S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/23/2016 - 02:15

న్యూఢిల్లీ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దు వంటి విధాన నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో కాకుండా వెలుపల ప్రకటించవచ్చా అన్నదానిపై సిపిఎం పార్టీ న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. పార్లమెంటులో కాకుండా సభ వెలుపల ఇలాంటి ప్రకటన చేయడాన్ని పార్టీ తప్పుపడుతోంది. ‘సభ వెలుపల విధాన నిర్ణయం ప్రకటిస్తే దానిపై తరువాత ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాల్సి ఉంటుంది.

11/23/2016 - 02:15

న్యూఢిల్లీ/కాన్పూర్, నవంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద ఇండోర్- పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రైలుకు అదనపు బోగీని జోడించడమే ప్రమాదానికి కారణమైందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా ఈ రైలు 22 బోగీలతో నడుస్తుంది.

11/23/2016 - 02:14

న్యూఢిల్లీ, నవంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదో రోజు మంగళవారం కూడా ఉభయ సభలు సాగలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యలపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. బహిరంగ సభలు, ఎన్నికల సభల్లో పెద్దనోట్ల రద్దు గురించి ఉపన్యాసాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరు కాలేరా? అంటూ రాజ్యసభలో విపక్షాలు నిలదీశాయి.

11/23/2016 - 01:55

న్యూఢిల్లీ, నవంబర్ 22: జమ్ము కాశ్మీర్‌లోని మచ్చాల్ ప్రాంతంలో ముగ్గురు సైనికులను చంపి ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికి పాకిస్తాన్ ముష్కరులు తమ పైశాచికత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘాతుకంపై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ సైన్యానికి గట్టి గుణపాఠం నేర్పించేందుకు సిద్ధమవుతోంది.

11/23/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబరు 22: ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా కాపాడలేరా? వాటిని కాపాడాల్సిన బాధ్యత సర్కారుది కాదా? విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరు? అంటూ సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిలదీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వౌలిక సదుపాయాల లేమిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది.

11/23/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబర్ 22: ‘నల్లధనం, అవినీతిపై మనం మొదలుపెట్టిన యుద్ధం ఇప్పట్లో ఆగదు. పెద్ద నోట్ల రద్దు మహాయజ్ఞానికి ఆరంభం మాత్రమే. ముందు ముందు మరిన్ని కఠిన చర్యలున్నాయి. ఇదంతా దేశ ప్రయోజనాల కోసమేనన్న విషయాన్ని మరువకూడదు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంగా చెప్పారు.

11/23/2016 - 02:06

చెన్నై, నవంబర్ 22: నాదమహర్షి మహతి మూగబోయింది. తేనెలొలికే గాత్రమాధుర్యాన్ని ఎనిమిది దశాబ్దాల పాటు విశ్వమంతా ఒలికించిన మురళీగానం ఆగిపోయింది. సప్తస్వరాలు స్తబ్దమైపోయాయి. తిల్లానాకు ఊపిరినిచ్చిన ప్రాణవాయువు నిలిచిపోయింది. తన స్వరంతో వినూతనమైన రాగమాధుర్యాన్ని పొందిన 72మేళకర్తలూ తమ నేస్తాన్ని కోల్పోయాయి. ఈ శతాబ్ది వాగ్గేయకారుడు తన పని ముగించుకుని వెళ్లిపోయాడు.

11/22/2016 - 05:42

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కలల ప్రాజెక్టు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే సోమవారం ప్రారంభమయింది. భారత వాయుసేన (ఐఎఎఫ్) యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ హైవేను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినమైన నవంబర్ 21న ప్రారంభించడం విశేషం.

11/22/2016 - 05:40

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్వాయికి అభినందనలు తెలియజేస్తున్న
ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, వైకాపా ఎంపిలు వై.వి సుబ్బారెడ్డి, మేకపాటి, కాంగ్రెస్ ఎంపిలు కెవిపి, సుబ్బిరామిరెడ్డి

11/22/2016 - 05:14

న్యూఢిల్లీ,నవంబరు 21: పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఏదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. సోమవారం నాడు కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, ఆస్ట్రేలియా రాయబారితో విడివిడిగా సమావేశమయ్యారు.

Pages