S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

07/09/2017 - 01:26

సాహితీవనంలో జీవిస్తున్న విశాఖపట్నంకు చెందిన రచయిత అడపా రామకృష్ణ ఆధ్వర్యంలో వెలువడిన మరో సంపుటి ‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’. ఉత్తమమైన కవితలు, కథలు, కథానికలు ఏర్చి ఒక సంపుటిలో వెలువరించడం రివాజు. అలాగే అప్పుడప్పుడు వ్యాసాలు వస్తుంటాయి. ఇలానే.. తాజాగా రామకృష్ణ కూడా అటువంటి పనిచేశారు. వివిధ దిన, వార తదితర పత్రికల్లో వెలువడిన వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.

07/09/2017 - 01:25

అమరవీరుల దినోత్సవం నాడు భర్త ఫొటోకు పుష్పాంజలి ఘటించి తదేకంగా ఫొటోను చూస్తూ ‘ఏమండీ మీ ఆశయ సిద్ధికోసం నేను నిరంతరం శ్రమిస్తున్నాను. మీరు మమ్ము వీడి పైలోకం చేరినా, మీ ఆశయాలు మా హృదయాలలో వికసిస్తున్న కమలాలే. పెద్దవాడు భరత్ కర్షకునిగా నాలుగు నోళ్లకు ఇంత ముద్ద పెట్టగలగుతున్నాడు.

07/09/2017 - 01:24

బలివాడ కాంతారావు స్మారక జయంతి-2017 సందర్భంగా విశాఖపట్నంలో భారతనిధి ఫౌండేషన్ ఛైర్మన్ డి. ఎస్.వి. గోపీకృష్ణ, విశాఖ రచయితల సంఘం, విశాఖ మాసపత్రిక సంయుక్తంగా బలివాడ కాంతారావు రచనలపై నిర్వహించిన సమీక్ష/వ్యాసరచన పోటీల ఫలితాలను విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ తెలిపారు.
పోటీ విజేతలకు
రూ. 15 వేలు చొప్పున నగదు బహుమతి

07/03/2017 - 00:59

‘‘బాబాయ్ జానకి ఎలా ఉంది? దాన్ని చూసి చాలా కాలం అయింది. ఇక్కడికి వస్తూ ఉంటుందా?’’ జానకి తండ్రి శంకరం గారిని అడిగాను సంక్రాంతి పండగకి మా వాళ్లింటికి వచ్చిన నేను.

07/03/2017 - 00:57

వాడెప్పుడో చిన్నప్పుడు కనిపించాడు
మళ్లీ అదేదో ఫంక్షన్లో కనిపించాడు
క్లాస్‌మేటని పేరే గాని
చదువు పూర్తయ్యాక కనిపించనేలేదు
జీవితాల్లోకి పేజరొచ్చింది
అయినా సందేశాల్లేవు
మొబైల్ ఫోనొచ్చింది
అయినా మాటల్లేవు
ఫేసు బుక్కొచ్చింది కానీ
వాడి ఫేసు కనబడదు
ట్విట్టరొచ్చింది
వాడు తప్ప ప్రపంచమంతా
ఏం చేస్తుందో చెప్తాడు

07/03/2017 - 00:56

కవి జాని తక్కెడశిల మనసులో తనెలా అనుకుంటే అలా పదాల అమరికతో కవితలల్లారనే చెప్పాలి. ఎందుకంటే ఏభై ఒక్క కవితల కదంబమాల అంటే రంగు రంగుల పుష్పాల మాలనే కదంబ మాటల అంటారు. అలాగే రకరకాల కవితా వస్తువులతో అల్లిన కదంబ కవితా సంపుటి ఈ అఖిలాశ.

07/03/2017 - 00:55

‘‘ఈ రోజుల్లో కథలు, నవలలు ఎవరు చదువుతున్నార్రా?’’ అన్నాడు ఆనందమూర్తి.
‘‘చదివేవాళ్లు ఉండరంటావా?’’ గురుమూర్తి అడిగాడు.
‘‘అలా అనకు కానీ శ్రద్ధగా ఇతని రచనలు బాగుంటాయి. మరిన్ని రాస్తే బాగుండును అనేవాళ్లు తగ్గిపోయారు’’
‘‘సృజనాత్మకశక్తి నశించకపోతే ప్రచురణ అయిన ప్రతి రచనా రచయితను రెచ్చగొడుతుంది. అంతకంటే మంచి రచన చెయ్యాలన్న తపనతో’’
‘‘పిల్లలేం చేస్తున్నారు ఇప్పుడు?’’

06/25/2017 - 01:36

ప్రతిపక్షంలో చురుకైన నేత కొండా మోహనరావు. ప్రతిపక్ష నేత తర్వాత అతనే పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. అలాగే అధికార పక్ష నేతలని, ముఖ్యమంత్రులని తన స్వరంతో, మాటల మహిమతో, పదునైన సంభాషణలతో ఇరుకున పెడతాడు. ఒక్కొక్కసారి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతాడు. అధికార నేతలకి అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కంగారుపడుతుంటారు. అతను రైతు సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలడు.

06/25/2017 - 01:33

అది ఒక ఆశ్రమం. స్వామీజీ తన శిష్యులను చెంతకు పిలిచారు. ‘మన చుట్టూ వున్న సమాజం రానురాను మంచి అలవాట్లను మరచిపోతూ చెడు చేసేవాటికి లొంగిపోయి తన ఆరోగ్యాన్ని తానే పాడుచేసుకుంటోంది. మనం గ్రామ గ్రామానికి వెళ్లాలి. ‘ఇప్పుడు మీరు చేస్తున్న పని సరైనది కాదు- మంచి మార్గంలో నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని వివరించాలి’ అని చెప్పారు. ‘మీరు కాగితం, పెన్నూ తీసుకురండి. నేను చెప్పిన విషయాలు రాసుకోండి.

06/25/2017 - 01:32

సృష్టిలో తీయనిది తెలుగు భాష
తెలుగు భాష జాతి వెలుగు భాష
పరభాష పోకడలతో
నీ భాషను నిరసించకు
తెలుగు అక్షరాలను పూమాలగా కూర్చి
తెలుగు మాత కంఠాభరణంగా అలంకరించు
తేనెలొలుకు తెలుగు భాష
దేశ భాషలందు తెలుగు లెస్సని
నలుదిక్కులా ఎలుగెత్తి చాటు
తెలుగు భాషను ప్రేమించు
తెలుగుకు జీవం అద్ది
రేపటి తరానికి అందించు
అన్య భాషలపై మోజు తగదు

Pages