S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

12/13/2015 - 08:04

నర్సీపట్నం, డిసెంబర్ 12: విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఓ ఫ్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.

12/13/2015 - 08:04

పాడేరు, డిసెంబర్ 12: మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమ కేసులు బనాయించారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు.

12/13/2015 - 08:03

విశాఖపట్నం, డిసెంబర్ 12: దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయు హెచ్చరించింది. రాష్టవ్య్రాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖలో పలుచోట్ల శనివారం కార్మికులు నిరాహారదీక్షలు చేపట్టారు.

12/13/2015 - 08:02

విశాఖపట్నం, డిసెంబర్ 12: లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా జడ్జి వి జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 9వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సాధికార సంస్థ ఆదేశాల మేరకు 18 అంశాలకు సంబంధించి కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవచ్చన్నారు.

12/13/2015 - 08:02

విశాఖపట్నం, డిసెంబర్ 12: వచ్చే ఏడాది ఒకటొ తేదీ నుంచి అమలు కానున్న కొత్త ఇసుక విధానానికి సంబంధించి మరో వారం రోజుల్లో విధానాన్ని ఖరారు చేయనుంది. కొత్త విధానంలో ఇసుక టెండర్లు పిలవడం, రీచ్‌ల కేటాయింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను గనులశాఖకు అప్పగించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు సాధికారత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇసుక రేవులను (రీచ్) వారికి అప్పగించారు.

12/13/2015 - 08:01

విశాఖపట్నం, డిసెంబర్ 12: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) కమిషనర్ ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో గడపనున్నారు. ఈ నెల 14,15 తేదీల్లో ఢిల్లీలో జరిగే రెండు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ నివేదిక మేరకు ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు 2015ను జివిఎంసి దక్కించుకుంది.

12/13/2015 - 04:41

‘‘సుబ్బారావు మాస్టారు అనాథాశ్రమంలో ఉండడమేంటి? ఆయనకంత ఖర్మేం పట్టింది?’’
‘‘ ఏం చేస్తాం... మాస్టారి మంచితనమే అతన్ని ఈ స్థితికి దిగజార్చింది’’
‘‘అయినా అతనికి ముగ్గురు కొడకులు, ఒక కూతురు ఉన్నారు. అంత మంది కుటుంబం ఉండగా ఇదేం దుస్థితి?’’
‘‘అమ్మగారు చనిపోయిన తరువాత మాస్టారి పరిస్థితి మరీ దారుణమయిందటరా. అతని పిల్లలే వీధిలో పడేశారట’’

12/07/2015 - 09:21

మెరుపు - విశాఖపట్టణం
ప్రాణాలు తీసిన ప్రేమలు -- కథానిక

11/22/2015 - 05:15

‘‘సార్! మన సెల్ టవర్ల నుండి సిగ్నల్స్ కట్ అయ్యాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు’’ అన్నాడు ఆటా సెల్యులర్ నెట్‌వర్క్ సంస్థ ఎగ్జిక్యూటివ్ రవికాంత్.
‘‘సిగ్నల్స్ కట్ అయ్యాయా? ఏ టవర్ల నుండి’’ ఆత్రుతగా అడిగాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పాండే.
‘‘నగరంలో అన్ని టవర్ల నుండి సిగ్నల్స్ కట్ అయ్యాయి సార్’’ అన్నాడు రవికాంత్.

06/20/2015 - 11:09

విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 10 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి తెలుగుదేశం, వైకాపాల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారం నాటితో ముగిసింది.

Pages