S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/03/2018 - 06:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు తాను ప్రయత్నిస్తుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు రాసిన ‘మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వార్డ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

09/03/2018 - 05:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: బడ్జెట్‌లో రైతులపట్ల పక్షపాతం చూపించి అధిక ప్రాధాన్యత ఇస్తే తప్ప వ్యవసాయ రంగం బాగుపడదు. పార్లమెంటు సభ్యులు తదితర ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు సమగ్ర ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవలసిన తరుణం ఆసన్నమైంది అని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

09/03/2018 - 21:59

రాయ్‌పూర్, సెప్టెంబర్ 2: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్, స్థానిక ప్రాంతానికి చెందిన ఒక కమాండర్ ఉన్నారు. పోలీసులతో జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరణించిన నక్సలైట్లలో ఒక్కొక్కరి తలపై రూ.5లక్షల వెల ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

09/02/2018 - 05:52

శ్రీనగర్, సెప్టెంబర్ 1: కార్గిల్‌లోని స్వయం ప్రతిపత్తి కలిగిన పర్వత ప్రాంత అభివృద్ధి మండలి ది లడక్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ)కు జరిగిన ఎన్నికల్లో హంగ్ నెలకొంది. ఏ పార్టీకీ మెజారిటీ రాని ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధిక స్థానాలు కైవశం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది.

09/02/2018 - 05:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సీసీ టీవీల ప్రాజెక్టుకు అసెంబ్లీ ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి బాధ్యత వహించబోదని కమిటీకి సారధ్యం వహిస్తున్న అదనపుచీఫ్ సెక్రటరీ (హోం) మనోజ్ పరిదా పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రక్రియ కొనసాగుతుందని శనివారం నాడిక్కడ ఫీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన తెలిపారు.

09/02/2018 - 04:50

* మళ్లీ మోదీనే ప్రధాని * యూపీలో అన్ని సీట్లు గెలుస్తాం
* యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ దాస్

09/02/2018 - 05:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: న్యాయ వ్యవస్థలోని విభాగాల్లో వౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు నిధుల లేమి పేరుతో ఉదాసీన వైఖరిని అవలంభిస్తే న్యాయపరిపాలనలో ప్రతిష్టంభన నెలకొంటుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు.

09/01/2018 - 17:43

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ఆరంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాంచనంగా ఈ సేవలను ప్రారంభించారు. దేశం మొత్తం మీద 650 బ్రాంచ్‌లతో పాటు 3,250 యాక్సిస్ పాయింట్లలో ఈ సేవలు ఆరంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్ట్ఫాసుల్లో ఈ ఐపీపీబీతో అనుసంధానించనున్నారు.

09/01/2018 - 13:44

లక్నో: వీధుల్లో తిరుగాడే ఆవులు, కోతులు, కుక్కలు, పక్షుల కోసం తొలుత లక్నోలో ఆవాస ఏర్పాట్లు చేసున్నామని, మున్ముందు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో దీనిని అమలు చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. యూపీలోని బ్రిజ్‌భూమిలో రూ. 346.74 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

09/01/2018 - 13:40

విశాఖపట్నం: వామపక్షాల బస్సు యాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వామపక్ష నేతలు నారాయణ, రాఘవులు తదితరులు సభలో పాల్గొని ప్రసంగించారు. తెదేపా, భాజపా, వైకాపా వ్యతిరేకంగా రాజకీయ కూటమి ఏర్పడిందని, వామపక్షాల ఆలోచనలతో జనసేన కలిసి వస్తోందని నేతలు తెలిపారు.

Pages