S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/15/2018 - 16:50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా 10కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని అన్నారు.

08/15/2018 - 16:46

ఔరా: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు పూజారులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పూజారులు మృతిచెందారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. బిధునాలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు పలు వాహనాలకు నిప్పు అంటించారు.

08/15/2018 - 16:46

న్యూఢిల్లీ: సకారాత్మక ఆలోచనతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ఆయన సుప్రీం కోర్టు ఆవరణలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ వ్యక్తిగత ఆకాంక్షలకు, సమస్యలకు అతీతంగా వ్యవహరించాలని అన్నారు.

08/15/2018 - 16:58

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, వ్యవస్థాపక సభ్యుడు అశుతోష్ వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ట్విటర్ వేదికగా అశుతోష్ స్పందిస్తూ.. ‘‘నేను పార్టీకి రాజీనామా చేశాను. దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరాను. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అశుతోష్ రాజీనామాపై ఇవాళ కేజ్రీవాల్ స్పందిస్తూ..

08/15/2018 - 12:21

జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయపతాకాన్ని ఎగురవేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. లాల్ చౌక్ సమీపంలోని క్లాక్ టవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకోవడంతో... ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

08/15/2018 - 12:17

చెన్నై: చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైన వాన 8.30 వరకు కురవడంతో.. ఆరు గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్నా సలై, వైట్‌ రోడ్‌, పీటర్స్‌ రోడ్‌, డాక్టర్‌ రాధాకృష్ణ సలై, యాక్టర్‌ రోడ్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, జీఎస్టీ రోడ్‌, పొన్నాంమళే రోడ్‌, సీటీహెచ్‌ రోడ్లన్నీ వరదమయ్యాయి.

08/15/2018 - 12:13

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలకు మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు.

08/15/2018 - 12:06

కేరళ: వర్ష బీభత్సానికి అల్లాడిపోతున్న కేరళ ఈ ఏడాది ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటల పండుగగా ఓనం పండుగ సుప్రసిద్ధమైంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే, రాష్ట్రాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

08/15/2018 - 06:06

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 2019 ఫిబ్రవరిలో లోక్‌సభతోపాటు 12 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు రాసిన లేఖలో జమిలి ఎన్నికలను సమర్థించటం వెనక ఉన్న ఆలోచన ఇదేనని బీజేపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. జమిలి ఎన్నికలకోసం లోక్‌సభ కాల పరిమితిని మూడు నెలలు కుదించాలనుకుంటున్నారు.

08/15/2018 - 05:22

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కోరిన 24 గంటల అనంతరం ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది విస్తృతమైన న్యాయ ప్రక్రియ కావడంతో ఇప్పట్లో అది సాధ్యం కాదని అన్నారు.

Pages