S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/01/2018 - 06:36

న్యూఢిల్లీ: ఆసియాలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న చైనాను భారత్ అధిగమిస్తోంది. వృద్ధి రేటులో చైనాను అధిగమించి ముందుకు దూసుకెళుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదుకావడమే అందుకు నిదర్శనం. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఈ వృద్ధి నమోదైనట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. తయారీ సంస్థలు, వ్యవసాయ రంగం పుంజుకోవడంతో ఇది సాధ్యమైందని తెలిపింది.

09/01/2018 - 05:43

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలన్న అంశంపై సమాధానం తెలపాలని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్, ప్రతివాదిగా ఉన్న ధనగోపాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో భవనం నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇప్పుడున్న హైకోర్టు విభజించకూడదని ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్ 2015లో తీర్పునిచ్చింది.

08/31/2018 - 17:02

న్యూఢిల్లీ : బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో హక్కుల నేతలకు సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలిసిన తర్వాతనే అరెస్టులు చేశామని మహారాష్ట్ర ఏడీజీ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. ఆ నేతలకు మావోలతో సంబంధాలు కూడా ఉన్నట్లు స్పష్టమైందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలన్న నెపంతో మావోలు అడుగులు వేశారని, మావోలు వేసిన ప్రణాళికలకు.. పౌర హక్కుల నేతలు సహకరించారన్నారు.

08/31/2018 - 14:05

న్యూఢిల్లీ: బ్యాంకుల సెలవులపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సెప్టెంబరుమొదటివారంలో బ్యాంకులు సాధారణ సెలవులు మినహా మిగతా రోజుల్లో యథావిధిగా పనిచేస్తాయనిస్పష్టతనిచ్చింది.

08/31/2018 - 12:23

న్యూఢిల్లీ : ఐఆర్‌సిటిసి భూ కుంభకోణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌ భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వియాదవ్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. తల్లితో సహా తేజస్వి కోర్టుకు హాజరు కాగా, లక్ష రూపాయల పూచికత్తుపై వారికి బెయిల్‌ మంజూరు చేసింది.

08/31/2018 - 05:58

న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని, అలాగే విదేశీ నిధులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆ రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశాయి.

08/31/2018 - 05:49

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు ముగిసిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీకే కుమారస్వామి గురువారం ఇక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. సంకీర్ణప్రభుత్వం బాగా పనిచేస్తోందని, బలంగా ఉందని, మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కుమారస్వామి కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

08/31/2018 - 05:45

ముంబయి, ఆగస్టు 30: గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2020 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ చెప్పారు. ప్రక్షాళన కార్యక్రమం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మొత్తం 221 ప్రాజెక్టు పనులను రూ.22,238 కోట్లతో చేపట్టామన్నారు. నమామి గంగ ప్రాజెక్టు ప్రతిష్టాకరమైనదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. 2020 మార్చి నాటికి గంగా ప్రక్షాళన పూర్తి చేస్తామన్నారు.

08/31/2018 - 05:44

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఒకసారి చేసిన అభివృద్ధి పనులకు మరోసారి నిధులు కేటాయించకుండా నివారించేందుకు దేశంలోని వంద జిల్లాల్లో ఎంపీ ల్యాడ్స్ పథకం కింద జరుగుతున్న పనులను జియోట్యాగింగ్ చేస్తున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి డివి సదానంద తెలిపారు.

08/31/2018 - 05:42

న్యూఢిల్లీ, ఆగస్టు 30: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయరాదని జాతీయ మహిళా సంఘాల వేదిక (ఎన్‌ఏడబ్ల్యువో) పిలుపునిచ్చింది. మహిళల హక్కులను కాలరాచే విధంగా వ్యవహరించే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సంస్థ కోరింది. దాదాపు వంద మహిళా సంఘాలు ఒక వేదికపైకి వచ్చి తమ గొంతును బలంగా వినిపించాయి.

Pages