S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/28/2018 - 22:32

ముంబయి, ఆగస్టు 28: తాజా పాల కేటగిరి విభాగంలో ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్‌లో పది శాతం మార్కెట్‌ను పంచుకోవాలని లక్ష్యంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ నిర్ణయించుకుంది. తాజా పాలను మంగళవారం మార్కెట్‌లో విడుదల చేసిన కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గోవర్థన్ బ్రాండ్ పేరుతో తాజా పాలను మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.

08/29/2018 - 06:10

న్యూఢిల్లీ, ఆగస్టు 28: అంతరిక్షంలోకి మానవ సహిత రోదసీ నౌకను పంపేందుకు వీలుగా అత్యంత క్లిష్టమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) 2004లోనే అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని ఇస్రో చీఫ్ కె.శివన్ తెలిపారు. అయితే, ఈ ప్రాజెక్టు ఇపుడు తమ ప్రాధాన్యత జాబితాలో లేదని ఆయన పేర్కొన్నారు.

08/28/2018 - 22:29

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇటీవల నూతనంగా ఎంపిక చేసిన మూడు రాష్ట్రాల గవర్నర్లు మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి వౌర్య, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్ ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. కాగా, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సోమవారమే ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. మాలిక్ ఇంతకుముందు బిహార్‌కు ముఖ్యమంత్రిగా ఉండేవారు.

08/28/2018 - 22:28

కోల్‌కతా, ఆగస్టు 28: హత్యా రాజకీయాలు బీజేపీ నైజమని, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు కేంద్ర సంస్థలను వినియోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ, గతంలో సీపీఎం పార్టీ తరఫున పనిచేసిన ముఠాలు ఇప్పుడు బీజేపీ పంచన చేరాయని అన్నారు.

08/28/2018 - 17:40

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

08/28/2018 - 17:37

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. చెంగనూరు వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. చాలకుడిలో వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్‌కు ఎంపీ శశిథరూర్ తిరువనంతపురం విమానాశ్రయంలో స్వాగతం లభించింది. వరద బాధితులను సహాయక శిబిరాలను తరలించిన మత్స్యకారులను సన్మానించారు.

08/28/2018 - 17:28

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో మూతపడిన కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పునరుద్ధరించారు. రేపటి నుంచి అంతర్జాతీయ, దేశవాళీ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయ. షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభించాలని యాజమాన్యం కోరింది.

08/28/2018 - 13:42

న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగం ఇక చట్టబద్ధం కానున్నది. దీనికి సంబంధించిన విధివిధానాలు డిసెంబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయ. నిబంధనల ప్రకారం పౌర డ్రోన్‌ కార్యకలాపాలను ఉదయం పూట వెలుతురు ఉన్న సమయంలోనే నిర్వహించాలి. ఆకాశంలో 450 మీటర్ల ఎత్తులోపే అవి ఎగరాలి.

08/28/2018 - 12:05

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్నది. పాలెం, దౌలా ఖానా, తీన్ మూర్తి భవన్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న వీధులన్నీ జలమయం అయ్యాయి.

08/28/2018 - 11:53

చెన్నైః డిఎంకె అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు ఇక్కడ సమావేశమైన డిఎంకె కార్యవర్గ సమావేశం స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ కోశాధికారిగా దురై మురుగన్‌ ఎన్నికయ్యారు. 50 ఏళ్ల తరువాత డిఎంకె అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. 70 ఏళ్ల డిఎంకె చరిత్రలో మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఎన్నికయ్యారు.

Pages