S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/15/2018 - 02:06

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాని మోదీ లోక్‌సభను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ సవాల్ విసిరారు. మోదీకి గనుక ధైర్యం ఉంటే లోక్‌సభను రద్దు చేసి సాధారణ ఎన్నికలు ప్రకటించాలని, తాము ఎన్నికలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.

08/15/2018 - 02:06

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు. చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా నగరమంతా రెప్పవాల్చని నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను దించారు.

08/14/2018 - 17:14

హైదరాబాద్: జీఎస్టీ అమలులో లోపభూయిష్టమైన విధానాలు ఉండటం వల్లే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నష్టపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మంగళవారంనాడు యువ పారిశ్రామికవేత్తల ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు వల్ల ఎవరికీ లాభం చేకూరిందో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు.

08/14/2018 - 17:11

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ (90) మంగళవారంనాడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి క్షీణించటంతో రాయపూర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారని రాజభవన్ అధికారులు వెల్లడించారు.

08/14/2018 - 17:08

న్యూఢిల్లీ: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం అసాధ్యమని చీఫ్ ఎన్నికల కమిషనర్ రావత్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందిని అన్నారు. అలాగే న్యాయపరమైన అంశాలు పూర్తిచేయటానికి సమయం కావాల్సి ఉంటుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు నిర్వహించటం అసాధ్యమని తేల్చిచెప్పారు.

08/14/2018 - 13:54

కాన్పూర్: జనవరిలో జరుగబోయే కుంభమేళకు ముందే గంగానదిని ప్రక్షాళన చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కేంద్రం, యూపీ ప్రభుత్వాలు నిధులు మంజూరుచేస్తాయని తెలిపారు.కేంద్రం 1700 కోట్ల రూపాయలు మంజూరుచేస్తుందని చెప్పారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు 40 మంది ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలుగా ఎయర్‌బోట్ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.

08/14/2018 - 13:07

జమ్మూకాశ్మీర్: కుప్వారా జిల్లాలో పాకిస్థాన్ స్థావరాలపై ఆర్మీ అధికారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఈ ప్రాంతంలో పాక్ సోమవారం కాల్పులు జరిపింది. దీంతో ఆర్మీ దళాలు ఎదురుకాల్పులు నిర్వహించగా ఇద్దరు జవాన్లు మృతిచెందారు.

08/14/2018 - 13:06

న్యూఢిల్లీ: రాగల 48 గంటలలో ఐదు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింద. కేరళ,తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ శాస్తవ్రేత్త మృత్యుంజయ మహోపాత్ర వెల్లడించారు. అల్పపీడనం బలపడితే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

08/14/2018 - 13:05

హైదరాబాద్: తెలంగాణలోకి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన హరితప్లాజాలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ పొత్తులు స్థానిక నాయకుల అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతాయని వెల్లడించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

08/14/2018 - 05:05

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర నడిబొడ్డున నిత్యం అత్యంత భద్రత ఉండే కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాన్‌స్టిట్యూషన్ క్లబ్ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై ఓ ఆగంతకుడు కాల్పులకు దిగాడు. ఖలీద్ కాల్పుల నుంచి తప్పించుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Pages