S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

09/03/2016 - 23:30

అక్షరాల పొందిక, కవితా కదలిక, ఆశల ఆలోచన, ఊహల ఉత్తేజం, సాహిత్య విమర్శనాస్త్రాలు, జనజీవన వ్యథలు, అభాగ్యుల ఆర్తనాదాలు, జన జాగృతికై జన హృది నగారా మోతలు, సమస్యల పరిష్కార మార్గాలు రూపుదిద్దుకున్న కవితా స్పందనను ఆవిష్కరించారు తన రెండవ రచనగా కవి పుల్లా రామాంజనేయులు. చేయి తిరిగిన రచయితే కాక చిత్రకళా ప్రవీణులు. ఆయన ఎన్నో ప్రశంసలు పొందిన వ్యక్తి.

09/03/2016 - 23:29

‘‘్ఛఛీ వ్యవస్థ నాశనమైపోతోంది. ఎక్కడ చూసినా మోసమే. ఎవ్వడిలోనూ నిజాయితీ లేదు. యువత మరీ చెడిపోయింది. ఎవరికీ క్రమశిక్షణ లేదు’’ ఈ సమాజం తీరు తెన్నులను ఏవగించుకుని రోజుకు ఓ పది పదిహేనుసార్లు అనుకోవడం భుజంగరావు మాస్టారుకి అలవాటు. ‘‘జనాల మనస్తత్వాలు బాగుపడతాయనుకోవడం, మంచి రోజులొస్తాయనుకోవడం ఉత్తభ్రమ’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు క్యూలో తన వెనుక నించున్న వ్యక్తితో.

08/29/2016 - 22:36

ఎందరో మహానుభావుల త్యాగఫలం
మన త్రివర్ణ జెండా
అందుకే ప్రతి ఒక్క భారతీయుడిలో
ఉండాలి నిజమైన దేశభక్తి గుండె నిండా
మూడు రంగుల జెండాయే కదరా
సమస్త భారతీయులకు అండ
నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు మెలగాలి
అప్పుడే కదా దేశఖ్యాతి పాకుతుంది
ఖండాంతరాల గుండా
దేశ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడే ఈ జెండాయే మనకు చల్లని నీటికుండ
మనమంతా ఒక్కటై బతకాలి

08/29/2016 - 22:33

సుభద్రాదేవి చాలా అందగత్తె. చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త అన్నా, అతని అనురాగమన్నా పూర్తిగా తెలియకముందే ఇద్దరు పిల్లల తల్లైంది. మేనరికం కావడం వల్ల ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు వయసు పెరుగుతోంది. భర్తకు ఆమెకు వయసు అంతరం పదేళ్లు కావడంవల్ల ఆమె మనసు కోరికల్ని అతడి వయసు తీర్చలేకపోతోంది. అలా స్వయంగా సుభద్రే అందరు అమ్మాయిల్లా అనుకుంటోంది.

08/29/2016 - 22:31

ప్రపంచంలోకెల్లా భారతదేశంలోని సంస్కృతీ సంప్రదాయాలు మానవుని జీవనానికి ఎంతో మేలు కలిగేలా తోడ్పడుతున్నాయి. ఎందరో రుషిపుంగవులు తమ జీవితాలను త్యాగం చేసి తపస్సులు, పరిశోధనలు చేసి ఆ సంప్రదాయాలను మనకు అందించారు. అయితే, పాశ్చాత్య సంస్కృతి మూలంగా ఇవి కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకున్నాయి. తత్ఫలితంగా మానవుని జీవన విధానం కూడా మారిపోతోంది. అంతా స్పీడ్ యుగం వచ్చేసింది.

08/29/2016 - 22:29

‘‘ఎందుకురా నాయనా మనకు తగవులు. ఇంటి వద్ద ఉండవచ్చు కదా’’ అంటూ కుమారుని వారించింది కిరణ్ తల్లి. కిరణ్‌ది పాతిక సంవత్సరాల వయస్సు. ఉడుకు రక్తం గల వయసది. రంగారావు ఆ గ్రామానికి నాయకుడు. ఆయన చేయని కుట్ర లేదు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఉన్న అవినీతిని బయటికి లాగి ప్రజల ముందుంచే తత్వం కలవాడు కిరణ్. ఒకసారి కిరణ్ ఉంటున్న వీధికి సిమెంట్ రోడ్డు మంజూరు అయింది.

08/14/2016 - 21:52

సుభద్రాదేవి చాలా అందగత్తె. చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త అన్నా, అతని అనురాగమన్నా పూర్తిగా తెలియకముందే ఇద్దరు పిల్లల తల్లైంది. మేనరికం కావడం వల్ల ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు వయసు పెరుగుతోంది. భర్తకు ఆమెకు వయసు అంతరం పదేళ్లు కావడంవల్ల ఆమె మనసు కోరికల్ని అతడి వయసు తీర్చలేకపోతోంది. అలా స్వయంగా సుభద్రే అందరు అమ్మాయిల్లా అనుకుంటోంది.

08/07/2016 - 21:59

కందకాలు పూడ్చేయాలంటే
కండను కదిలించాలి
గుండెలో భయం ముల్లై గుచ్చితే
కొండను ధ్యానించాలి!
చెలియ కోపమును చల్లార్చాలని
తలచేటి గాలిబా!
చెలిమి కోసమై రాయబారి
పూదండను పంపించాలి!
పూజలందుకొను వారసత్వాన్ని
సులభంగా పొందలేవులే
శిల్పం కోసం కాలం చెరుపని
బండను శోధించాలి!
చీకటి తెరలను చీల్చేయాలని
కలలు కంటున్న ఓ దానా

08/07/2016 - 21:55

పదిహేడు నుండి ఇరవై నాలుగు అక్షరాల మధ్య ఒక అర్ధవంతమైన భావచిత్రాన్ని అందించేది నానీ. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అక్షరాలతో ఆహా అనిపించేటట్లు రత్నాల బాలకృష్ణ తన తరవాణి నానీల సంపుటి ద్వారా జీవిత సత్యాన్ని చెప్పారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే నానీలకు నారు నీరు పోసిన డాక్టర్ గోపి బాలకృష్ణ నానీలు చదవగానే పువ్వుల పొట్లం విప్పినప్పుడు గుప్పుమనే పరిమళంలా అనిపించింది అన్నారు.

08/07/2016 - 21:54

సర్వేశ్వరశర్మగారు మంచి పేరున్న ఉపాధ్యాయుడు, వేదపండితుడు, సాహితీవేత్త. ఈమధ్యనే ఉద్యోగ విరమణ చేసారు. విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఈయనకు అవిశ్రాంత శ్రమ పెరిగింది. పిల్లలిద్దరూ పెళ్లిళ్లు అయి అమెరికాలో ఉన్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు అన్నీ తానై సేవలందిస్తూ కోలుకునేటట్టు చేస్తున్నారు. ఇదివరకు ఇంట్లో ఏచిన్న పని కూడా తాను చేసియెరగడు. యింట్లో పనిమనిషి కొన్ని పనులు వరకు మాత్రమే చేయగలదు.

Pages