S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/28/2018 - 05:31

లక్నో: శాంతి భద్రతల పరిరక్షణలో ఉత్తర ప్రదేశ్ మేటిగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో అడపాదడపా జరిగే హింసాత్మక సంఘటనలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూపెడుతుండడంపై ఆయన ధ్వజమెత్తారు. 15 ఏళ్లతో పోల్చుకుంటే ఇపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతో బేషుగ్గా ఉందని, ఈ విషయాన్ని ఇక్కడే కాకుండా దేశం మొత్తం కూడా అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

08/28/2018 - 05:02

ద హేగ్, ఆగస్టు 27: తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. 2015 సంవత్సరంలో ఎత్తివేసిన అణు ఆర్థిక ఆంక్షలు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించారని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది.

08/28/2018 - 03:00

న్యూఢిల్లీ, ఆగస్టు 27: పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. అయితే మొదట చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటులో పాస్ చేయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు.

08/28/2018 - 02:59

న్యూఢిల్లీ, ఆగస్టు 27: తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించటం గురించి తమతో సంప్రదించలేదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం లేదా మరెవరైనా శాసనసభను రద్దు చేసి తమ వద్దకు వస్తే ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతామని వారు స్పష్టం చేస్తున్నారు.

08/28/2018 - 05:04

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), లేదా బ్యాలెట్ పేపర్ల విధానంలో నిర్వహించాలన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు.

08/28/2018 - 05:08

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956) ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. చంద్రశేఖరరావు ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఒక వినతిపత్రం అందజేశారు.

08/28/2018 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 27: మన మధ్య నెలకొన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి గట్టి రాజకీయ సంకల్పం, పరిపాలనా సామర్థ్యం చాలా అవసరమని, వాటి నిర్మూలనకు చట్టాలను ప్రయోగిస్తే ఇవి రెట్టింపు అవుతాయి తప్ప పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని భారత ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒక కొత్త చట్టాన్ని అమలు చేయడం ద్వారా ఒక నేరాన్ని ఆపడం కాని, వ్యవస్థలో మార్పు తేవడం కాని వీలుకాదని చెప్పారు.

08/28/2018 - 01:45

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఆర్‌ఎస్‌ఎస్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వచ్చేనెలలో జరిగే సంఘ్ సమ్మేళన్‌కు పిలిచి హితబోధ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాహుల్‌తోపాటు సీపీఎం నేత సీతారాం ఏచూరిని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

08/28/2018 - 01:44

పానాజి, ఆగస్టు 27: రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో వేల కోట్ల కుంభకోణం ఉందని తాము చేసిన ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వౌనం వహిస్తోందని, తమ ఆరోపణలకు సమాధానం చెప్పడంలో తాత్సారం చేస్తోందని, బీజేపీ వౌనం వెనుక కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.

08/27/2018 - 17:44

ముంబయ: ముంబయ నగరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజ్ పాలెస్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఆయన అమరావతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలని తాము విజన్ రూపొందించుకున్నట్లు వెల్లడించారు.

Pages