S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

06/12/2016 - 00:12

విష్ణుమూర్తి అంగుష్టమునందు
ఉద్బవించిన గంగమ్మా
ఉర్వి పైకి రావమ్మా
శివుని జటాజూటాలలో
చిక్కుకున్న గంగమ్మ
జగానికి రావమ్మా
పంచభూతాలలో
నీవొకదానివి గంగమ్మా
ప్రాణికోటికంతటికీ
అవసరమైన గంగమ్మా
పృధ్విపైకి రావమ్మా
నీవు లేని జగము నిర్మానుష్యమ్ము
జీవకోటికంతటికీ
నీవే జీవనాధారము
బంగారు పంటలు పండించమ్మా

06/11/2016 - 23:29

అవంతిక రాజ్యం కార్తికేయ మహారాజు పాలనలో సుఖశాంతులతో సుభిక్షంగా సాగుతూ ఉండేది. కార్తికేయ మహారాజుకు ఒక్కగానొక్క కొడుకు నిత్యయవనుడు. అతను చిన్న నాటి నుండి అతి గారాబంగా పెరిగాడు. తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది వ్యవహారం. కార్తికేయ మహారాజు తనకు అరవై ఏళ్లు దాటాక సన్యాసం స్వీకరించాలని చాలా కాలం క్రితం నిర్ణయించుకోవడంతో రాజ్యాధికారాన్ని కుమారుడికి అప్పగించి బయలుదేరాడు.

06/11/2016 - 23:26

వెంకటరాఘవపురంలో మునసబుగా పని చేసాడు నవనీతంనాయుడు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో అతని ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. అతని మనవడు నవీన్. అతను ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ చేస్తున్నాడు. అక్కడే అశ్విని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు ఇంట్లో వాళ్ల నుండి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాదని అతను భావించాడు. అయితే విషయం తెలిసిన నవనీతంనాయుడు మండిపడ్డాడు.

06/11/2016 - 23:17

తన తల్లి కీర్తిశేషులు భారతమ్మకి భక్తిశ్రద్ధలతో అంకితమిచ్చిన డాక్టర్ కురుమేటి కిశోర్‌కుమార్ కవితా సంపుటి ఈ నంది వర్ధనాలు. నంధ్యాలలో ప్రముఖ దంత వైద్యుడిగా ఉంటూ మరో వంక సాహితీప్రియత్వం, రచనా పటిమ గల సవ్యసాచి. ఇది వీరి ప్రథమ రచన. చేయి తిరిగిన అనుభవం ఉన్నట్లు రాశారు ఆయన. ఇందులో మొత్తం 56 కవితలున్నాయి. అన్నీ వైవిధ్యంగా సాగాయి. కొన్ని భారతీయ సంస్కృతికి అద్దం పడతాయి.

06/11/2016 - 23:15

రైతుబజారు దగ్గర ఆదివారం వచ్చిందంటే చాలు నడవడానికి కూడా దారి ఉండదు. రెండు వైపులా తోపుడుబళ్లు, వాటి మధ్యలో వాహనాల పార్కింగ్. రోడ్లపైనే అమ్మకాలు సాగిపోతుంటాయి. లోపలికెళ్లడానికి విపరీతమైన శ్రమ. అటు నుండి కూరగాయాల బ్యాగుతో రావడం మరీ శ్రమ. కొంచెం దూరంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇద్దరుంటారు. మెయిన్‌రోడ్డుపై వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు గానీ ఇటు వైపు చూడరు.

06/05/2016 - 08:10

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.

05/30/2016 - 00:24

పెళ్లి ముహూర్తం అర్ధరాత్రికి. ఉదయం తోరు సంబరం కార్యక్రమం జరుగుతోంది. అటు ఆడపెళ్లివారి తరఫున, ఇటు మగపెళ్లి వారి తరఫునా రావలసిన బంధువులంతా వచ్చేశారు. బ్యాండుమేళం కాసేపు మంచి సినిమా పాటలు వాయించి వినిపించారు. పెళ్లి కూతురి పేరు శే్వత. పెళ్లికొడుకు పేరు సూర్యప్రతాప్.

05/22/2016 - 22:57

‘కొడుకు బలవంతపు చావుకి తనే కారణం. తనలో సహనగుణం ఉంటే ఇంత అనర్థం జరగకపోను. తన కోపమే తన శత్రువు. తొందరపాటు, అసహనం ఇవన్నీ చేతికి అంది వచ్చిన కొడుకుని నిష్కారణంగా దూరం చేశాయి’ కానిస్టేబుల్ శంకరం బాధగా అనుకున్నాడు.

05/15/2016 - 05:53

‘‘డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా?’’ అడిగాడు రఘురాం.
‘‘వచ్చాయి. అదీ...’’ నసిగాడు.
‘‘్ఫర్వాలేదు చెప్పండి! విని తట్టుకోగల శక్తి నాకుంది’’ అన్నాడు రఘురాం.
‘‘మీ వెన్నుముక దెబ్బతింది. మీరు వైవాహిక జీవితానికి పనికిరారు’’ చెప్పాడు డాక్టర్.
రఘురాంకి మిన్ను విరిగి మీద పడినట్లు అయింది. అయినా తమాయించుకుని ‘‘బై డాక్టర్’’ అంటూ బయటికి వచ్చేసేడు.

05/08/2016 - 06:08

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.

Pages