S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2018 - 04:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మహాత్మా గాంధీ సూక్తుల్లోని సారాన్ని వివరించే ఉర్దూ కవితలపై ‘ముషాయరా’ పేరిట దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని (కవి సమ్మేళనాలను) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం నాడిక్కడ తెలిపింది.

09/24/2018 - 04:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రక్షణ, భద్రతపరమైన అంశాలపై మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఈజిప్టు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలోను కలిసికట్టుగా పనిచేయాలని, అదే విధంగా సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాలని సంకల్పించినట్లు అధికార వర్గాలు ఆదివారం నాడిక్కడ వెల్లడించాయి.

09/24/2018 - 04:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి మేనేజర్లకు 24 మార్గదర్శకాలతో ఒక ప్రణాళికను బీజేపీ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రతి బూత్ మేనేజర్ తన పరిధిలో ఆరెస్సెస్ కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే తమ పరిధిలో మఠాలు, పీఠాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, అందులోని ప్రధాన వ్యక్తులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని బీజేపీ ఆదేశించింది.

09/24/2018 - 04:16

రాంచి, సెప్టెంబర్ 23: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్ కోట్లాది మంది భారత ప్రజలకు ఆశాదీపం అని, ఈ పథకాన్ని చాలామంది ‘మోదీ కేర్’ అని మరో విధంగానూ పిలుస్తున్నారని, కాని తాను మాత్రం పేదలకు సేవచేసే గొప్ప అవకాశంగా దీనిని భావిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

09/24/2018 - 02:35

ఢిల్లీ, సెప్టెంబర్ 23: గోవా ముఖ్యమంత్రిగా మరోహర్ పారికర్‌ను తొలగించే ప్రసక్తే లేదని, ఆయన ఆ పదవిలో కొనసాగుతారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. అయితే, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గోవాకు చెందిన పార్టీ కీలక బృందంతో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు.

09/24/2018 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో ఆత్మహత్యల నివారణకు జాతీయస్థాయిలో ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారత్‌కు చెందిన వారివేనని వెల్లడిస్తున్న నిజాలు ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళల బాధలు తెలుసుకోవడానికి, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక విధానం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

09/24/2018 - 02:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ రష్యాతో కలిసి ప్రతిష్టాత్మక ఇస్రో ఆధ్వర్యంలో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టే ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు. మానవ సహిత అంతరిక్ష ఉపగ్రహ యాత్ర గగన్‌యాన్‌ను నిర్వహించాలని భారత్ ప్రణాళికను రూపొందించింది. రష్యాతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది.

09/24/2018 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరామ్‌లలో ఎన్నికల జాబితా, ఈవీఎంలు తదితర కార్యక్రమాలలో క్రమబద్ధీకరణమైన ఆడిట్ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నిర్ణయించింది.

09/24/2018 - 02:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రాజస్థాన్‌లోని బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠాలు పెరిగిపోయాయని, అమిత్‌షా నేతృత్వంలో ఒక గ్రూపు, ముఖ్యమంత్రి వసుంధరరాజే ఆధ్వర్యంలో మరో గ్రూప్ పనిచేయడమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్‌పైలట్ విమర్శించారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని, అందులో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

09/24/2018 - 01:34

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ‘సోషల్ ఇంజనీరింగ్’ చేయాలనుకుంటోంది.

Pages