S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2018 - 03:31

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర రక్షణశాఖ, డీఆర్‌డీఓ ఈ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనికి నాగాయలంక ప్రాంతంలో 286 ఎకరాల భూమిని సమీకరించనుంది. భూసేకరణ కోసం ఇప్పటికే 35కోట్లు రూపాయలను విడుదల చేశారు.

08/25/2018 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందస్తుకోసం శాసన సభను రద్దు చేసిన తరువాత మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన టీఆర్‌ఎస్ నేతల్లో నెలకొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు గడువుప్రకారం డిసెంబర్‌లో జరుగుతాయన్న గ్యారంటీ లేదు.

08/25/2018 - 02:55

న్యూఢిల్లీ/లండన్, ఆగస్టు 24: భారత్‌ను బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు విభజిస్తున్నాయని, దేశ సమైక్యతకు, సమగ్రతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. బీజేపీ మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

08/25/2018 - 02:53

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏడాది కాలంలో గణనీయంగా తగ్గిపోయాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, విశే్లషకుడు రుచిన్ శర్మ అభిప్రాయపడ్డారు. గత ఏడాది 99 శాతంగా ఉన్న విజయావకాశాలు ఇప్పుడు 50 శాతానికి పడిపోయినట్టు పేర్కొన్నారు.

08/25/2018 - 02:49

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం తగదని బీజేపీ ఎద్దేవా చేసింది. 1984లో సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని బీజేపీ విమర్శించింది. ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం అనే విధానాన్ని తొలుత ప్రవచించిన సద్గురువు గురునానక్ అంటూ సిక్కులను వెనకేసుకుని వస్తున్నారన్నారు.

08/25/2018 - 02:47

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వరదలతో దారుణంగా దెబ్బతిన్న కేరళకు సహాయ, పునవాస చర్యల నిమిత్తం యూనిసెఫ్‌కు ఆరు లక్షల అమెరికన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్ అందజేయనుంది. వందేళ్ల కాలంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన ఆ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఈ సందర్భంగా పేర్కొంది.

08/25/2018 - 02:46

న్యూఢిల్లీ, ఆగస్టు 24: బీజేపీ మూలపురుషుడు, భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిపై సీనియర్ జర్నలిస్టు, దూరదర్శన్ నిర్మాత బ్రిజేంద్ర రెహి రచించిన ‘అటల్‌జీ నే కహా’ పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేశారు.

08/25/2018 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరితగతిన విచారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో 900 కోర్టుల్లో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు సదుపాయాలూ ఉన్నాయని తెలిపింది.

08/25/2018 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వివిధ రంగాల్లో భారత- ఫ్రాన్స్ దేశాల భాగస్వామ్యం మరింతగా బలపడాల్సిన అవసరం ఉందని మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జీగ్లర్ అన్నారు. ఫ్రాన్కో ఇండియన్ ఎడ్యుకేషన్ ట్రస్టు ద్వారా ఉపకార వేతనాలు పొందిన మొదటి బ్యాచ్ విద్యార్థులనుద్దేశించి ఆయన ఇక్కడ ప్రసంగించారు.

08/25/2018 - 02:04

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేరళలో సంభవించిన వరదల బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడులోని ముల్లపెరియార్ జలాశయం నీటి మట్టాన్ని ఈనెల 31 వరకు 139 అడుగుల వరకు ఉంచాలని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Pages