S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/27/2018 - 02:09

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే.స్టాలిన్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి అన్నా అవివాలయమ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

08/27/2018 - 02:01

శ్రీనగర్, ఆగస్టు 26: జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో యువత అత్యధికంగా ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వడం ఆందోళనకరంగా పరిణమించింది. 2010 తర్వాత ఈ ఒక్క ఏడాదిలోనే అత్యధికంగా 130మంది యువకులు ఉగ్రవాదం వైపు పయనిస్తున్నారన్న గణాంకాలు అందరినీ ఆందోళన పరుస్తున్నాయి. ఆల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థల భావజాలం వైపు వీరు ఆకర్షితులవుతున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి.

08/27/2018 - 01:59

చిత్రాలు...రక్షాబంధన్ సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాఖీ కడుతున్న విద్యార్థులు
*న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాఖీ కడుతున్న
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్

08/27/2018 - 01:56

ప్రధాని మోదీకి రాఖీ కడుతున్న పాకిస్తాన్ జాతీయురాలు కమార్ మోసిన్ షేక్. గత 20 ఏళ్లుగా ఆమె మోదీకి క్రమం తప్పకుండా రాఖీ కట్టడం విశేషం.

08/27/2018 - 01:34

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్ణీత సమయంలోనే తొలి మానవ సహిత స్పేస్ మిషన్ గగన్‌యాన్‌ను పూర్తి చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు కె. విజయ్ రాఘవన్ తెలిపారు. ఇందుకు సంబంధించి కొనే్నళ్ల క్రితమే కాలవ్యవధిని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం యాదృచ్చికంగా వచ్చింది కాదని పేర్కొన్నారు.

08/27/2018 - 01:32

ఓ బస్సు హైవేపై బోల్తాపడిన ఘటనలో సుమారు 15 మంది మృత్యువాత పడగా, 27 మంది గాయపడ్డారు. బల్గేరియా రాజధాని సోఫియా సమీపంలోని స్వోగ్ టౌన్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో పర్యాటకులను ఓ రిసార్టుకు వారాంతపు విడిది కోసం తీసుకువెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ బస్సును అధికంగా టర్న్ చేయడం వల్లే ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగి 20 మీటర్ల దూరం దూసుకెళ్లింది.

08/27/2018 - 01:45

కేరళలో వరద ఉద్ధృతి తగ్గి క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో,
కారద్‌లో ఆదివారం కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు

08/27/2018 - 01:27

రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బిహార్ బారిష్ సురక్షా దివస్ కార్యక్రమంలో రాజధాని వాటికలో ఓ చెట్టుకు రాఖీ కడుతున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్

08/27/2018 - 01:23

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా భద్రతకు సంబంధించి పెట్టిన ఖర్చు వివరాలను వెల్లడించలేమని కేంద్ర సమాచార కమిషన్ పేర్కొంది. సమాచార హక్కు చట్టంలో వ్యక్తిగత సమాచారం, భద్రతకు సంబంధించి క్లాజులకు మినహాయింపు ఉందని సమాచార కమిషన్ తెలిపింది. దీపక్ జునేజా అనే పిటిషనర్ 2014లో ఈ అంశంపై వివరాలు కావాలని సమాచార కమిషన్‌ను కోరారు. అప్పటికి అమిత్‌షా రాజ్యసభ సభ్యులుగా లేరు.

08/27/2018 - 01:22

కోల్‌కతా, ఆగస్టు 26: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీజేపీయేతర పక్షాలు లేదా మతతత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు ఒక వేదికపైకి రావాలని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ పిలుపునిచ్చారు. బీజేపీవ్యతిరేక శక్తులతో వామపక్షపార్టీలు చేతులు కలపాలని ఆయన అన్నారు. ఈ విషయమై వారు వెనకాడరాదన్నారు.

Pages