S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/27/2018 - 00:41

న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ రద్దయిన తరువాత ఆరు నెలల లోగా ఎన్నికలు జరపవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్ చెప్పారు.

08/27/2018 - 00:48

న్యూఢిల్లీ, ఆగస్టు 26: జోనల్ వ్యవస్థకు సంబంధించి సవరించిన రాష్టప్రతి ఉత్తర్వులను వీలున్నంత త్వరగా జారీ చేయిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెనుకబడిన జిల్లాకు ఇవ్వవలసిన నాలుగో విడత సహాయాన్ని త్వరలోనే అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చారు.

08/27/2018 - 00:13

ఆత్మీయత, ఆప్యాయతల మేళవింపుతో దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వెల్లివిరిసింది. భిన్న సంస్కృతుల్ని మేళవిస్తూ నవభారతంలో రాఖీ పౌర్ణమి పరిమళించింది. పిన్నలు పెద్దలు చివరికి దేశాన్ని రక్షించే సైనికులు, దేశాన్ని పాలించే నేతలు సైతం ఈ పర్వదినానందంలో మునిగి తేలారు. రాషప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఇలా రాఖీలు కట్టించుకుని రక్షాబంధాన్ని పెనవేశారు.

08/26/2018 - 03:26

న్యూఢిల్లీ, ఆగస్టు 25: భారత నౌకాదళ అమ్ముల పొదిలో 111 అత్యంత ఆధునిక యుద్ధ హెలికాప్టర్లు చేరనున్నాయి. 111 హెలికాప్టర్లను నావికాదళ విభాగం రూ.21వేల కోట్లతో కొనుగోలు చేసే ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. దీనికి తోడు మరి కొన్ని యుద్ధ పరికరాల కొనుగోలుకు సంబంధించి రూ.25వేల కోట్ల ప్రతిపాదనలనుకేంద్రం ఆమోదించింది.

08/26/2018 - 02:20

కోల్‌కతా, ఆగస్టు 25: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణపరంగా జరపాల్సిన ఒప్పందాల విధానాలను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఆరోపించారు.

08/26/2018 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 25: సాల్మొనెల్లా బాక్టీరియా వేగంగా విస్తరిస్తూ, మానవాళిని భయపెడుతున్నది. ఈ బాక్టీరియా సహజయంగా మనుషులు, జంతువుల చిన్నపేగుల్లో చేరి, పలు సమస్యలకు కారణమవుతుంది. కలుషితాహారం తిన్నా లేక కలుషితమైన నీరు తాగినా ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా పెంపుతు జంతులు, కోళ్ల నుంచి కూడా ఈ బాక్టీరియా సోకవచ్చు.

08/26/2018 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్‌గా సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి అనంతపురంలో బీటెక్ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. 1985లో డీఆర్‌డీవోలో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు.

08/26/2018 - 02:13

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వియత్నాం, కంబోడియా దేశాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వచ్చే సోమవారం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రెండు ఆసియా దేశాలతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలతోబాటు, పరస్పరం వ్యూహాత్మక సహకారానికి ఒప్పందాలు ఏర్పరచుకోవడమే పర్యటన ఉద్దేశ్యమని తెలిసింది. ఈనెల 27, 28 తేదీల్లో సుష్మ వియత్నాంలోనూ, 29, 30 తేదీల్లో కంబోడియాలోనూ పర్యటిస్తారు.

08/26/2018 - 02:12

భువనేశ్వర్, ఆగస్టు 25: గ్రామాల్లో పని చేయాలని యువ వైద్యులకు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అప్పుడే అక్కడి పరిస్థితులపై ఒక అవగాహన వస్తుందని శనివారం ఇక్కడి ఏఐఐఎంఎస్ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించిన వెంకయ్య అన్నారు. 2003లో ఇక్కడ ఏఐఐఎంఎస్‌కు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

08/26/2018 - 02:10

నర్మదా (గుజరాత్), ఆగస్టు 25: భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అతి పెద్ద విగ్రహం వచ్చే అక్టోబర్ 25నాటికల్లా సిద్ధం కానుంది. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు కిలోమీటర్ దూరంలో గల నర్మదా నది వద్ద సాధు బెట్ అనే చిన్న ద్వీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. 1,989 కోట్ల రూపాయల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

Pages