S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/05/2018 - 01:14

జైపూర్, సెప్టెంబర్ 4: ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్‌కు చెందిన మిగ్-27 విమానం మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. రాజస్థాన్ జోథ్‌పూర్‌లోని బనద్‌లో కూలిన ఈ యుద్ధవిమానం నుంచి పైలట్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

09/05/2018 - 01:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రేయింబవళ్లూ దేశ భద్రత కోసం పాటుపడుతున్న సాయుద దళాల బలోపేతానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటా, బయట ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను కేంద్రం సమకూర్చుతోంది. దీనిలో భాగంగా 36,000 అత్యాధునిక ఏకే సిరీస్ అసాల్ట్స్ రైఫిల్స్ కేంద్ర బలగాలు, ఎంపిక చేసిన రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగాలకు అందించారు.

09/05/2018 - 04:37

న్యూఢిల్లీ: ఎగువ సభ గౌరవాన్ని పునరుద్ధరించడమే తన ముందున్న ప్రథమ ప్రాధాన్యత అని, తప్పుచేసిన సభ్యులపై చర్యల విషయంలో నియమాలను మార్చాల్సిన అవసరం ఉందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా సంవత్సర కాలాన్ని గతనెలలో పూర్తి చేసిన సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో పలు సంస్కరణలు చేపట్టాల్సి ఉందని అన్నారు.

09/05/2018 - 01:05

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్టుల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నా నిర్వహించింది. మంగళవారం పార్లమెంట్ వీధిలో ‘జర్నలిస్టులను కాపాడండి’ అనే నినాదంలో తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.

09/05/2018 - 00:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును కేంద్రానికి సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రానికి లేఖ పంపారు. అక్టోబర్ 3న రంజన్ గగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు.

09/05/2018 - 00:23

కోల్‌కతా, సెప్టెంబర్ 4: దక్షిణ కోల్‌కతాలో ఒక పురాతన వంతెన మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ కోల్‌కతాలో మజేర్‌హట్ రైల్వేస్టేషన్ నుంచి బెహలా సిటీ సెంటర్ ప్రాంతాలను కలిపే ఏరియాలోని ఆలిపోర్‌లో

09/04/2018 - 18:05

కోల్‌కతా: నగరంలోని ప్రముఖ మ‌జ‌ర్‌హాట్‌ బ్రిడ్జి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు భావిస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బ్రిడ్జి కూలిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా.. ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

09/04/2018 - 17:55

న్యూఢిల్లీ: రాబోయే 15 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వంద విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 4.2 లక్షల కోట్లతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.

09/04/2018 - 13:51

న్యూఢిల్లీ : దేశంలో గత మూడు నెలల్లో సంభవించిన వరద విపత్తుల్లో 1400 మంది మరణించారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆగస్టు 8 నుంచి 28వతేదీ వరకు కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల 488 మంది మరణించారు. సహాయ శిబిరాల్లో పదిలక్షల మంది బాధితులకు ఆశ్రయం కల్పించగా 19,500 కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని తేలింది.

09/04/2018 - 13:32

కేరళ: మలయాళ నటులుపై కేరళ మంత్రి ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. కోట్లలో పారితోషకాలు తీసుకుంటున్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ నటీ నటులే అధికంగా కేరళ వరద బాధితులకు సాయం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారని సురేంద్రన్ అభిప్రాయపడ్డారు.

Pages