S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/05/2018 - 12:52

చెన్నై: గుట్కా కుంభకోణానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. కోట్ల రూపాయల విలువైన గుట్కా కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయ్ భాస్కర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు టీకే రాజేంద్రన్ సహా మరికొందరి ఇళ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

09/05/2018 - 12:52

జమ్మూకాశ్మీర్: సవతి తల్లి అసూయకు అమాయకురాలైన ఆ చిన్నారి బలైంది. జమ్మూకాశ్మీర్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి అనంతరం పాశవిక హత్య పోలీసులను నివ్వెరపరిచేలా చేసింది. బారాముల్లా జిల్లా యూరీ అటవీ ప్రాంతంలో ఓ బాలిక మృతదేహం కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ బాలిక మృతిపై దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఈ బాలిక తండ్రికి రెండవ భార్య కుమార్తె.

09/05/2018 - 03:23

అహ్మదాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడిని మరింత అధికం చేసింది. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీ, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు.

09/05/2018 - 02:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రధాని నరేంద్రమోదీ వెంట విదేశీ పర్యటనల్లో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల వివరాలను వెల్లడించాలని సమాచార హక్కు కమినర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని ఆదేశించించారు. 2015-16 నుంచి 2016-17 మధ్య ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను అందించాలని కోరుతూ కరాబీ దాస్ అనే వ్యక్తి కేంద్ర మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. గత అక్టోబర్‌లో ఆయన ఈ దరఖాస్తు చేశారు.

09/05/2018 - 02:24

గంగానది ఉద్ధృత ప్రవాహం యూపీని అతలాకుతలం చేస్తోంది. వరద పోటు లాంటి పరిస్థితులు అన్నిచోట్లా తలెత్తుతున్నాయ. అలహాబాద్‌లో సురక్షిత ప్రాంతానికి తమ వస్తువులను తరలిస్తున్న ఓ కుటుంబం.

09/05/2018 - 02:21

లక్నో, సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కాలంలో జరుగుతున్న వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడంతో ఆయా పరీక్షలకు వేలాది రూపాయలు వెచ్చించి సిద్ధమై, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు గల్లంతవుతున్నాయి.

09/05/2018 - 02:20

రాంచి/పాట్నా, సెప్టెంబర్ 4: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలియనివారుండరు. వివిధ అవినీతి కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ రాంచిలో అనారోగ్యంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైనె్సస్ (రిమ్స్) చేరారు. లాలూజీ ఉన్న ఆసుపత్రి వార్డులోకి వీధి కుక్కలువచ్చేస్తున్నాయి. దోమలబెడద పెరిగింది. పరిశుభ్రత అధ్వాన్నం.

09/05/2018 - 02:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఆర్మీ జవాన్లకు స్మార్ట్ ఫోన్ల వినియోగించడానికి అనుమతి ఇస్తే బాగుంటుందని, సామాజికమాధ్యమాలను మానసిక యుద్ధతంత్రం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని, చొరబాటుదాలు, టెర్రరిజంపై రాజీలేని పోరు చేసేందుకు వీలవుతుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని పునర్మిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని స్థాయిలో సామాజిక మాధ్యమాలతో అనుసంధానం అవసరమని ఆయన చెప్పారు.

09/05/2018 - 01:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయ వృత్తి అత్యుత్తమైనదని, కేవలం ఉద్యోగ వయోపరిమితి కాలంతో వారి బాధ్యత ముగిసిపోదని, వారి జీవితాంతం వారు ఉపాధ్యాయులుగా బాధ్యత వహిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతో ఆయన మంగళవారం నాడిక్కడ ఇష్టాగోష్టి జరిపారు.

09/05/2018 - 04:38

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెలాఖరుకు రాష్ట్ర శాసనసభను రద్దు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతో జరిపే సూచనలు కనిపించటం లేదు. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు దాదాపు మూడు నెలల క్రితమే ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నాయి.

Pages