S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2018 - 01:36

బాలాసోర్ (ఒడిశా): భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయింది. ఆదివారం రాత్రి ఒడిశా తీరం నుంచి ఇంటర్‌సెప్టర్ మిసైల్ ప్రయోగ పరీక్ష విజయవంతమయింది. రెండు అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో దేశం కీలక మైలురాయిని అధిగమించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ఇంటర్‌సెప్టర్‌ను ప్రయోగించారు. భూవాతావరణానికి ఆవల 50 కి.మీ.

09/23/2018 - 04:46

తాలిచేర్ (ఒడిశా): ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఇక్కడ రూ.13 వేల కోట్లతో తాలిచేర్ ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వచ్చే 36 నెలల్లో ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

09/23/2018 - 04:25

జంజ్గీర్ (చత్తీస్‌గఢ్), సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ప్రేమలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉన్నా రైతాంగ సంక్షేమానికి ఏమీ చేయలేకపోయారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. సుపరిపాలన, సుస్థిరపాలన అందించే పార్టీని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ హయాంలో చత్తీస్‌గఢ్ శీఘ్రంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.

09/23/2018 - 02:01

అమ్రేలీ, సెప్టెంబర్ 22: ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేయొద్దని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇష్టానుసారం మాట్లాడడం సరైందికాదని రాజ్‌నాథ్ అన్నారు.

09/23/2018 - 02:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల వివాదం కొత్తమలుపుతిరుగుతోంది. కోట్లాది రూపాయలు విలువ చేసే రాఫెల్ జెట్స్‌కు సంబంధించి భారత్ పారిశ్రామిక భాగస్వాముల ఎంపికలో తమ ప్రమేయం ఉండదని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసిందని.

09/23/2018 - 01:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల ఒప్పందంలో ఫ్రాన్స్‌కు చెందిన దాసల్ట్ ఏవియేషన్, భారత్‌లోని రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడానికి సంబంధించి కేంద్రప్రభుత్వం పాత్ర లేదని రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ విషయమై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ ప్రకటన వివాదస్పదం కావడంతో రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

09/23/2018 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రఖ్యాత కవి, జానపద సాహితీవేత్త, పరిశోధకుడు ఏకే రామానుజన్ రచనలెన్నో ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో ఆయన మరికొన్ని రచనలను వెలుగులోకి తెచ్చే సరికొత్త పుస్తకం వచ్చే యేడాది ఆవిష్కృతం కానుంది. ‘జర్నీస్’ పేరిట విడుదల కానున్న ఈ పుస్తకాన్ని రామానుజన్ కుమారుడు కృష్ట రామానుజన్, గిల్లెర్మో రోడ్రిగ్జ్ సంయుక్తంగా రచిస్తున్నారు.

09/23/2018 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ఈ రంగాన్ని ఎలా సంఘటితం చేయాలన్న ఆలోచన తనను వేధిస్తోందని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ‘జర్నలిస్టులపై దాడులకు ప్రతిఘటన’ అనే అంశంపై శనివారం నాడిక్కడ జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

09/23/2018 - 01:50

జైపూర్, సెప్టెంబర్ 22: బంగ్లాదేశ్ నుంచి మనదేశానికి వలస వచ్చిన వారు చెదపురుగుల్లాంటి వారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

09/23/2018 - 01:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశ వ్యాప్తంగా ఒకే సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పరివ్యాప్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఒకే సిద్ధాంతం ప్రాతిపదికగా భారత దేశాన్ని ముందకు నడిపించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

Pages