండా వేరెవరినో చేస్తే ఆత్మహత్య చేసుకుని చస్తానని’ బెదిరించింది తండ్రిని అమ్ములు.

Pages