S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/01/2017 - 00:40

కేంద్రపర (ఒడిశా), ఏప్రిల్ 30: ఏడేళ్ల క్రితం దూరమైన తమ కుమార్తెను తిరిగి కలవడానికి ఆ దంపతులకు ఏడేళ్లు పట్టింది. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన శ్యామ్ ఖౌదియా, ముని ఖౌదియా దంపతులు ఏడేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమార్తె పూజ ఖౌదియాను ఎట్టకేలకు శనివారం దగ్గరికి తీసుకోగలిగారు. 12 ఏళ్ల పూజ 2010లో తల్లిదండ్రులతో కలిసి పూరి వెళ్లినప్పుడు తప్పిపోయింది.

05/01/2017 - 00:39

భోపాల్, ఏప్రిల్ 30: నవ దంపతులను ఆశీర్వదిస్తూ వారికి బహుమతులను ఇవ్వడంలో మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ తన ‘విలక్షణత’ను చాటుకున్నారు. సామూహికంగా వివాహాలు చేసుకున్న దాదాపు 700 మంది నవ వధువులకు ఆయన ‘మోగ్రి’ (చెక్కతో చేసిన బ్యాట్)లను బహూకరించారు.

05/01/2017 - 00:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ‘దేశంలో విఐపిలంటూ ఎవరూ లేరని, అందరూ ఇపిఐలే’నని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివా రం ఉద్ఘాటించారు. కొంతమంది వ్యక్తుల్లో ఉన్న విఐపి సంస్కృతిని పోగొట్టి దాని స్థానంలో ఇపిఐ(ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వ్యక్తే) అనే సంస్కృతిని ప్రవేశపెట్టడమే వాహనాలపై ఎర్రబుగ్గ వాడకాన్ని నిషేధించడం వెనుక ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు.

05/01/2017 - 00:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఓటర్లను ప్రలోభపెట్టినందుకు చార్జిషీట్లు నమోదయిన అభ్యర్థులను అయిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రభుత్వాన్ని కోరనుంది.

04/30/2017 - 22:55

శ్రీనగర్, ఏప్రిల్ 30: కాశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు, అధికార కూటమి భాగస్వాములయిన పిడిపి, బిజెపిల మధ్య విభేదాల నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామ్ మాధవ్ ఆదివారం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు సమావేశమైన తర్వాత బైటికి వచ్చిన రామ్‌మాధవ్ బయట వేచి ఉన్న మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.

05/01/2017 - 03:28

జమ్మూ, ఏప్రిల్ 30: కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతమూ లేదని, ఎందుకంటే స్వాతంత్య్రానికి పూర్వం ప్రజా ఉద్యమంలో భాగంగా ఆ పార్టీని ఏర్పాటు చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అంతేకాదు, ఒకే కుటుంబం ప్రయోజనాలకు పరిమితమైన ఆపార్టీ దేశ ప్రయోజనాల కోసం పని చేయజాలదని కూడా ఆయన అన్నారు.

04/30/2017 - 09:11

పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందాలి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహార్
న్యాయ ప్రక్రియలో టెక్నాలజీ వినియోగం పెరగాలి
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్

04/30/2017 - 09:08

కోయంబత్తూరు, ఏప్రిల్ 29: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సేలం జిల్లా అత్తూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనకరాజు మృతి చెందాడు. అయితే కనకరాజును హత్య చేసి ఉంటారని జయలలిత అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొడనాడ్‌లోని జయలలిత ఎస్టేట్ వాచ్‌మన్‌ను హత్య చేయడానికి కనకరాజు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి.

04/30/2017 - 06:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆత్మపరిశీలనలో పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నికల్లో తమ ఓటమికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనే్ల కారణమంటూ ఆరోపిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ వాదనలో పస లేదని గ్రహించిందో ఏమో తెలియదు కానీ తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

04/30/2017 - 06:07

దురాచారం అంతానికి ముందుకు రండి ముస్లిం మతపెద్దలకు ప్రధాని పిలుపు
మీనుంచే సంస్కరణవాదులు పుట్టుకొస్తారు ఆ నమ్మకం తనకుందన్న నరేంద్ర మోదీ

Pages