S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

03/20/2016 - 00:02

విశాఖపట్నం: జివిఎంసి కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కమిషనర్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

03/20/2016 - 00:01

విశాఖపట్నం: రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు బకాయిపడిన రెండు మాసాల జీతాలను వెంటనే చెల్లించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వివిఎల్ నర్సింహులు డిమాండ్ చేశారు. గత కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా దీని గురించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితంలేకపోయిందన్నారు.

03/20/2016 - 00:00

విశాఖపట్నం: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి వ చ్చేనెల ఐదవ తేదీ వరకు జరిగే సామాజిక న్యాయ సాధికారిక యాత్రలు విశాఖ నుంచి మొదలవుతాయి. వీటిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభిస్తారు. ఇందుకోసం ఆదివారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.

03/19/2016 - 23:59

విశాఖపట్నం: చేపలవేటకు వెళితే మత్స్యకారులకు పంట పండినట్టే. ఇది ఒకప్పటి మాట. అదే ప్రస్తుత పరిస్థితుల్లో వేటకు వెళితే వ్యయప్రయాసలే తప్ప. కష్టానికి తగినట్టుగా ఫలితమనేది ఏమాత్రం ఉండటంలేదు. జీవనం కోసం సాహసించి సముద్రంలోకి చేపలవేటకు వెళ్ళడమే మిగులుతోందంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల నెలకొన్న పరిస్థితులు అనేక కారణాలతో చేపలవేట ఏమాత్రం కలసిరావడంలేదు.

03/19/2016 - 23:56

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన తీరు రాక్షస పాలనను గుర్తు చేస్తుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాద్ అన్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం డాబాగార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయన్నారు.

03/19/2016 - 23:54

విశాఖపట్నం: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా మార్షల్స్ అడ్డుకోవడం విచారకరమని వైకాపా నేత గొల్ల బాబురావు అన్నారు. శనివారం వైకాపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టు తెలిపిన విషయమై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ ముందుగా చెప్పి ఉంటే బాగుండేదన్నారు.

03/19/2016 - 23:51

విశాఖపట్నం: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం నగరంలోని క్వీన్స్ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంలట వరకు పరీక్ష ఉంటుంది.

03/19/2016 - 23:50

విశాఖపట్నం: అసంపూర్తిగా ఉన్న బిఆర్‌టిఎస్ పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న బిఆర్‌టిఎస్ రహదారి పనులను ఆయన శనివారం పరిశీలించారు. జ్ఞానాపురం, కంచరపాలెం మీదుగా ఎన్‌ఎడి జంక్షన్ వరకూ ఆయన పరిశీలించారు. జ్ఞానాపురం డక్ట్‌లను, గ్రిల్స్‌ను, కేబుల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

03/19/2016 - 23:46

విశాఖపట్నం: నగరంలో ఆధునిక చేపల మార్కెట్ నిర్మించేందుకు ఇక్కడి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్, నర్సీపట్నం, అచ్యుతాపురం, భీమిలిల్లో కూడా చేపల మార్కెట్‌లను నిర్మించనున్నారు. నగరంలోని దండు బజార్, నెహ్రూ బజార్, గోపాలపట్నంలోని చేపల బజార్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. నగరంలో వివిధ రకాల చేపలకు డిమాండ్ ఉంది. ఆదివారం ఇతర జిల్లాల నుంచి తెచ్చి కూడా విక్రయాలు చేస్తుంటారు.

03/13/2016 - 22:49

మోహన్ చిన్నప్పటి నుండీ చురుకైన కుర్రాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ నెంబర్ వన్ స్టూడెంట్‌గా ఉండేవాడు. ‘‘మీ కుర్రాడు మంచి తెలివైన వాడోయ్, కాస్త కష్టమైనా పెద్ద చదువులు చదివించు పెరిగి పెద్దయిన తరువాత మంచి స్థాయిలో ఉండి నీకూ నీ కుటుంబానికీ, ఈ ఊరికీ గొప్ప పేరు తెస్తాడు మీవాడు’’ అని అంటుండేవారు స్కూల్ టీచర్స్ మోహన్ తండ్రి అప్పారావుతో. అప్పారావు ఆటో డ్రైవర్.

Pages