S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/31/2018 - 02:58

న్యూఢిల్లీ, ఆగస్టు 30: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావుకు కోపం వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడే హన్మన్న ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిమాణాల పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందుకే, పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. విషయం ఏమిటంటే..

08/31/2018 - 04:52

న్యూఢిల్లీ, ఆగస్టు 30: రెండేళ్ల క్రితం దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం నగదు లావాదేవీలు తగ్గి డిజిటల్ చెల్లింపుల శాతం పెరిగిందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ తెలిపారు. 2016లో 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత రిజర్వ్‌బ్యాంకు నిన్ననే తన వార్షిక నివేదికలో దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో 99.3శాతం బ్యాంకులకు చేరుకున్నట్టు తెలియజేసింది.

08/31/2018 - 02:52

న్యూఢిల్లీ,ఆగస్టు 30: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కావటం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ సెప్టెంబర్ 17 నుండి 19 తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోని విజాన్ భవన్‌లో సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ప్రసంగ సమావేశం నిర్వహిస్తోంది.

08/31/2018 - 02:14

న్యూఢిల్లీ,ఆగస్టు 30: స్థానికులు దాదాపుతొంభై ఐదు శాతం ఉద్యోగాలు పొందడానికి వీలు కల్పించే తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు గురువారం రాజపత్రాన్ని జారీ చేయటంతో, మరు క్షణం నుంచే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.

08/31/2018 - 02:11

న్యూఢిల్లీ, ఆగస్టు 30: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహగానాల నేపధ్యంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసారించల్సిన వ్యూహంపై పీసీసీ, హైకమాండ్‌తో చర్చిస్తున్నది. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశపై సుమారు రెండు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరిపారు.

08/30/2018 - 13:35

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం కోర్టులో లొంగిపోయారు. లాలూ పెరోల్ బెయల్‌పై ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. తన ఆరోగ్యం బాగోలేదని, బెయల్‌ను పొడిగించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన పాట్నా కోర్టులో లొంగిపోయారు.

08/30/2018 - 13:32

చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సిట్టింగ్‌ న్యాయమూర్తులు సహా వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్‌ హైకోర్టు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను గురువారం ఆదేశించింది. ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించాలని తెలిపింది.

08/30/2018 - 13:30

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో మహిళ పవర్‌బ్యాంకును తీసి బయటకు విసిరేయడంతో అది అకస్మాత్తుగా పేలింది. దీంతో అక్కడి ప్రయాణికులు భయాందోళలనలకు గురయ్యారు. డిఫెన్స్‌ కాలనీకి చెందిన మాళవిక తివారీ పవర్‌బ్యాంకు అది.

08/30/2018 - 13:29

శ్రీనగర్‌: అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ షకీల్‌ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. 2011 ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి షకీల్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని రాంబాగ్‌ ప్రాంతంలో షకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

08/30/2018 - 12:32

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేవారు. ఈమేరకు ఆయన ఆర్థిక మంత్రికి సూచన చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జైట్లీకి ధన్యవాదాలు తెలిపారు.

Pages