S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

12/16/2016 - 23:49

డెస్క్‌లో వార్తలు దిద్దడంలో బిజీబిజీగా వున్నాను. గడియారం ముళ్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. రిపోర్టర్‌కి అవసరమైతే తప్ప ఫోన్లు చెయ్యడమేకాని పర్సనల్ కాల్స్‌కి అటెండయ్యే తీరిక వుండదు. బిజీబిజీ.. పేజీలు ప్రింటింగ్‌కు వెళ్లేదాకా ఊపిరాడని పని. క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఇన్‌ఛార్జి దుర్గారావు తొందర పెడుతున్నారు. మళ్లీ మళ్లీ ఫోన్ రింగవుతోంది.

12/16/2016 - 23:42

వెల. రూ. 100
ప్రతులకు: మల్లెతీగ,
మన్నవవారి వీధి,
కృష్ణలంక, విజయవాడ.
చరవాణి : 9246415150
**

12/11/2016 - 02:11

ఉదయం ఐదు గంటలకి వాకిట్లో ముగ్గు వేస్తున్నాను. ఒక వృద్ధురాలు పూర్తిగా నడుము వంగిపోయి నేలవంక చూస్తూ వెళుతోంది. ధనుర్మాసం. ఇంకా పూర్తిగా వెలుగురాని ఈ సమయంలో ఏం పని? మళ్లీ తొమ్మిది గంటలకి ఒక ప్లాస్టిక్ కవరులో బాక్స్ పెట్టుకుని మా ఇంటి ముందు నుంచే వెళ్లింది.

12/11/2016 - 02:12

‘అమ్మా! మీ ప్రభాకర్ అన్నయ్య బకెట్ తనే్నశాడట. మా ఫ్రెండ్ చెప్పాడు’ అన్నాడు రవి.
‘పిచ్చివాగుడు ఆపరా. మొన్నకూడా ఆ తాయారమ్మ గారు పోయారని చెప్పావు. ఆవిడ నాకు రామకోటిలో కనిపించింది. ఎందుకిలా అందరినీ చంపేస్తున్నావు? మావోడికి కొద్ది నోటిదురుసు. అందుకే అందరం దూరంగా వున్నాం. చచ్చిపోయినా చెప్పనంత కక్షలు మామధ్య లేవు’ అంది దుర్గాంబ కోపంగా.

11/29/2016 - 00:20

‘బావని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని, అలాకాకుండా వేరెవరినో చేస్తే ఆత్మహత్య చేసుకుని చస్తానని’ బెదిరించింది తండ్రిని అమ్ములు.

11/20/2016 - 07:06

మనోగీతికలు

11/12/2016 - 22:56

‘నాయనమ్మా! నాయనమ్మా! ఎక్కడున్నావూ?’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది మృదుల.
‘ఏమ్మా! ఏమిటీ?’ అడిగింది నాయనమ్మ.
‘నాయనమ్మా! మరే ఈరోజు మా స్నేహితురాలు సుజన పుట్టిన రోజుకదా!’ అన్నది మృదుల.
‘అవును! నిన్న చెప్పావుగా. పొద్దున మీ స్నేహితురాలికి ఇస్తానని గులాబీ పువ్వు కూడా తీసుకెళ్లావుగదా!’ అన్నది నాయనమ్మ.

11/12/2016 - 22:49

రేపు ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి
వర్ధంతి సందర్భంగా..
**

11/12/2016 - 22:43

భరతమాత మెడలో మణిహారంలా వెలిసిన
హిమాలయ సానువుల్లో
ఉత్తరాన నెలకొన్న ఉన్నత శిఖరాల్లో
అహరహం శ్రమించే
అలుపెరుగని ధీరులు మన సైనికులు
తలిదండ్రులను విడచి
భార్యాబిడ్డలను మరచి
కార్యదీక్షా పరాయణులై
కదనరంగంలో కదంతొక్కుతూ
హిమపాతమైనా జలపాతమైనా
విపత్కర పరిస్థితులెన్నైనా
విధికి ఎదురొడ్డి నిలిచే
మన వీరజవానులకు

11/12/2016 - 22:39

వచ్చే ఏడాది మే 26, 27, 28 తేదీల నాటికి తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు 21వ తానా మహాసభలుగా సెయింట్ లూయిస్‌లో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా వివిధ సాహిత్య కార్యక్రమాలు చేపడుతోంది.

Pages