S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/27/2018 - 13:33

మేఘాలయ: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో దక్షిణ టురా అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉపఎన్నికలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కాన్‌రాడ్‌ సంగ్మా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి మోమిన్‌పై 8,400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

08/27/2018 - 13:15

న్యూఢిల్లీ: ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు ఐదు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేరళతో పాటు అసోం, పశ్చిమబెంగాల్, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వరదల వల్ల దాదాపు 1074మంది ప్రాణాలు కోల్పోగా, 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దాదాపు 70 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు.

08/27/2018 - 13:12

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీని మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. నెహ్రూ ప్రతిష్ఠకు భంగం కల్గించొద్దంటూ లేఖలో కోరారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు.. ఈ దేశానికి ప్రధాని. ఈ మెమోరియల్‌ భారత తొలి ప్రధానికి గుర్తు.

08/27/2018 - 12:57

న్యూఢిల్లీ: వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఈ సమావేశానికి ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషన్ సేకరించనున్నది.

08/27/2018 - 05:09

న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో దోషులను ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఆకాశవాణి ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ అత్యాచారాల నిరోధానికి ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన చట్టం సత్ఫలితాలను ఇస్తున్నదని అన్నారు. ఆ చట్టానికి ఆమోద ముద్ర పడిన తర్వాత, అత్యాచార కేసులు తగ్గుతున్నట్టు తెలిపారు.

08/27/2018 - 02:07

ముంబయి, ఆగస్టు 26 : దేశంలో సుప్రిసిద్ధమైన ఆర్‌కే సినీ స్టూడియాను విక్రయించాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. ఈ స్టూడియోను 70 ఏళ్ల క్రితం నిర్మించారు. గత ఏడాది అగ్ని ప్రమాదం వల్ల ఈ స్టూడియో దగ్ధమైంది. దీనిని పునర్నిర్మించడం సాధ్యం కాదని కపూర్ కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ఈ స్టూడియోను బాలీవుడ్ దిగ్గజం కీర్తిశేషులు రాజ్‌కపూర్ 1948లో ఇక్కడ చెంబూర్‌లో నిర్మించారు.

08/27/2018 - 02:04

న్యూఢిల్లీ, ఆగస్టు 26: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ ప్రమేయం లేదని ఆ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. ఆయన ప్రకటనను రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు సంచలనం చేయకుండా అల్లర్ల అనంతరం కాంగ్రెస్ తీసుకున్న చర్యలు, వైఖరిని స్పష్టం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.

08/27/2018 - 02:04

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత్‌లో జరిగే ఎన్నికల ప్రక్రియలో సామాజిక మాధ్యమాల జోక్యాన్ని సహించమని ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో సామాజిక మాధ్యమాల ద్వారా డాటా దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

08/27/2018 - 02:03

ఉస్మానాబాద్ (మహారాష్ట్ర), ఆగస్టు 26: కలలోనైనా ఊహించని ముప్పు వేలాదిమందిని బలితీసుకుంది. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. రెండు జిల్లాల్లోని 52 గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు, ఆస్తులు ఎన్నింటినో కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ మహా విషాదం కొనే్నళ్లపాటు వారిని వెంటాడింది. ఈ విషాద ఘటన జరిగిన 25 ఏళ్లు పూర్తయ్యాయి.

08/27/2018 - 02:10

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి యోచిస్తున్న డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ బిల్లు వ్యక్తిగత గోప్యత, స్వతంత్రతకు తీవ్ర భంగం కలిగిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం పదేపదే చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆక్షేపించారు.

Pages