S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2018 - 02:03

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆకస్మాత్తుగా విజృంభించే ప్రమాదకర వ్యాధుల నివారణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ), ఇతర ఆరోగ్య సంస్థలతో కలిసి చేపట్టిన విస్తృత కార్యక్రమాల వల్ల పది లక్షల మంది రోహింగ్యా శరణార్థులు, వేలాది మంది ఇతరుల జీవితాలను రక్షించినట్టు ‘హూ’ శుక్రవారం తెలియజేసింది.

08/25/2018 - 02:01

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత పేదలకు మరో 1.12 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ పథకం కింద ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తారు. అందులో అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు 37 వేల ఇళ్లను కేటాయిస్తున్నట్టు హౌసింగ్, అర్బన్ మినిస్ట్రీ తెలియజేసింది. సెంట్రల్ శాంక్షన్, మానిటరింగ్ కమిటీ (సిఎస్‌ఎంసి) కమిటీ ఈ మేరకు సమావేశమై వీటిని మంజూరు చేసింది.

08/25/2018 - 02:00

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఎయిర్ ఇండియాలో ఇప్పటి వరకు పనె్నండు లైంగిక వేధింపుల కేసులు ఆ సంస్థ అంతర్గత ఫిర్యాదుల విభాగానికి వచ్చాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులు వివరాలు అందజేశారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో జరిగిన లైంగిక వేధింపుల కేసులపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గురువారం న్యూఢిల్లీలో సమీక్షించారు.

08/25/2018 - 01:57

హైదరాబాద్, ఆగస్టు 24: జంతువుల వధ తగ్గించి, మాంసం వినియోగం కోసం వృక్షజాతుల నుండి, కృత్రిమంగా మాంసం తయారుచేయడం ద్వారా దేశంలో సరికొత్త ఆహార విప్లవానికి బీజం వేసినట్టవుతుందని కేంద్ర శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రోటీన్లను విభిన్నంగా వినియోగించుకోవడంపై శుక్రవారం నాడు ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

08/25/2018 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు ఇంతవరకు ఆర్థిక సాయంపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. ఈ వివరాలను రాయబారి అహ్మద్ అల్బనమ్ తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశాలు ఆర్థిక సాయం ప్రకటిస్తే ఎందుకు తీసుకోరాదని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం విదితమే.

08/25/2018 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 24: తెలంగాణ అసెంబ్లీకి గడువుకు ముందే ఎన్నికలు జరిపించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. సీఎం కేసీఆర్ సలహాదారు రాజీవ్ శర్మ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కేఎం సహానీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లవాసాను కలిశారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలను గడువుకు ముందే జరిపించే అంశంపై ఆయనతో చర్చించారు.

08/25/2018 - 01:19

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వచ్చే లోక్‌కసభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఉద్ఘాటించారు. శుక్రవారం జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ సమావేశంలో ఒక యువకుడు ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాహుల్ ఈ హామీ ఇచ్చారు.

08/25/2018 - 04:47

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఈఏడాది డిసెంబర్ వచ్చే సంవత్సరం మార్చి మధ్యలో ఏప్పుడైనా జరగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో జరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న కథనాలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

08/24/2018 - 04:50

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు కనుక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందకుండా విస్మరిస్తే వారిలో అసంతృప్తి ఏర్పడి తిరుగుబాటుదారులుగా మారతారని, దీనికి ఐసీస్ ఉగ్రవాద సంస్థే ఉదాహరణ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. జర్మనీలోని హంబర్గ్‌లో బ్యూసీరియస్ సమ్మర్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

08/24/2018 - 02:26

జునగద్ (గుజరాత్), ఆగస్టు 23: స్వచ్ఛ్భారత్ అభియాన్ లాంటి కార్యక్రమాలు 70 ఏళ్ల క్రితమే చేపట్టి ఉంటే భారత్ ఇప్పుడు వ్యాధిరహిత దేశంగా ఉండేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.

Pages