S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/03/2018 - 17:30

పాండిచ్చేరి: రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో దాదాపు 41,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకునేటపుడు సహజంగా విస్తత్రమైన చర్చ జరగాలని అన్నారు. కేవలం 36 విమానాలను హెచ్చు ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు.

09/03/2018 - 17:29

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను భద్రతా బలగాలు చేపట్టిన వెంటనే మురాన్ ప్రాంతంలోని ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తు లాఠీ ఛార్జీ చేశాయి. ఈ ఘర్షణలో ఒక యువకుడు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.

09/03/2018 - 13:51

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన తాను శాంతి సందేశాన్ని తీసుకువచ్చానని కాంగ్రెస్ నేత సిద్ధూ అన్నారు. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఉగ్రదాడులు ఎదురైతే నా పర్యటన అనంతరం శాంతి సందేశం తీసుకొచ్చానని వ్యాఖ్యానించారు.

09/03/2018 - 12:35

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మథురలో ఉన్న లార్డ్ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని నిర్వహించారు. అలాగే పలు ప్రాంతాల్లో చిన్నారులను చిన్ని కృష్ణుని వేషధారణలో అలంకరించారు.

09/03/2018 - 16:09

సిధి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. చుర్‌హట్‌లో పర్యటిస్తుండగా ఆయన కాన్వాయ్‌పై ఈ దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

09/03/2018 - 07:06

న్యూఢిల్లీ: తిరుమల వేంకటేశ్వర స్వామికి 16వ శతాబ్దంలో విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ప్రశ్నించింది. వివరాలు సమర్పించాలని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ)ని ఆదేశించింది.

09/03/2018 - 06:41

లక్నో, సెప్టెంబర్ 2: ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా 16 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర వరదల సహాయక కమిషనర్ కార్యాలయం ఆదివారం తెలిపింది. షాజహాన్‌పూర్‌లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఆరుగురు చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

09/03/2018 - 06:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. వాటి ఆసరాగా భర్తలను వేధిస్తున్న మహిళల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఇద్దరు బీజేపీ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పురుష్ ఆయోగ్ పేరిట కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై మద్దతు కూడగట్టేందుకు వారు నడుంబిగించారు.

09/03/2018 - 06:38

కోల్‌కతా, సెప్టెంబర్ 2: ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టిపడేసిన 14 నవజాత శిశువుల అస్తిపంజరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ కోల్‌కతా హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిదేవ్‌పూర్ ప్రాంతంలో గల రాజా రామ్‌మోహన్ రాయ్ సరానీకి చెందిన ఒక ఖాళీ స్థలంలో వెలుగుచూసింది.

09/03/2018 - 06:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మావోయిజం, బలవంతపు మతమార్పిడుల వల్ల దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. పార్టీ సిద్ధాంతాలు, కీలక అంశాలపై దాని అభిప్రాయాలను కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులకు తెలియజేసేందుకు ఉద్దేశించిన ఓ మార్గదర్శక మాన్యువల్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Pages