S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/20/2018 - 05:52

బెంగళూరు, ఆగస్టు 19: కర్నాటకలో కొడగు ప్రాంతం వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రాంతంలో వరద బాధితులను ఆదుకునేందుకు కర్నాటక ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. రాష్టప్రతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫోన్ చేసి వర్షాల పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

08/20/2018 - 06:25

తిరువనంతపురం, ఆగస్టు 19: ఒకపక్క ముంచెత్తుతున్న వరద, మరో పక్క తామున్న ఇళ్లు ఏ క్షణంలో కూలుతుందో, నీట మునుగుతుందో తెలియని స్థితి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న కేరళ వరద బాధితులు వందలాది మందిని ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు ఎయిర్‌ఫోర్సు, నేవీ, ఇతర అధికారులు. ఎంతో రిస్క్‌తో బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

08/20/2018 - 05:50

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేరళ వరద విధ్వంసం కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించకుండా భవిష్యత్తులో మరిన్ని జల ప్రళయాలు తప్పవని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. కేరళలో రాబోయే విపత్తును సుమారు ఏడేళ్ల క్రితమే మాధవ్ గాడ్గిల్ ఊహించి, స్పష్టమైన ప్రతిపాదనలు చేసినప్పటికీ, అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.

08/19/2018 - 06:50

ముంబాయి/అహ్మదాబాద్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కేరళను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్టుల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

08/19/2018 - 07:08

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చితాభస్మం (అస్థికలు) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పవిత్ర నదుల్లో నిమజ్జనం జరుగనుంది. ఈ కార్యక్రమం హరిద్వార్‌లోని గంగానది నుంచి ఆదివారం ప్రారంభం కానుంది.

08/19/2018 - 06:01

న్యూఢిల్లీ, ఆగస్టు 18: వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కేరళలో బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు యాజమాన్య నిర్వహణ బలగాలు అతి పెద్ద ఆపరేషన్ చేపట్టాయి. నీటి ముంపునకు గురైన ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు తరలిస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన కేరళలో వర్షాలు, వరదలు ప్రారంభమయ్యాయి.

08/19/2018 - 06:00

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కేరళలో భారీ జలవిలయాన్ని సృష్టిస్తూ ఇప్పటి వరకు 194 మందిని బలిగొన్న వర్షబీభత్సంపై దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ ఒకరోజు జీతాన్ని కేరళ భాధితుల సహాయార్థం విరాళంగా అందజేయాలని నిర్ణయించారు.

08/19/2018 - 06:32

* కాలడిలో శంకరాచార్య వర్శిటీ నుంచి 600 మంది విద్యార్థులను కాపాడిన సహాయక బృందాలు

08/19/2018 - 05:37

ఇస్లామాబాద్, ఆగస్టు 18: పాకిస్తాన్‌లో కొత్త శకం ప్రారంభమైందని, కొత్త ప్రభుత్వం దేశ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ‘కప్తాన్’ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ 22వ ప్రధానిగా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పాక్‌ను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

08/19/2018 - 05:35

తిరువనంతపురం, ఆగస్టు 18: ప్రకృతి విలయతాండవంతో దారుణంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ.500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైనంత ఆర్థిక సహాయం అందిస్తామని, రాష్ట్రాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కేరళ ప్రజలకు కేంద్రం అండగా నిలబడుతుందని మోదీ ప్రకటించారు.

Pages