S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/14/2018 - 03:18

బీదర్ (కర్నాటక), ఆగస్టు 13: రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. ఈ డీల్‌పై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ జాతి ప్రయోజనాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు.

08/14/2018 - 03:15

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఏ-1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత పాటించడంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దేశంలో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే ఎ కేటగిరీ రైల్వేస్టేషన్లలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అనే సంస్థ ఈ విషయంపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించింది.

08/14/2018 - 03:14

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై జరిగిన దాడికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 11 మంది ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న తనపై దాడి చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

08/14/2018 - 03:02

తిరువనంతపురం, ఆగస్టు 13: భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. సోమవారం తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదనీటి ప్రభావం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులెవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

08/14/2018 - 05:44

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్టప్రతి భవనాన్ని ప్రజలకోసం తెరిచి ఉంచుతున్నారు. ఉపరాష్టప్రతి పదవి రాజ్యాంగపరమైనది, ఈ పదవిలో ఉన్నవారు భద్రతా వ్యవహారాలు, ప్రోటోకాల్ నియమాల మూలంగా ప్రజలకు కొంత దూరంగా ఉండవలసి వస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవలసి వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు ప్రోటోకాల్ నియమాలకు లోబడే ఉప రాష్టప్రతి భవనాన్ని ప్రజలకోసం తెరిచి ఉంచుతున్నారు.

08/14/2018 - 02:33

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహించటం ద్వారా అభివృద్ధి, సుపరిపాలనకు స్వాగతం పలకాలని బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా లా కమిషన్‌కు సోమవారం రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. లా కమిషన్ జమిలి ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

08/14/2018 - 02:32

న్యూఢిల్లీ, ఆగస్టు 13: స్వచ్ఛ రైల్వే స్టేషన్లు ర్యాంకుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన తిరుపతి, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేకు సంబంధించిన వివరాలను సోమవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. ఇక ఏ1 స్వచ్ఛ రైల్యే స్టేషన్ల కేటగిరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కు మూడోస్థానం లభించింది.

08/13/2018 - 17:17

న్యూఢిల్లీ: జెఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీదాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అయితే ఖలిద్ ఎటువంటి గాయాలబారిన పడలేదు. సోమవారం పార్లమెంటుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు గాలింపుచేపట్టారు. అగంతుకుడు ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/13/2018 - 17:16

చెన్నై: కరుణానిధి కన్నుమూసి వారం రోజులు గడవక ముందే ఆ పార్టీలో అన్నదమ్ముల మధ్య పోరు మొదలైంది. సోమవారంనాడు కరుణానిధి పెద్ద కుమారుడు మెరీనా బీచ్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ కరుణానిధిని అభిమానించే పార్టీ క్యాడర్ అంతా తన వెనుకే ఉందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. స్టాలిన్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా ఉన్నారు.

08/13/2018 - 14:05

గుజరాత్: గుజరాత్‌లోని పంచమహల్‌లో 10మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి ముగ్గురిని రక్షించారు.

Pages