S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

02/20/2017 - 02:06

పంతంతో విక్రమార్కుడు చెట్టు వద్దకు పోయి శవాన్ని దించి వౌనంగా నోర్మూసుకుని శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘‘రాజా! నువ్వు పడుతున్న శ్రమను తగ్గించుటకు ఒక జరిగిన కథ చెముతాను విను’’ అని బలవంతంగా చెప్పసాగాడు.

02/12/2017 - 04:55

కొడుకు శ్రావణ్ ఉద్యోగం కోసం దుబాయ్‌కి, కూతురు ప్రమీల భర్త వినోద్‌తో కలసి అమెరికాకి వెళ్లిపోవడంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు ఉమాపతి, అనురాధ.
ఓరోజు ఉమాపతి సెల్‌కి కొడుకు శ్రావణ్ వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు.
‘గౌరవనీయులైన నాన్నగారికి ...

02/12/2017 - 04:53

సంకల్పబలం, సహృదయతే
మనిషికి సర్వవేళలా మది నిండాలి
కార్యదక్షత తోడైతే
కార్యోన్ముఖుడైతే
ఉన్నతాశయ శిఖర పయనంలో
విజయఫలం లభ్యం
నిండు మనిషికి ఆవశ్యం
శుభ సూచి
మఖవరస్సుతో
నిత్య సంతోషిలా
విరాజిల్లాలి
నిత్యానంద స్వరూపమే
నిత్య శుభాశీర్వచనమే
మనిషికి శుభాహ్వానం
మనిషి కృషియే పరమావధిగా
సర్వజన శ్రేయోగామిగా

02/12/2017 - 04:50

ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువగా కనబడుతోంది. రెండు మనసుల కలయిక ప్రేమ. కానీ అందుకు విరుద్ధంగా కొంత మంది అనాలోచితంగా శారీరక ఆనందానికే ఎక్కువ విలువనిస్తున్నారు. భవితను అంధకారం చేసుకుంటున్నారు.

02/12/2017 - 04:35

బాల్కనీలో నుండి హాల్లోకి హాల్లో నుండి బాల్కనీలోకి తిరుగుతున్న వసంత భర్త రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.
‘ప్రతిరోజూ ఆరున్నరకే వచ్చేసేవారు. ఈరోజు ఏడవుతున్నా రారేమిటబ్బా?’ అనుకుని నిముషాలు లెక్క పెడుతోంది.
అపార్ట్‌మెంట్ కింద స్కూటర్ హారన్ వినిపించడంతో ‘హమ్మయ్యా ఆయన వచ్చేసారు’ అనుకుంటుండగానే వసంత భర్త తరుణ్ ఇంట్లోకి వచ్చాడు.

02/12/2017 - 04:33

ఏపుగా పెరిగిన కొమ్మల్లోంచి
గుత్తులు గుత్తులుగా
భూత భవిష్యత్ వర్తమానాలనే
త్రికాలాలను సూచిస్తూ
మొగ్గలై పూవులై వడలిన పూరేకులై
నేలంతా పరుచుకుని పరిమళాలను వెదజల్లుతూ
నీలమేఘశ్యాముని మెడలో
తెలతెల్లని పూమాలగా మురిసిపోయే వేళ
దారమే అవసరం లేని కాడలని మడచి
మాలగా అల్లిన రోజులు
మరి నేడు ఈ పూవులిపుడు పనికి రావటగా

02/12/2017 - 04:26

గతంతో పోల్చుకుంటే వర్తమానంలో నవల, కథల పఠనం కొంతమేర తగ్గింది. ఈ పరిణాం వల్ల ఔత్సాహిక రచయితలు, చేయి తిరిగిన రచయితలపై మరింత భారం లేదా బాధ్యత పడిందనే చెప్పాలి. కొంతమంది తమ రచన పేరొందిన పత్రికల్లో అచ్చయ్యాక పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకొందరు ఉత్సాహంతో పుస్తకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. తీరికలేని పాఠకుడు ఈ రెండో రకం నవల్లోకి వెళ్ళేముందు ఏదైనా పత్రికల్లో పడిందా లేదా అని పరిశీలిస్తాడు.

01/29/2017 - 00:26

‘‘ముహూర్తానికి టైం అవుతోంది సుజీ’’ తయారవడం పూర్తి అవగానే భార్యికి వినిపించేలా అన్నాను గట్టిగా.
నిజానికి అప్పటికే అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అయిందనే చెప్పాలి.
నేను అలా అన్న వెంటనే నా భార్య సుజీ నుండి వెంటనే సమాధానం రాలేదు. దానికి కారణం నాకు తెలుసు.
ఆడవాళ్ల ముస్తాబు అంత త్వరగా తెమలదు కదా.
అందుకే మళ్లీ రెట్టించలేదు నేను ఆమెకి కోపం వస్తుందని.

01/29/2017 - 00:22

ప్రపంచం నా అరచేతిలో
నేను స్మార్ట్ఫోన్ గుప్పిట్లో

ఫేస్ టు ఫేస్ అయితే నో లుక్స్
ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ అబ్బో చాలా లైక్స్

నా టైం బాలేదు అన్నాడు మొహంలో దైన్యం
ఇంకా చాలా టైం ఉంది అన్నాను కన్పించింది ధైర్యం

ప్రజాస్వామ్యానికి బలం ఓటు
కానీ నోటు దానికి పొడిచింది వెన్నుపోటు

01/29/2017 - 00:19

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తు చేస్తాయి ఆమె కవితలు. సమాజ పోకడలు, అందులోని అసమానతల గురించి ఆ కవితలు సందేశమిస్తాయి. హెచ్చరిస్తాయి కూడా. ప్రస్తుతం మనుషుల తిరోగమన స్థితిపై ఆ కవితలు కొన్నిచోట్ల ఆక్రోశిస్తాయి. సిరి లాభాల కలం నుండి జాలువారిన ‘సిరివెనె్నల స్వరం’ కవితా సంపుటిలోని కవితలు నేటి సమాజానికి అద్దం పడతాయి.

Pages