S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

06/05/2016 - 08:10

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.

05/30/2016 - 00:24

పెళ్లి ముహూర్తం అర్ధరాత్రికి. ఉదయం తోరు సంబరం కార్యక్రమం జరుగుతోంది. అటు ఆడపెళ్లివారి తరఫున, ఇటు మగపెళ్లి వారి తరఫునా రావలసిన బంధువులంతా వచ్చేశారు. బ్యాండుమేళం కాసేపు మంచి సినిమా పాటలు వాయించి వినిపించారు. పెళ్లి కూతురి పేరు శే్వత. పెళ్లికొడుకు పేరు సూర్యప్రతాప్.

05/22/2016 - 22:57

‘కొడుకు బలవంతపు చావుకి తనే కారణం. తనలో సహనగుణం ఉంటే ఇంత అనర్థం జరగకపోను. తన కోపమే తన శత్రువు. తొందరపాటు, అసహనం ఇవన్నీ చేతికి అంది వచ్చిన కొడుకుని నిష్కారణంగా దూరం చేశాయి’ కానిస్టేబుల్ శంకరం బాధగా అనుకున్నాడు.

05/15/2016 - 05:53

‘‘డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా?’’ అడిగాడు రఘురాం.
‘‘వచ్చాయి. అదీ...’’ నసిగాడు.
‘‘్ఫర్వాలేదు చెప్పండి! విని తట్టుకోగల శక్తి నాకుంది’’ అన్నాడు రఘురాం.
‘‘మీ వెన్నుముక దెబ్బతింది. మీరు వైవాహిక జీవితానికి పనికిరారు’’ చెప్పాడు డాక్టర్.
రఘురాంకి మిన్ను విరిగి మీద పడినట్లు అయింది. అయినా తమాయించుకుని ‘‘బై డాక్టర్’’ అంటూ బయటికి వచ్చేసేడు.

05/08/2016 - 06:08

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.

05/01/2016 - 04:45

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.

04/24/2016 - 06:54

‘‘నిలువునా చీలిపోయినా ఆ కుటుంబం మళ్లీ కలుస్తుందనే నమ్మకం పోయింది. అయినా మీసాల రాయుడు ఉన్నప్పుడు మన ఊరిలో వాళ్లదే పెద్ద కుటుంబం. జమీందారీ దర్జా వెలగబెట్టిన రాయుడు పోయిన తరువాత ఈ పిల్లకాయలు పంతాలకు, పట్టింపులకు పోయి కుటుంబం గుట్టు రట్టు చేసుకుంటూ రచ్చకెక్కారు.

04/18/2016 - 08:03

ఇస్ర్తి చొక్కా డబ్బూ దస్కం
డాబూ దర్పం మందీ మార్బలం
ఎనె్నన్నో ఉన్నా స్వార్ధం తలపై
కూర్చున్న వాడికి డబ్బే సర్వస్వం
ధర్మానికి జడవక తెగ దోచుకు తింటూ
తాగి జోగే వాడికి నిరుపేదల బాధ వేదన రోదన
వినబడని పాట ఎవరికీ ఎన్నడూ సహాయ మందించక
సమాజ వృక్షాన్నుండి తెగిపడ్డ కొమ్మావాడు
చిగురించడు అతకడు చేతుల్లోని కుర్చీలో

04/18/2016 - 07:59

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలో మాదొక చిన్న పల్లెటూరు. ఇది ఒక మారుమూల గ్రామం. సరైన కాలంలో వర్షాలు పడకపోవడం వల్ల కరవు కాటకాలు వచ్చాయి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. సాగు చేయడానికి పొలం ఉన్నా నీరు లేకపోవడంతో భూములు ఎండిపోయాయి. తాగడానికి నీరు లేక ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నారు.

04/18/2016 - 07:56

శరీర బరువు మోతకన్నా కష్టాలు కన్నీళ్లు, అపవాదులు, వ్యసనాలు మున్నగువాటిని మోసే మోతే ఎక్కువంటున్న కవి ఇంకా ఇలా అంటున్నాడు. ఎందరో శత్రువులు నాలోనే దాక్కున్నారు. నాలోనే ప్రపంచ యుద్ధాలున్నాయి. వీటన్నింటినీ నిత్యం మోస్తున్నా అన్నీ మోసిన వానికి ఈ మోత ఓలెక్కా? ప్రపంచ మోతలన్నింటీనీ నేనే మోస్తున్నా, నాకు నేనే ప్రళయాన్ని సృస్టించుకుంటాను.

Pages